వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరేబియా సముద్రం ముంబై తీరంలో మహారాష్ట్ర సీఎస్, ఎమ్మెల్సీ, కార్మికులతో వెళ్తున్న బోటు గల్లంతు

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలోని ముంబై సమీపంలోని అరేబియా సముద్రంలో ప్రయాణీకులతో కూడిన బోటు ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఛత్రపతి శివాజీ స్మారకానికి సమీపంలో ఈ పడవ బోల్తా పడినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురు గల్లంతయ్యారు. శివాజీ స్మారక కార్యక్రమానికి వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఈ బోటు మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందినదిగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. కోస్టు గార్డుకు చెందిన రెండు స్పీడ్ బోట్లు, రెండు హెలికాప్టర్లు సంఘటన స్థలానికి చేరుకొని, సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.

Boat carrying Maharashtra Chief Secretary capsizes off Mumbai coast

పడవలో ప్రయాణిస్తున్న చాలామందిని భారత కోస్ట్ గార్డ్ కాపాడినట్లు పీఆర్వో తెలిపారు. పడవలో మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ జైన్, ఎమ్మెల్సీ వినాయక్ మేటే సహా 25 మంది వరకు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది.

శివాజీ స్మారక నిర్మాణ పనులను పరిశీలించేందుకు రెండు స్పీడ్ బోట్లలో వెళ్తుండగా సీఎస్, ఎమ్మెల్సీ ఉన్న బోటు ప్రమాదానికి గురైంది. మరో బోటులో 40 మంది పాత్రికేయులు ఉన్నారు. శివాజీ స్మారకానికి 2.6 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. రాళ్లను పడవ ఢీకొట్టడంతో బోల్తా పడినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం కారణంగా శివాజీ స్మారకం వద్ద పనులు ఆగిపోయాయి. గల్లంతైన పడవలో సీఎస్, ఎమ్మెల్సీలతో పాటు పలువురు అధికారులు, కార్మికులు ఉన్నారు.

{document1}

English summary
A boat carrying several Maharashtra government officials including the state chief secretary capsized near Shivaji Smarak in Mumbai. All those involved in the mishap are safe, a government official said. The capsized boat belongs to the Maharashtra government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X