వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంద దళితుడి బలవన్మరణం : కుమారుడి హంతకులపై చర్యలు తీసుకోకపోవడంతో ...

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా : చేతికొచ్చిన కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అతని చావకొట్టిన వారు మాత్రం వీధుల్లో దర్జాగా తిరుగుతున్నారు. వారిపై చర్యలు తీసుకొమ్మని అడిగితే పట్టించుకునే పోలీసు లేడు. పైగా చనిపోయిన యువకుడి తండ్రి అందుడు .. ఇక తనకు న్యాయం జరగదని భావించాడు. కొడుకు దగ్గరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. భార్య, మరో కుమారుడిని వదిలి .. విషం తాగి ఆసువులు బాశాడు. రాజస్థాన్‌లో జరిగిన ఈ విషాద ఘటన ఆ కుటుంబంలో శోకం నింపింది. బాధిత కుటుంబం దళితులు కాబట్టే పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

నిరుపేద అంద దళితుడు

నిరుపేద అంద దళితుడు

రాజస్థాన్‌లోని భీవండికి చెందిన రాతిరన్ జాతవ్ దళితుడు. అతను నిరుపేద అంధుడు కూడా. అతనికి భార్య, హరీశ్, దినేశ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే పెద్ద కుమారుడు చేసిన ప్రమాదం అతని కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. గత నెల 16న హరీశ్ .. రహదారిపై బైక్‌పై వెళ్తున్నాడు. అయితే అతను ఓ మహిళను ఢీ కొన్నాడు. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమె కుటుంబసభ్యులు కోపోద్రిక్తులయ్యారు. హరీశ్ ఆచూకీ కనుకొని దాడి చేశారు. ఎంతలా అంటే అతన చనిపోయేలా చితక్కొట్టారు. తలకు తీవ్రగాయాలవడంతో .. ఢిల్లీలోని సఫ్దార్ గంజ్ ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. రెండురోజుల తర్వాత హరీశ్ చనిపోయాడు.

 కుమారుడి మృతితో

కుమారుడి మృతితో

హరీశ్ మృతితో అతని తండ్రి రతన్ కలత చెందాడు. అతనిపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. కానీ దళిత సామాజిక వర్గానికి చెందిన రాతిరన్ గోడును పట్టించుకోలేదు ఖాకీలు. నెల గడుస్తోన్న వారిపై చర్యలు తీసుకోలేదు. అదీ కాకుండా మహిళను ఢీ కొట్టాడని హరీశ్‌పై కేసు నమోదు చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు రతన్. తనకు న్యాయం జరగదని భావించాడు. నిన్న రాత్రి విషం తాగి చనిపోయాడు. తన కుమారుడిని హతమార్చిన దుండగులపై చర్యలు తీసుకోవడం లేదని .. అలాగే దాడిచేసిన వారు బెదిరిస్తున్నారని బంధువులు చెప్తున్నారు. దళిత సామాజికవర్గానికి చెందిన తండ్రీకొడుకులు చనిపోవడంతో కలకలం నెలకొంది.

 అంతా మీరే చేశారు

అంతా మీరే చేశారు

తన తండ్రి చనిపోవడానికి పోలీసుల వైఖరే కారణమని రతన్ రెండో కుమారుడు దినేశ్ అంటున్నాడు. తమకు న్యాయం చేయాలని పోలీసుల చుట్టూ తిరిగిన లాభం లేకపోయిందన్నారు. నిందితులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనకాడరని పేర్కొన్నారు. అందుకోసమే తన తండ్రి చనిపోయాడని పేర్కొన్నారు. ఒకవేళ పోలీసులు స్పందించి .. చర్యలు తీసుకుంటే ఇవాళ తమతో తండ్రి ఉండేవారని గద్గత స్వరంతో రోదిస్తూ చెప్పాడు.

English summary
Nearly a month after 28-year-old Harish Jatav was beaten to death after his motorcycle hit a woman in Bhiwandi, Rajasthan, his blind father has committed suicide, allegedly by consuming poison. The deceased, Rattiran Jatav, a Dalit, reportedly killed himself on Thursday night after police failed to act against the people who killed his son last month. It is also alleged that he killed himself because he was receiving threat calls from the accused. Superintendent of Police (SP) Alwar said the man was brought dead to the hospital. "The case is being investigated."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X