వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Drugsను భోజనంలా తీసుకుంటారు..ఆ బడా హీరో ఇంట్లో స్టాక్..బాంబు పేల్చిన ఇండస్ట్రీ వ్యక్తి

|
Google Oneindia TeluguNews

ముంబై: బాలీవుడ్ డ్రగ్స్ కంపు కొడుతోంది. పేరుకే బడా ఇండస్ట్రీ కానీ అక్కడ జరిగేవన్నీ అరాచకాలే అని ఈ డ్రగ్స్ వ్యవహారంతో తేటతెల్లమైంది. బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం ఈ నాటిది కాదని ఎప్పటి నుంచో డ్రగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా బాలీవుడ్ మారిందని చాలామంది ఇండస్ట్రీకి చెందిన వారు చెబుతున్నారు. తాజాగా ఓ జాతీయ ఛానెల్‌కు ఇండస్ట్రీకి చెందిన ఓ మహిళ చెప్పిన విషయాలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది.

 బాలీవుడ్ నటుడి ఇంట్లో డ్రగ్స్

బాలీవుడ్ నటుడి ఇంట్లో డ్రగ్స్

బాలీవుడ్‌లో పార్టీలు సర్వసధారణం. ఇక్కడ అంతా హైఫై మనుషులే వస్తుంటారు. బడా హీరోల నుంచి అగ్రదర్శకుల వరకు పార్టీలు అటెండ్ అవుతుంటారు. ఈ పార్టీల్లోనే డ్రగ్స్ ఎక్కువగా ఉంటాయని ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీకి చెందిన ఓ మహిళ చెప్పింది. 2019లో జరిగిన పార్టీకి సంబంధించి బయటపడ్డ వీడియో నిజమేనని తాను కూడా ఆపార్టీలో ఉన్నట్లు ఆమె తెలిపారు. అంతేకాదు చాలామంది నటులు డ్రగ్స్‌ తమ ఇంట్లో స్టాక్ పెట్టుకుంటారని ఆమె వెల్లడించింది.1990-95 మధ్య బాలీవుడ్ అగ్రకథానాయకుడిగా విరాజిల్లిన నటుడు ఇంట్లో డ్రగ్స్ ఉన్నట్లు ఆమె వెల్లడించారు.

టిఫెన్, భోజనంలా డ్రగ్స్ తీసుకుంటారు

టిఫెన్, భోజనంలా డ్రగ్స్ తీసుకుంటారు

బాలీవుడ్ పార్టీల్లో డ్రగ్స్ కామన్ అయిపోయాయని ఆమె పేర్కొంది. కిలోలు కిలోలు మేరా డ్రగ్స్ పార్టీల్లో అలా వరుసగా టేబుల్‌ మీద పెట్టి ఉండటాన్ని తాను చూసినట్లు మహిళ పేర్కొంది. కేవలం గంట ముందు చెబితే చాలు... డ్రగ్స్ పార్టీలో కనిపిస్తాయని చెప్పింది. పార్టీల్లో డ్రగ్స్ అనేది వాస్తవం అని ఆమె చెప్పింది. అక్కడ ఎండీఎం, ఎల్ఎస్‌డీ టాబ్లెట్స్, వైట్ క్రిస్టల్స్‌తో పాటు ఇతర డ్రగ్స్ ఇంజెక్షన్‌లు వరుసగా టేబుల్‌పై ఉంటాయని పేర్కొంది. అంతేకాదు డ్రగ్స్‌ను అదేదో టిఫెన్ భోజనంలా తీసుకుంటారని ఆ మహిళ పేర్కొంది. ఇప్పటి వరకు కొంత వరకు మాత్రమే బయటి ప్రపంచానికి తెలిసిందని తెలియాల్సింది చాలా ఉందని ఆ మహిళ వెల్లడించింది.

Recommended Video

Deepika Padukone : NCB ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరై 3 సార్లు బోరున ఏడ్చేసిన Deepika Padukone
పార్టీలకు తన ఇంటిని అద్దెకు ఇచ్చే బడా హీరో

పార్టీలకు తన ఇంటిని అద్దెకు ఇచ్చే బడా హీరో

ఇదిలా ఉంటే ఆమెకు తెలిసిన ఒక బడా హీరోకు బాంద్రాలో ఓ పెద్ద అపార్ట్‌మెంట్ ఉందని అక్కడే పార్టీలు బాగా జరుగుతాయని మహిళ వెల్లడించింది. తన అపార్ట్‌మెంట్ ఇచ్చినందుకు రోజుకు రూ.40వేల నుంచి రూ.50వేలు తీసుకుంటారని ఆమె తెలిపింది. ఇక పెడ్లర్స్ దగ్గర నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న నటుల పేర్లు తనకు తెలుసని ఆమె చెప్పారు. ఇక డ్రగ్స్ తీసుకున్న వారు తమ లోకంలో ఉండరని ఆ సమయంలో తమకు మేకప్ చేసుకునే వారితో చెప్పేస్తుంటారని ఆ మహిళ చెప్పింది. ఇక కరెక్టుగా విచారణ చేస్తే బడా నటుల పేర్లు, ఇండస్ట్రీని ఏలుతున్న వారి పేర్లు బయటకొస్తాయని ఆమె చెప్పారు.

English summary
Bollywood is now the care of Address for drugs. Many biggies from industry take drugs and that is bitter truth said a woman who works within the industry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X