వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు...ఆరుగురు మృతి

|
Google Oneindia TeluguNews

ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లో ఉన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 6 మంది మృతి చెందగా 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరందరినీ చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. వీరందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

అగ్ని ప్రమాదానికి కారణం ప్లాంట్‌లో పేలుడు చోటుచేసుకోవడమేనని అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 10:50 గంటలకు ప్లాంట్‌లో పేలుడు చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ఈ పేలుడు గ్యాస్ పైప్‌లైన్‌‌లో సంభవించినట్లు వారు వివరించారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు. ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Blast occurred in Bhilai steel plant, 6 killed and 15 injured

గతేడాది నవంబర్‌లో ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్‌చహార్‌లోని నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్ పేలుడు సంభవించడంతో 43 మంది మృతి చెందారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన కమిటీ వేసింది. అయితే ఈ ప్రమాదానికి కారణం ఆపరేషన్స్ సిబ్బందే అని కమిటీ నివేదికలో పేర్కొంది. యూనిట్‌ను మూసివేసి ఉంటే ప్రమాదం జరిగేది కాదని దీన్ని కూడా సిబ్బంది విస్మరించిందని అందుకే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని కమిటీ రిపోర్ట్ పేర్కొంది.

English summary
As many as six employees were killed and 15 others injured in a major blast at state-run Steel Authority of India Limited’s Bhilai plant in Durg district of Chhattisgarh, police said.“All of them are said to be serious and are admitted to the district hospital. The figures (of the dead) could rise in the next couple of hours,” Durg’s inspector general of police GP Singh said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X