వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరమ్మాయిల ట్రాజెడీ లవ్‌స్టోరీ: వేరొకరిని పెళ్లాడటం ఇష్టం లేక: మిస్సింగ్..మృతదేహాలుగా

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: ఇద్దరమ్మాయిల లవ్‌స్టోరీ విషాదంతమైంది. రెండు రోజుల కిందట అదృశ్యమైన ఆ ఇద్దరు.. మృతదేహాలుగా కనిపించారు. ఆ ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వేరొకరిని పెళ్లాడటం ఇష్టం లేకపోవడం వల్ల జీవితంపై విరక్తి చెంది బలవన్మరణానికి పాల్పడి ఉంటారని తెలుస్తోంది. తమ కుమార్తెలు సజీవంగా తిరిగి వస్తారని ఆశించిన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది ఈ ఘటన.

డిగ్రీ విద్యార్థినుల మిస్సింగ్..

డిగ్రీ విద్యార్థినుల మిస్సింగ్..

మృతుల పేర్లు అమృత అణి, ఆర్యా అశోక్. ఇద్దరిదీ 21 సంవత్సరాలే. డిగ్రీ పూర్తి చేశారు. ఇద్దరిదీ కొల్లం జిల్లా. అమృత స్వస్థలం అయూర్. ఆ పట్టణానికి సమీపంలోని నీరొయికొడె గ్రామానికి చెందిన అశోక్ కుమార్ కుమార్తె ఆర్యా. జిల్లాలోని అంచల్ కాలేజీలో వారికి పరిచయం ఏర్పడింది. ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో తరచూ కలుసుకునే వారు. కాలేజీకి కలిసే వెళ్లేవారు. ఇద్దరి మధ్య స్నేహానికి మించిన అనుబంధం ఏర్పడింది. కాలేజీ నుంచి సర్టిఫికెట్లను తెచ్చుకోవడానికి తాము కొల్లం వెళ్తున్నామంటూ శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన వారిద్దరు ఇక మళ్లీ వెనక్కి తిరిగి రాలేదు.

మిస్సింగ్ కేసుగా

మిస్సింగ్ కేసుగా

అదృశ్యం అయ్యారు. వారి ఫోన్లు కూడా మూగబోయాయి. తమ కుమార్తెతో శుక్రవారం రాత్రి చివరిసారిగా మాట్లాడామని ఆర్య కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆ తరువాత ఆర్యతో పాటు అమృత ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయని పోలీసులకు తెలిపారు. చదయమంగళం పోలీస్ స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు అమ్మాయిల కోసం విస్తృతంగా గాలించారు. రెండురోజుల పాటు ఈ గాలింపు చర్యలు కొనసాగినప్పటికీ.. ఫలితం రాలేదు. సోమవారం సాయంత్రం అమృత మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు.

 రెండు రోజుల తరువాత మృతదేహాలు..

రెండు రోజుల తరువాత మృతదేహాలు..


అళప్పుజ జిల్లా పూచకల్ సమీపంలో వెంబనాడ్ రివర్ బ్యాక్ వాటర్‌లో ఆమె మృతదేహాన్ని తొలుత స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఆ మృతదేహం అమృతదిగా నిర్ధారించారు. మంగళవారం తెల్లవారు జామున ఆర్య మృతదేహం లభించింది. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం తరలించారు. వారు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాల కోసం పోలీసులు నిర్వహించిన దర్యాప్తులో అనూహ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Recommended Video

#SabarimalaTemple : సరికొత్త నిబంధనలతో.. భక్తుల కోసం తెరుచుకోనున్న Sabarimala ఆలయ తలుపులు!
అమృతకు పెళ్లి చేయడానికి

అమృతకు పెళ్లి చేయడానికి

అమృత అణి కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేపట్టడమే వారి ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ పెళ్లి జరిగితే..ఇక తాము జీవితంలో కలిసి ఉండలేమనే నిర్ధారణకు రావడం వల్లే అమృత, ఆర్యా బలవన్మరణానికి పాల్పడి ఉంటారని చెబుతున్నారు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటూ అమృత కుటుంబ సభ్యులకు తేల్చి చెప్పినప్పటికీ.. బలవంతంగా సంబంధం కుదిర్చారని, జనవరిలో పెళ్లి చేయాలని ముహూర్తాన్ని కూడా నిర్ణయించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. వేరొకరిని పెళ్లడటం ఇష్టం లేకపోవడం వల్ల వారు ఆత్మహత్యకు చేసుకుని ఉండొచ్చని చెబుతున్నారు.

English summary
The bodies of two young women who had gone missing from Kollam district a couple of days ago were retrieved from the Vembanad Backwaters. They had reportedly jumped into the Muvattupuzha river from the Murinjapuzha Bridge at Vaikom in Kottayam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X