వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కచ్చులూరు తరహా బోటు ప్రమాదం: 30 మంది గల్లంతు: ఏడు మంది జలసమాధి

|
Google Oneindia TeluguNews

మాల్దా: మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అచ్చు తూర్పు గోదావరి జిల్లాలోని కచ్చులూరు తరహాలోనే ఓ బోటు నదిలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 50 మంది గల్లంతయ్యారు. ఏడు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్, బిహార్ సరిహద్దుల్లో ప్రవహించే మహానంద నదిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు.

బాండు రాసిస్తా... ఒక్క అవకాశం ఇవ్వండి... బోటు పైకి తీస్తా....! మరోసారి మీడియా ముందుకు వచ్చిన శివ

బిహార్ లోని కతిహార్ జిల్లా జగన్నాథ్ పూర్ నుంచి పశ్చిమ బెంగాల్ లోని మాల్దా, నార్త్ దినాజ్ పూర్ లోని చంచల్ గ్రామం మధ్య ఈ బోటు రోజూ రాకపోకలు సాగిస్తుంటుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న మహానంద నదిని దాటడానికి స్థానికులు బోటులో ప్రయాణిస్తుంటారు. ఇది రోజూ జరిగే ప్రక్రియే. జగన్నాథ్ పూర్ నుంచి బయలుదేరి.. ముకుంద్ పూర్ ఘాట్ కు చేరుకోవాల్సి ఉంది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల బోటు నది మధ్యలో మునిగిపోయింది. పశ్చిమ బెంగాల్, బిహార్ లల్లో కొద్ది రోజులుగా కురుస్తోన్న అతి భారీ వర్షాలకు మహానంద నది ఉధృతంగా ప్రవహిస్తోంది.

Boat carrying 60 people drowned In Mahananda river

అయినప్పటికీ.. నిర్వాహకులు సాహసానికి ఒడిగట్టారు. సామర్థ్యానికి మించిన ప్రయాణికులను ఎక్కించుకుని పశ్చిమ బెంగాల్ వైపు ప్రయాణం కట్టారు. 50 మందికి పైగా స్థానికులు ఎక్కడం, అదనంగా కొన్ని బైక్ లు, సైకిళ్లను కూడా తరలిస్తుండటంతో బోటు నది మధ్యలో ప్రమాదానికి గురైంది. ఫెర్రీ తరహా బోటు ఇది. బోటు ప్రమాదానికి గురైన వెంటనే స్థానికులు, మత్స్యకారులు అప్రమత్తం అయ్యారు. 20 మందిని రక్షించగలిగారు. మరో 30 మంది జాడ తెలియరాలేదు. ఈ క్రమంలో ఏడు మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

సాధారణంగా బోటులో అంతమంది ప్రయాణికులు ఎక్కరని, ముకుందా పూర్ ఘాట్ లో నిర్వహిస్తోన్న పడవ పందాలను తిలకించడానికి మాల్దా జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో స్థానికులు వచ్చారని, వారు తిరుగుముఖం పట్టిన సందర్భంగా రద్దీ ఏర్పడినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బలగాలు నదిలో నుంచి ఏడు మృతదేహాలను వెలికితీశారు. మృతులను ఇంకా గుర్తించలేదు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఈ ఘటన చోటు చేసుకోవడంతో.. ఆయా రాష్ట్రాలకు చెందిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

English summary
At least seven people died after a boat carrying them from Malda, West Bengal to Bihar's Katihar, capsized in Mahananda river on Thursday. Rescue operation by National Disaster Response Force (NDRF) is underway. The Malda District Magistrate, Kaushik Bhattacharya said, "Two people have died and 28 have been rescued after a boat carrying them capsized in Mahananda river, today. NDRF personnel are at the spot. The boat was carrying people to Katihar in Bihar from Malda in West Bengal."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X