వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా కల్లోలం: బీఎంసీ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ మృతి, 50 లక్షల ఎక్స్‌గ్రేషియా

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ శిరీష్ దీక్షిత్ మృతి చెందారు.

వాటర్ సప్లై డిపార్ట్‌మెంట్‌లో దీక్షిత చీఫ్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కరోనావైరస్ కారణంగా బీఎంసీ వాటర్ సప్లై శాఖలో ఇంజినీర్ అయిన శిరీష్ దీక్షిత్ ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. విధులు నిర్వహిస్తూనే 54ఏళ్ల వయస్సులో ఆయన కరోనా బారిన పడి మృతి చెందారు.

BMC deputy municipal commissioner dies of Corona, ex-gratia of Rs 50 lakh announced.

కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ.. దీక్షి అనారోగ్యానికి గురికావడంతో వెంటనే ఆయన కుటుంబసభ్యులు వైద్యులకు సమాచారం అందించారు. ఆరోగ్య సిబ్బంది ఆయన ఇంటికి చేరుకునేప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారు. కాగా, విధుల్లో ఉండగా మరణించిన దీక్షిత్ కుటుంబానికి బీఎంసీ రూ. 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది.

కాగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మహారాష్ట్రలోనే అత్యధికంగా నమోదైన విషయం తెలిసిందే. మరణాలు కూడా ఈ రాష్ట్రంలోనే ఎక్కువగా నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 88,529 కరోనా పాజిటివ్ కేసులుండగా, 44,385 యాక్టివ్ కేసులున్నాయి. 40,975 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 3169 మంది కరోనాతో మరణించారు.

ఇక దేశ వ్యాప్తంగా కరోనా కేసులను పరిశీలించినట్లయితే.. ఇప్పటి వరకు దేశంలో 2,70,876 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,31,927 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 1,31,380 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 7554 మంది ప్రాణాలు కోల్పోయారు.

English summary
BMC deputy municipal commissioner dies of Corona, ex-gratia of Rs 50 lakh announced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X