వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
షాక్: కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థి ఆస్తి రూ. 690కోట్లు
ముంబై: భారతీయ జనతా పార్టీ తరపున బృహత్ ముంబై పురపాలక(బీఎంసీ) ఎన్నికల్లో పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థి ఆస్తులు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాయి. మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రకాశ్ మెహాతాకు సన్నిహితుడైన రియల్టర్ పరాగ్ షా బీఎంసీకి పోటీ చేస్తున్నాడు.
ఘట్కోపర్ వార్డు నుంచి పోటీ చేస్తున్న షా తన ఎన్నికల ఆఫిడవిట్లో రూ. 690 కోట్ల ఆస్తులు చూపారు. స్థిరాస్తులు రూ. 20 కోట్ల వరకు ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ.. తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు.

రాజకీయాలు తనకు కొత్త అని తెలిపారు. 22ఏళ్ల కష్టమే తనకు ఈ ఆస్తులు అని చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతానని స్పష్టం చేశారు. ప్రజలకు పారదర్శక పాలన అందిస్తానని చెప్పారు. కాగా, ఫిబ్రవరి 21న 227 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.