వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశ రాజధాని ఢిల్లీలో 962 శవాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో అత్యాచారాలు ఎక్కువ అయ్యాయని తాజాగా వెలుగు చూసింది. గ్యాంగ్ రేప్ లతో పాటు ప్రతీకార హత్యలు ప్రతి రోజు పెరిగిపోతున్నాయని ఢిల్లీ నగరం అపఖ్యాతి మూటకట్టుకుంది. అదే విధంగా గుర్తు తెలియని శవాలు భారీగా పెరిగిపోతున్నాయి.

ఇది మన దేశ రాజధానిలో మహిళలకు ఉన్న భద్రత, వాస్తవ పరిస్థితి. గత నాలుగు నెలల్లో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో మొత్తం 962 గుర్తు తెలియని శవాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు వారి ఆచూకి లేదు. కనీసం ఒక్క క్లూ కూడ చిక్కకపోవడంతో పోలీసు అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

నాలుగు నెలల్లో 962 గుర్తు తెలియని శవాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని స్వయంగా సాక్షాత్తు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరి భాయ్ పార్థీబాబ్ చౌదరి పార్లమెంట్ లో ప్రకటించారు. ఆయన మాటల్లోనే ఢిల్లీ నగరంలో పరిస్థితి ఏ విధంగా ఉందే అర్థం చేసుకోవచ్చు.

Body of woman found in New Delhi

బీజేడీ ఎంపీ వైష్ణవ్ పరీదా అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ ఢిల్లీ నగరంలో ప్రతి రోజు సగటున ఎనిమిది శవాలు లభిస్తున్నాయని సమాధానం ఇచ్చారు. అంతే కాకుండ రోడ్డు పక్కన నిస్సహాయంగా పడి ఉండే ముసలివాళ్లు, అనారోగ్యం బారిన పడి ఉండే వారిని స్థానికులు గుర్తించి సమాచారం ఇస్తున్నారని చెప్పారు.

వారిని వెంటనే పునారావాస కేంద్రాలకు తరలిస్తున్నామని మంత్రి సమాధానం ఇచ్చారు. అయితే ఢిల్లీ నగరంలో నేరాలు అరికట్టడానికి తీసుకుంటున్న చర్యల విషయంలో మంత్రి ఏవిధంగాను సమాధానం చెప్పలేదు. మహిళలకు భద్రత కరువైయ్యిందని సాక్షాత్తు దేశ రాజధాని ఢిల్లీ నగరం మొదటి స్థానంలో నిలిచింది.

English summary
The woman, whose age is estimated to be around 35, was found naked and her face disfigured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X