వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడాదిలో రెండుసార్లు బోర్డు పరీక్షలు: విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలు సులభతరం చేసేందుకు సంవత్సరానికి రెండుసార్లు పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులు జారీ చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ నిశాంక్ పోఖ్రియాల్ తెలిపారు. కాగా, కొత్త జాతీయ విద్యా విధానానికి(ఎన్ఈపీ-2020) కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసింది.

గత 34 సంవత్సరాలుగా కొనసాగుతున్న నాటి జాతీయ విద్యా విధానం స్థానంలో రూపుదిద్దుకుంది. ఇందులో పాఠశాల విద్య నుంచి ఎంఫిల్ వరకు విద్యా విధానంలో సమూల మార్పులు చేశారు. ముఖ్యంగా పరీక్షలకు ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులకు రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించే అవకాశం కల్పించింది.

 Board exams to be allowed twice a year as per new NEP 2020: HRD Minister Ramesh Nishank Pokhriyal

విద్యార్థులపై ఫైనల్ పరీక్షల భారాన్ని తగ్గించేందుకు ఏడాదికి రెండుసార్లు పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఫైనల్ పరీక్షల అత్యున్నత విద్యను లక్ష్యాలతో ఈ నూతన విధానాన్ని రూపొందించారు.

కొత్త జాతీయ విద్యా విధానంలో 18 సంవత్సరాల వరకు ఉచిత విద్యను అందించడం, అలాగే పూర్వ ప్రాథమిక విద్యపై దృష్టి పెడుతూ 10+2 విద్య స్థానంలో 5+3+3+4 సంవత్సరాల విద్యను తీసుకురానున్నారు. ఇప్పటి వరకు మానవ వనరుల శాఖగా ఉండగా.. దాన్ని విద్యా శాఖగా మార్చివేశారు.

English summary
The new National Education Policy passed by the cabinet on Wednesday did away with the 34-year-olf education policy and it brought with it a large number of changes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X