వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధారావిలో ఏం జరుగుతోంది? పారిశుద్ధ్య కార్మికుడికి వైరస్.. మరో కానిస్టేబుల్‌కు కూడా

|
Google Oneindia TeluguNews

నిజమే, ప్రభుత్వ విధానాల్లో లోపాలను ఎత్తిచూపడానికి ఇది సమయంకాదు. ప్రపంచమే కరోనా విలయంలో కొట్టుమిట్టాడుతోంది. కానీ వైరస్ నివారణ, నియంత్రణ చర్యల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతోన్న వైద్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అందరిపైనా ఉంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన మహారాష్ట్రలో.. పారిశుద్ధ్య కార్మికుడికి వైరస్ సోకడం, బెంగళూరులో పారిశుద్ధ్య సిబ్బందికి మాస్కులు సరఫరా చేయలేదని వెల్లడికావడంతో వారి భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్నది.

దేశంలోనే అత్యధిక 339 కరోనా పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర మోస్ట్ ఎఫెక్టెడ్ ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై సిటీలోనే 100 మందికిపైగా వైరస్ సోకింది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరుపొందిన ధారావిలో 24 గంటల వ్యవధిలోనే రెండో పాజిటివ్ కేసు నమోదుకావడం, అందులో ఒకరు మరణించడం కలకలం రేపింది. పాజిటివ్ గా తేలిసిన రెండో వ్యక్తి.. బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్(బీఎంసీ)లో పారిశుద్ధ్య కార్మికుడని అధికారులు వెల్లడించారు. వొర్లీలో నివసించే ఆ కార్మికుడు.. ప్రతిరోజూ ధారావీకి వెళ్లి పనిచేస్తుంటాడని, ప్రస్తుతం ఆయనను ఐసోలేషన్ వార్డుకు తరలించామని పేర్కొన్నారు. ముంబై సిటీ కమిషనరేట్ లో పనిచస్తోన్న ఓ కానిస్టేబుల్ కు కూడా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో సిబ్బంది భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

BMC Sanitation Worker is 2nd Covid-19 Case in Mumbais Dharavi

దాదాపు 15 లక్షల మందికిపైగా పేదలు దగ్గరదగ్గరగా నివసించే ధారావీలో వైరస్ విస్పోటనం జరిగితే ఊహించలేనంత పెద్ద ప్రమాదం తలెత్తే అవకాశముంది. దీంతో అధికారులు ఆ మురికివాడపై స్పెషల్ ఫోకస్ పెట్టి చర్యలు తీసుకుంటున్నారు. వైరస్ తో చనిపోయిన వ్యక్తి ఇంటిని ఖాళీ చేయించి, ఆ ప్రాంతమంతా క్రిమిసంహారక మందులు చట్టారు. చనిపోయిన వ్యక్తికుటుంబీకులు, పక్కింటివాళ్లను కూడా క్వారంటైన్ కు తరలించినట్లు బీఎంసీ అధికారులు చెప్పారు. మరోవైపు..

కర్నాటకలోనూ ఇదే తరహా ఘనటలు వెలుగుచూశాయి. బృహత్ బెంగళూరు మహానగర్ పాలికె(బీబీఎంపీ)కి చెందిన పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది సరిపడా మాస్కులు, ఇతర రక్షణ సదుపాయాలు కల్పించకపోవడం కలకలం రేపింది. పలు చానెళ్లలో దీనికి సంబంధించిన వార్తలు ప్రసారంకాగా, మేయర్ గౌతం కుమార్ స్పందించారు. బీబీఎంపీలో కార్మికులందరికీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని, వాళ్లంతా మాస్కులు ధరించి పనులు చేస్తూ, వీలైనన్ని ఎక్కువసార్లు శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకుంటున్నారని మేయర్ తెలిపారు.

English summary
A BMC sanitation worker tested positive for Covid-19 in Mumbai’s Dharavi today, less than 24 hours after a 56-year-old resident of the area died due to the pandemic
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X