వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కంగనా రనౌత్‌తో వార్: మణికర్ణిక ఫిల్మ్స్ ఆఫీస్ అక్రమ నిర్మాణం: కూల్చివేతకు నోటీసులు

|
Google Oneindia TeluguNews

ముంబై: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్‌తో ముంబై అధికారులు వార్ ప్రకటించినట్టు కనిపిస్తోంది. ముంబై మహానగరాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్‌గా ప్రకటించడం పట్ల ఇప్పటికే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన అధికారులు.. మరో అడుగు ముందుకు వేశారు. మణికర్ణిక ఫిల్మ్స్ పేరుతో కంగనా రనౌత్ నిర్మిస్తోన్న భవనం అక్రమం అంటూ నోటీసులను అందజేశారు. నోటీసు ప్రతులను మణికర్ణిక ఫిల్మ్స్ కార్యాలయం గోడలకు అంటించారు. అక్రమ నిర్మాణం కావడం వల్ల దాన్ని కూల్చేస్తామని వెల్లడించారు.

కంగనా రనౌత్ కార్యాలయంలో బీఎంసీ దాడులు: కూల్చేస్తారంటూ 'క్వీన్’ ట్వీట్కంగనా రనౌత్ కార్యాలయంలో బీఎంసీ దాడులు: కూల్చేస్తారంటూ 'క్వీన్’ ట్వీట్

ముంబైపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలను శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ తప్పు పట్టడం, ఆమెను అడుగు పెట్టనివ్వబోమంటూ హెచ్చరించడం, ఆ వెంటనే కేంద్ర ప్రభుత్వం వై సెక్యూరిటీని కల్పించడం వంటి పరిణామాల అనంతరం.. ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యతనుసంతరించుకుంది. కంగనా రనౌత్ ప్రస్తుతం తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లో ఉంటున్నారు. బుధవారం ఆమె ముంబైకి బయలుదేరి వెళ్లనున్నారు.

BMC serves notice to Kangana Ranaut on illegal construction at actor’s Mumbai office

ముంబై బాంద్రా ప్రాంతంలోని పాలీ హిల్‌లో మణికర్ణిక ఫిల్మ్స్ పేరుతో కంగనా రనౌత్ ఈ భవనాన్ని నిర్మించారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 354 (ఎ) కింద ఈ భవనం అక్రమ నిర్మాణం అంటూ బీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. భవనం నిర్మాణం మొత్తం నిబంధనలకు విరుద్ధంగా చోటు చేసుకుందని పేర్కొన్నారు. టాయ్‌లెట్‌ను ఆఫీస్ క్యాబిన్‌గా నిర్మించారని ఈ నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. 24 గంటల్లోగా నోటీసులకు వివరణ ఇవ్వాలని, లేకపోతే కూల్చి వేస్తామని స్పష్టం చేశారు.

ఈ నోటీసుల ప్రకారం.. 24 గంటల్లోగా కంగనా రనౌత్ మణికర్ణిక ఫిల్మ్స్ భవనానికి సంబంధించిన అన్ని అనుమతులు, పునరుద్ధరణ కోసం చేపట్టిన నిర్మాణాలకు సంబంధించిన పూర్తి వివరాలను బీఎంసీ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. గడువులోగా అనుమతి పత్రాలను అందజేయకపోతే.. ఎలాంటి నోటీసులను అందజేయకుండా.. భవనాన్ని కూల్చేస్తామని తెలిపారు. దీనికి అయ్యే ఖర్చును కూడా కంగనా రనౌత్ భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Recommended Video

Kangana Ranaut కి క్షమాపణ చెప్పను - Sanjay Raut | MP పై కంగనా ఘాటు విమర్శలు

దీనిపై కంగనా స్పందించారు. భవనం కూల్చివేత పనులను బీఎంసీ అధికారులు ఈ పాటికే చేపట్టి ఉండాల్సిందని, సోషల్ మీడియా, తన స్నేహితుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన కారణంగా.. తమ ప్రయత్నాలను విరమించుకున్నారని అన్నారు. బుల్‌డోజర్లకు బదులుగా నోటీసులను అంటించి వెళ్లారని చెప్పారు. ప్రస్తుతం తాను ఇబ్బందుల్లో ఉన్నానని, అందరి మద్దతు తనకు కావాలని కంగనా ట్వీట్ చేశారు.

English summary
The Brihanmumbai Municipal Corporation (BMC) has served Kangana Ranaut with a ‘stop work’ notice, a day after the actor expressed apprehension that they may demolish her office ‘Manikarnika Films ’ in Pali Hill area of Bandra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X