వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

BoysLockerRoom : అరాచకానికి పీక్స్.. లీకైన స్క్రీన్ షాట్స్.. కుదిపేస్తోన్న ఆ వివాదం..

|
Google Oneindia TeluguNews

వయసు చిన్నదే.. కానీ ఆలోచనల్లో మాత్రం కౄరత్వం.. పైగా దాన్ని సాధారణంగానే భావించే మనస్తత్వం.. ఇటీవల లీకైన ఢిల్లీ స్కూల్ బాయ్స్ చాటింగ్‌ స్క్రీన్ షాట్స్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ స్క్రీన్ షాట్స్ చూసిన తల్లిదండ్రులు ఆడపిల్లలను స్కూల్‌కు పంపించడానికి జంకే పరిస్థితి. సోషల్ మీడియాలో తీవ్ర దుమారం లేపుతున్న ఈ స్క్రీన్ షాట్స్ #BoysLockerRoom హాష్ ట్యాగ్‌తో వైరల్‌గా మారాయి. దీంతో ఢిల్లీ మహిళా కమిషన్ రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది.

ఆ స్క్రీన్ షాట్స్‌లో ఏముంది..

ఆ స్క్రీన్ షాట్స్‌లో ఏముంది..

సౌత్ ఢిల్లీలోని కొన్ని ప్రముఖ స్కూళ్లలో చదువుతున్న కొంతమంది టీనేజ్ విద్యార్థులు ఇన్‌స్టాగ్రామ్‌లో 'Bois Locker Room' అనే ఓ చాట్ గ్రూప్ క్రియేట్ చేశారు. అందులో తమ క్లాస్‌మేట్స్,కొంతమంది మహిళల ఫోటోలు షేర్ చేసి వాళ్ల ప్రైవేట్ పార్ట్స్‌పై అసభ్య కామెంట్స్ చేశారు. 'నేను గట్టిగా చెప్తున్నా.. దాన్ని మనం ఈజీగా రేప్ చేయవచ్చు.. ', 'ఆమెకు ఫోన్ చేసి రమ్మను.. నువ్వు చెప్పిన చోటుకు వస్తా.. మన బాయ్స్‌ని కూడా పిలుస్తా.. అందరం కలిసి గ్యాంగ్ రేప్ చేద్దాం..' అంటూ చెప్పలేని రీతిలో అందులో చాట్ చేశారు. ఆదివారం ఈ గ్రూపుకు సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్స్ లీకై సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విద్యార్థినుల పట్ల ఆ బాయ్స్ ఆలోచనలు ఎంత కౄరత్వం నింపుకున్నాయో ఆ చాటింగ్‌ను బట్టి అర్థమవుతోంది.

మహిళా కమిషన్ సీరియస్..

మహిళా కమిషన్ సీరియస్..

@ashnaasharma అనే ఓ నెటిజెన్ మొదట ట్విట్టర్‌ ద్వారా దీన్ని అందరి దృష్టికి తీసుకొచ్చింది. 'నా లైఫ్‌లో నేనింతవరకు ఇంతలా ఎప్పుడూ భయపడలేదు. ఆ బాయ్స్‌ తాము చేస్తున్న పనికి ఏమాత్రం సిగ్గుపడట్లేదు. అంతేకాదు,మా అకౌంట్స్‌ను హ్యాక్ చేయడం కూడా మొదలుపెట్టారు. కానీ మమ్మల్ని ఏదీ ఆపలేదు.' అని పేర్కొన్నారు.ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌ పర్సన్ స్వాతి మాలివల్ ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించారు. ఆ సోషల్ మీడియా గ్రూపులో ఉన్న బాయ్స్‌ను అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. మహిళా కమిషన్ నుంచి ఢిల్లీ పోలీసులు,ఇన్‌స్టాగ్రామ్‌కు నోటీసులు పంపించామని.. ఆ బాయ్స్‌ను తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరామని స్వాతి మాలివల్ పేర్కొన్నారు.

సుమోటో కేసు నమోదు.. 15 ఏళ్ల విద్యార్థి అరెస్ట్..

సుమోటో కేసు నమోదు.. 15 ఏళ్ల విద్యార్థి అరెస్ట్..

సైబర్ సెల్ ఈ వ్యవహారాన్ని సుమోటో కేసుగా స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సోమవారం ఓ ప్రముఖ పాఠశాల కూడా దీనిపై సాకేత్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. దీనిపై విచారణ జరిపించాలని కోరిన ఆ స్కూల్ యాజమాన్యం.. ఆ గ్రూపులో మెంబర్‌గా ఉన్న ఓ 15 ఏళ్ల విద్యార్థి నంబర్‌ను కూడా పోలీసులకు ఇచ్చినట్టు తెలిపారు. ఆ గ్రూపులో అమ్మాయిల ఫోటో

షేర్ చేసింది అతనే అని చెప్పారు. ఆ నంబర్ ఆధారంగా అతని చిరునామా కనుక్కొని సోమవారం సాయంత్రం అరెస్ట్ చేశామన్నారు.

నిందితులను గుర్తించే పనిలో..

నిందితులను గుర్తించే పనిలో..

స్కూల్ గర్ల్స్ తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్‌లో పోస్ట్ చేసిన ఫోటోలను వారికి తెలియకుండా డౌన్ లోడ్ చేసి.. 'Bois Locker Room'లో వాటిని పోస్ట్ చేసి అసభ్యకర కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు. మార్చి నెల చివరి వారంలో ఈ గ్రూపును క్రియేట్ చేసిన బాయ్స్.. అందులో చాలామందినే యాడ్ చేసినట్టు గుర్తించారు. నిందితులపై సెక్షన్ 465,471,469,509,67,67Aల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. సౌత్ ఢిల్లీలోని నాలుగు స్కూళ్లకు చెందిన విద్యార్థులే ఇందులో ఉన్నట్టు గుర్తించామన్నారు. ఆ స్కూల్ ప్రిన్సిపాల్స్‌తో కూడా మాట్లాడామని చెప్పారు. మిగతా నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు.

Recommended Video

Lockdown 3.0 : It's Pollution Time, Massive Traffic Jams On Roads In Amid Relaxations
స్పందించిన ఫేస్‌బుక్..

స్పందించిన ఫేస్‌బుక్..

ఈ వివాదంపై ఫేస్‌బుక్ ప్రతినిధి ఒకరు ప్రెస్ స్టేట్‌మెంట్ విడుదల చేశారు. లైంగిక హింస,లైంగిక దోపిడీకి తావిచ్చే ఏ అంశాలను తాము సహించబోమని స్పష్టం చేశారు. ఇది తమ కమ్యూనిటీ కంటెంట్ నిబంధనలను ఉల్లంఘించినట్టేనని చెప్పారు. తాము దాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని.. తమ కమ్యూనిటీకి భద్రత,గౌరవం.. ఈ రెండూ తమకు టాప్ ప్రియారిటీ అని స్పష్టం చేశారు.

English summary
The Delhi Police Cyber Cell has lodged an FIR following a complaint about a private Instagram group, where teenage boys from prominent South Delhi schools discussed girls’ body parts and shared their photos. Police have also apprehended a 15-year-old boy and are probing the matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X