• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాయ్స్ లాకర్ రూమ్: గ్యాంగ్-రేప్ చాట్స్ మాస్టర్ మైండ్ ఒక అమ్మాయి .. అవాక్కైన పోలీసులు

|

"బాయ్స్ లాకర్ రూమ్' కేసుపై దర్యాప్తులో, స్నాప్‌చాట్‌లో జరిగిన సంభాషణ విచారణలో షాకింగ్ ట్విస్ట్ వెలుగు చూసింది . ఈ కేసులో ఒక అమ్మాయి అబ్బాయిలా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అబ్బాయిల‌తో చాట్ చేసిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది. త‌న శ‌రీరంపై తానే అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేస్తూ, దానికి అబ్బాయిలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల‌ని తాను ఈ ప‌ని చేసిన‌ట్లు అందుకే అబ్బాయితో గ్యాంగ్ రేప్ పై చర్చ పెట్టినట్టు తెలుస్తుంది .

వద్దన్నా ఫుడ్ డెలివరీలు ... స్విగ్గి , జొమాటో డెలివరీ బాయ్స్ వాహనాలు సీజ్

ఢిల్లీలో ప్రకంపనలు సృష్టించిన బాయ్స్ లాకర్ రూమ్ గ్యాంగ్ రేప్ చాట్

ఢిల్లీలో ప్రకంపనలు సృష్టించిన బాయ్స్ లాకర్ రూమ్ గ్యాంగ్ రేప్ చాట్

గత నెలలో ఇన్‌స్టాగ్రామ్‌'లో కొందరు ‘బాయ్స్‌ లాకర్‌ రూం' పేరిట గ్రూపు కట్టి, అందులో తమ సహ విద్యార్థినులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం, వారి ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేయడం వంటివి చేశారు. అంతేకాదు కొందరు బాలికల పేర్లు చెప్పి, వారిపై సామూహిక అత్యాచారం చేద్దామంటూ మాట్లాడుకోవడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. 'బాయ్స్ లాకర్ రూమ్' ఇన్‌స్టాగ్రామ్ గ్రూపుకు సంబంధించిన ఈ గ్రూప్ చాట్ లో మైనర్ అమ్మాయిల చిత్రాలను మార్ఫ్ చేసి ఇష్టారాజ్యంగా డర్టీ చాట్ చేసినట్టు పోలీసులు ఆదివారం తెలిపారు.

 పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు .. సూత్రధారి ఒక అమ్మాయే

పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు .. సూత్రధారి ఒక అమ్మాయే

అయితే, స్నాప్‌చాట్ సంభాషణలో పాల్గొన్న వారి ఫోన్స్ స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపినట్లు వారు తెలిపారు.'బాయ్స్ లాకర్ రూమ్' కేసు గ్యాంగ్ రేప్ కు సంబంధించి ఒక స్కూల్ విద్యార్థులు , మైనర్ల గ్రూప్ చాట్ల స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో వెలుగులోకి వచ్చింది . వాటిలో ఒకరి నుండి ఒకరికి స్నాప్‌చాట్ సంభాషణ ఉంది, ఇక ఈ డర్టీ చాట్ లో కీలక భూమిక పోషించింది ఒక అమ్మాయి అని తెలుసుకున్న పోలీసులు షాక్ తిన్నారు . ఆమెనే తన గురించి త‌న పేరు సిద్దార్థ్‌గా ఒక ఫేక్ అకౌంట్ సృష్టించి ఒక అబ్బాయి గా ప‌రిచ‌యం చేసుకొని , త‌న శ‌రీరంపై తానే అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేసింది.

తనపైనే అసభ్య చాట్ చేసుకుని అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతాడో టెస్ట్ చేసిన అమ్మాయి

తనపైనే అసభ్య చాట్ చేసుకుని అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతాడో టెస్ట్ చేసిన అమ్మాయి

ఒక అబ్బాయిని టార్గెట్ చేసి చేసిన ఈ చాట్ లో అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతాడో దాన్ని బ‌ట్టి త‌న క్యారెక్ట‌ర్ తెలుసుకోవ‌చ్చ‌ని భావించే ఈ తరహా చాట్ చేశానని స‌ద‌రు టీనేజీ అమ్మాయి విచార‌ణ‌లో వెల్లడించింది . ఇక ఈ విషయాన్ని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సైబర్ క్రైమ్ యూనిట్) అనియేష్ రాయ్ పేర్కొన్నారు . స్నాప్‌చాట్ సంభాషణ వాస్తవానికి ఒక అమ్మాయి మరియు అబ్బాయి మధ్య జరిగిందని దర్యాప్తులో తేలింది. ఒక టీనేజ్ అమ్మాయి 'సిద్ధార్థ్' పేరిట ఒక నకిలీ ప్రొఫైల్‌ను సృష్టించి, ఆమె ఎవరి గురించి తెలుసుకోవాలి అనుకుందో ఆ అబ్బాయికి తన గురించి చాలా డర్టీ చాట్ చేసి అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతాడో చూసి దానిని బట్టి అతని క్యారక్టర్ పరీక్షించాలని గ్యాంగ్ రేప్ చేద్దామంటూ సూచించింది.

  Railway Tickets Bookings Only Online On IRCTC Or Mobile App
  అంతా మైనర్లే ... 24 మంది విద్యార్థులను విచారిస్తున్న పోలీసులు

  అంతా మైనర్లే ... 24 మంది విద్యార్థులను విచారిస్తున్న పోలీసులు

  వీరంతా ఢిల్లీలోని ఒక ప్రముఖ స్కూల్ లో చదువుతున్న వారే . వీరంతా 18 ఏళ్లు అంత‌కంటే త‌క్కువ వ‌య‌సు ఉన్న‌వారే. అమ్మాయిల ఫోటోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి అస‌భ్య‌క‌రంగా గ్రూప్‌లో చ‌ర్చించుకున్నారు. దీనికి సంబంధించి విచార‌ణ చేపట్టిన పోలీసులు 24 మంది విద్యార్థుల‌ను అదుపులోకి తీసుకున్నారు . ఇక తీగ లాగితే డొంక కదిలిన చందంగా ఇందులో ప్రధాన సూత్రధారి ఒక అమ్మాయి అని తేలటం నిజంగా అవాక్కయ్యే అంశం .

  English summary
  In its investigation into the 'Bois Locker Room' case, the Delhi Police have stumbled upon a conversation on Snapchat where a girl, posing as a male, suggested a "sexual assault plan" to a boy just to test his "values and character".The last month's conversation was not in any way related to the 'Bois Locker Room' Instagram group in which obscene messages and morphed pictures of underage girls were shared, the Delhi police said on Sunday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more