వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

827 పోర్న్ వెబ్‌సైట్లను నిషేధించండి... ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు కేంద్రం ఆదేశం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పోర్న్ వెబ్‌సైట్లను నిషేధించాల్సిందిగా ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగింది. మొత్తం 827 పోర్న్ వెబ్‌సైట్లు బ్లాక్ చేయాల్సిందిగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను కోరింది. ఇదిలా ఉంటే ఉత్తరాఖండ్ హైకోర్టు మొత్తం 857 పోర్న్ వెబ్‌సైట్లను నిషేధించాల్సిందిగా ఆదేశించింది. అయితే ఐటీ మంత్రిత్వ శాఖ మాత్రం ఇందులో 30 వెబ్‌సైట్లలో ఎలాంటి పోర్న్ కంటెంట్ లేనందున వాటికి మినహాయింపు ఇచ్చింది. మొత్తం 827 పోర్న్ వెబ్‌సైట్లను నిషేధించాలంటూ ఐటీశాఖ టెలికాం శాఖకు ఓ జాబితా సమర్పించింది.

100శాతం గ్రామాలకు విద్యుత్ : మోడీ ప్రభుత్వంలో వెలిగిపోయిన గ్రామీణభారతం 100శాతం గ్రామాలకు విద్యుత్ : మోడీ ప్రభుత్వంలో వెలిగిపోయిన గ్రామీణభారతం

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అన్ని లైసెన్సులు కలిగిన ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు 827 పోర్న్ వెబ్‌సైట్లపై నిషేధం విధించాలని టెలికాంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే హైకోర్టు సెప్టెంబర్ 27,2018న పోర్న్ వెబ్‌సైట్లను నిషేధించాలని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులు ఐటీశాఖకు అక్టోబర్ 8న అందాయి.

Block 827 Porn Websites,Centre Asks Internet Providers

అదే రోజున టెలికాంశాఖకు హైకోర్టు ఆదేశాల గురించి లేఖలో ఐటీ శాఖ వివరించింది. 857 పోర్న్ వెబ్‌సైట్లపై తక్షణమే నిషేధం విధించాలని కోరింది. ఇది జూలై 31,2015లో పేర్కొన్న ఆదేశాలకు కొనసాగింపుగానే ప్రక్రియ ప్రారంభించాలని పేర్కొంది. ఇదిలా ఉంటే టెలికాంశాఖ 2015 ఆగష్టు 4న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ వెబ్‌సైట్లలో పిల్లల పోర్న్‌కు సంబంధించిన కంటెంట్ ఉంటే వాటిని మాత్రమే తీసివేయాలని కోరింది.

English summary
The government has directed Internet Service Providers to block 827 websites that host pornographic content following an order by the Uttarakhand High Court, according to official sources.While the Uttarakhand High Court has asked to block 857 websites, the Ministry of Electronics and IT (Meity) found 30 portals without any pornographic content. Meity asked the Department of Telecom (DoT) to block 827 websites named in the list issued as part of the order, sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X