వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్ము బస్టాండ్ లో పేలుడు .. 18 మందికి గాయాలు ... 10 నెలల్లో మూడో పేలుడు

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్ : సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతుండగానే జమ్ము బస్టాండ్ లో గ్రనేడ్ పేలుడుతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అంతర్జాతీయ సరిహద్దుకు కూతవేటు దూరంలో, ఎప్పుడూ రద్దీగా ఉండే జమ్ము బస్టాండ్ ను లక్ష్యంగా చేసుకొని పేలుడుకు పాల్పడ్డారు. మధ్యాహ్నం సమయం కావడం .. తమ గమ్యస్థాన్యాలకు వెళ్లేందుకు ప్రయాణికులు రావడంతో ఎక్కువమంది ప్రయాణికులు గాయపడ్డారు.

<strong>కశ్మీర్ వ్యాపారులపై విశ్వహిందూ దళ్ ప్రతాపం .. లక్నో నడిబొడ్డున పిడిగుద్దులు .. సోషల్ మీడియాలో వైరల్</strong>కశ్మీర్ వ్యాపారులపై విశ్వహిందూ దళ్ ప్రతాపం .. లక్నో నడిబొడ్డున పిడిగుద్దులు .. సోషల్ మీడియాలో వైరల్

పేలుడుతో కమ్ముకొన్న పొగ

పేలుడుతో కమ్ముకొన్న పొగ

ప్రయాణికులు తమ గమ్యస్థానాల కోసం వెళ్లే బస్సుల కోసం ఎదురుచూస్తుండగా ముష్కరులు గ్రనేడ్ ను పేల్చారు. ఏం జయురుగుతుందోనని అనుకునేలోపే బస్టాండ్ లో చెల్లాచెదురుగా పడిఉన్నారు. శక్తిమంతమైన గ్రనేడ్ పేలుడుతో 18 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం జమ్ము మెడికల్ కాలేజీకి తరలించినట్టు పేర్కొన్నారు. వీరంతా బస్సు డ్రైవర్లు, కండక్టర్ల అని తెలిపారు.

ముమ్మరంగా సోదాలు

ముమ్మరంగా సోదాలు

పేలుడుతో ఒక్కసారిగా జమ్ములో ఆందోళన నెలకొంది. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు .. బస్టాండ్ పరిసరాల్లో విసృతంగా సోదాలు చేపట్టారు. పేలుడు జరిగిన సమయంలో బస్టాండ్ వద్ద ఉన్న ప్రత్యక్ష సాక్షులు మాత్రం బస్సు లోపల పేలుడు జరిగిందని చెప్తున్నారు. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు ఉన్నరా అనే అంశంపై స్పష్టత రాలేదు. దీనిపై విచారణ జరుపుతున్నామని .. పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే మరోవైపు బస్టాండ్ లో టైర్ పేలింది మరో ప్రత్యక్షసాక్షి చెప్తున్నారు. టైర్ పేలింది .. కానీ పెద్ద శబ్ధంతో పేలిందని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. అయితే అంతర్జాతీయ సరిహద్దుకు కూతవేటు దూరంలో పేలుడు జరుగడం ఆందోళన కలిగిస్తోంది.

రంగంలోకి స్నిపర్ డాగ్స్ ...

రంగంలోకి స్నిపర్ డాగ్స్ ...

జమ్ము బస్టాండ్ పేలుడుపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. బస్టాండ్ లో బాంబు పెట్టింది ఎవరు ? వారికి సహకరించింది ఎవరనే కోణాల్లో విచారణ చేస్తున్నట్టు వెల్లడించారు. తగిన సాక్ష్యాధారాలు కనుగొని .. నిందితులను పట్టుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే స్నిపర్ డాగ్స్ పరిసరాల్లో ఎంక్వైరీ జరుగుతోందని చెప్పారు. మరోవైపు ఇధి గ్రనేడ్ పేలుడు అని .. 18 మం గాయపడ్డారని జమ్ము ఐజీ ఎంకే సిన్హా తెలిపారు.

10 నెలల్లో మూడో పేలుడు

10 నెలల్లో మూడో పేలుడు

జమ్ముకశ్మీర్ లో ఉగ్ర మూకల పేట్రెగిపోతున్నారు. జమ్ము బస్టాండ్ లో గ్రనేడ్ పేల్చింది ఎవరో తెలియలేదు. పోలీసులు విచారణ జరుపుతుండగా .. తామే పేల్చినట్టు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. గత 10 నెలల్లో కశ్మీర్ లో జరిగిన మూడో పేలుడు ఇది అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గత డిసెంబర్ 28న జమ్ము పోలీస్ స్టేషన్ లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రనేడ్ తో దాడిచేశారు. ఈ ఘటనలో పోలీసు స్టేషన్ ధ్వంసమైంది. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. మే 24న బస్టాండ్ లో గ్రనేడ్ తో దాడి చేయగా ... ముగ్గురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు.

English summary
An explosion has taken place at the Jammu bus stand on Thursday. Several people were reportedly injured in the blast that reportedly took place inside a bus. Police have cordoned off the area. Nature and the cause is being ascertained, police have said. Injured people have been admitted to the hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X