• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Body Positivity movement:నగ్నంగా కెమెరాలకు ఫోజులిచ్చిన బాలీవుడ్ నటి..

|

ముంబై: సాధారణంగా కాస్త బొద్దుగా ఉన్న మహిళలు వారి శరీరంను చూసి ఇబ్బంది పడుతుంటారు. సన్నగా ఎందుకు లేనా అని బాధపడిన ఘటనలు ఉంటాయి. కానీ మరికొందరు మహిళలు మాత్రం భగవంతుడు ఇచ్చిన రూపం అది కాబట్టి చాలా సంతోషిస్తారు. అంతేకాదు తాము లావుగా ఉన్నామనే బాధ వారిలో కనిపించదు సరికదా... ఎంతో పాజిటివిటీ వారిలో నిండి ఉంటుంది.బాలీవుడ్ నటి వనిత ఖారత్ కూడా ఈ కోవకే చెందుతుంది. ఇంతకీ ఈ వనితా ఖారత్ ఎవరు..? ఆమె ఎందుకు వార్తల్లో నిలిచింది..?

వనితా ఖారత్.. బాలీవుడ్ నటి. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశారు. అందులో షాహిద్ కపూర్‌తో కలిసి నటించింది. ఆ సినిమాలో పనిమనిషి వేషం వేసింది వనితా ఖారత్. ఇప్పుడు ఈ సైడ్ క్యారెక్టర్ గురించి ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే ... వనితా ఓ బోల్డ్ ఫోటో షూట్ చేసింది. అందులో నగ్నంగా ఆమె కెమెరా ముందు నవ్వుతూ ఫోజు పెట్టింది. ఈ ఫోటో చాలామంది దృష్టిలో పడటమే కాదు.. చాలా ఆకట్టుకుంది కూడా. ఈ ఫోటోను వనితా ఖారత్ తన ఇన్స్‌టాగ్రామ్‌, ట్విటర్‌లో పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే చాలామంది లైక్ కొట్టారు. అంతేకాదు ఆమె ఒక మంచి టాగ్ కూడా రాసుకొచ్చింది.

Bollywood actress Vanita Kharat poses nude to promote body positivity movement:Have a look

వనితా ఖారత్ నగ్నంగా కెమెరాకు ఫోజు ఇచ్చింది. కేవలం ఓ గాలిపటంను అడ్డుగా పెట్టుకుని ఫోటోషూట్‌లో పాల్గొనింది. ఆ ఫోటోను ఇన్స్‌టాలో పోస్టు చేసి ఓ వాక్యం కూడా రాసింది. "నా టాలెంట్‌ను చూసి గర్వపడుతున్నాను, నా ఇష్టం, నా ఆత్మ విశ్వాసం, నా శరీరాకృతిని చూసి గర్వపడుతున్నాను. ఎందుకంటే నేను నేనుగా ఉన్నాను కాబట్టి. బాడీ పాజిటివిటీ మూవ్‌మెంట్‌లో పాల్గొందాం" అంటూ వనితా ఖారత్ పోస్టు రాసుకొచ్చింది. నాలుగు రోజుల క్రితం ఈ పోస్టును షేర్ చేసింది. ఈ ఫోటో తీసింది ప్రముఖ ఫోటోగ్రాఫర్ తేజస్ నేరుకర్. బోల్డ్ ఫోటో షూట్ చేసినందుకు వనితా ఖారత్ ఫ్యాన్స్ ప్రశంసించారు. వివిధ ఆకారాల్లో ఉన్న శరీరం గురించి దిగులు చెందాల్సిన పని లేదని ఈ పాజిటివ్ మూవ్‌మెంట్‌లో పాల్గొనాలని వారంతా పిలుపునిచ్చారు.

తన అభిమానులు శ్రేయోభిలాషులు చెప్పిన మాటలకు వనితా ఖారత్ కృతజ్ఞతలు తెలిపింది. కబీర్ సింగ్‌తో ఈ అమ్మడు పాపులర్ అయ్యాక... మరాఠీ సినిమాల్లో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంది. విక్కీ వెలింగ్‌కర్,మహారాష్ట్రాచి హాస్య జాత్ర లాంటి సినిమాల్లో నటించింది. అంతకుముందు 2019లో షాహిద్ కపూర్‌తో కలిసి ఓ అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలను ఆమె పోస్టు చేశారు.

English summary
The actress, Vanita Kharat, made us laugh in the cinema halls till it hurt our stomach. But this time around, she has grabbed maximum eyeballs after she decided to pose nude for her latest photoshoot to promote body positivity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X