వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలీవుడ్ డ్రగ్స్ కేసు: డిసెంబర్ 22 వరకు సమయం ఇవ్వండి ..ఎన్‌సిబి ని కోరిన అర్జున్ రాంపాల్

|
Google Oneindia TeluguNews

సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణంతో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నుండి సమన్లు అందుకున్న అర్జున్ రాంపాల్ ను విచారించిన ఎన్‌సిబి అధికారులు మరోమారు నటుడు అర్జున్ రాంపాల్ కు సమన్లు జారీ చేశారు. అయితే అర్జున్ రాంపాల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ముందు హాజరు కావడానికి డిసెంబర్ 22 వరకు సమయం కోరినట్లు సమాచారం.

బాలీవుడ్ డ్రగ్స్ కేసు .. ఎన్సీబీ నిఘాలో ముగ్గురు టాప్ హీరోలు ..లిస్ట్ లో మరో 50 పేర్లు ?బాలీవుడ్ డ్రగ్స్ కేసు .. ఎన్సీబీ నిఘాలో ముగ్గురు టాప్ హీరోలు ..లిస్ట్ లో మరో 50 పేర్లు ?

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే అర్జున్ రాంపాల్ ను ప్రశ్నించిన ఎన్సీబీ

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే అర్జున్ రాంపాల్ ను ప్రశ్నించిన ఎన్సీబీ

బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి సెంట్రల్ ఏజెన్సీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బాలీవుడ్ లోని డ్రగ్స్ లింకులపై లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ను ప్రశ్నించడానికి మరోసారి ఎన్‌సిబి కార్యాలయానికి పిలిచింది. ఎన్‌సిబి ఇంతకుముందు రాంపాల్ ను అలాగే ఆయన గర్ల్ ఫ్రెండ్ గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్‌ను ప్రశ్నించింది . ఈ కేసులో గాబ్రియెల్లా సోదరుడిని కూడా విచారణ ఏజెన్సీ అరెస్టు చేసింది.

మళ్ళీ విచారణకు సమన్లు జారీ చేసిన ఎన్సీబీ

మళ్ళీ విచారణకు సమన్లు జారీ చేసిన ఎన్సీబీ

ఎన్‌సిబి అధికారి బుధవారం బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటుడు అర్జున్ రాంపాల్ ను మళ్లీ విచారించనున్న ట్లుగా వెల్లడించారు. గతంలో అర్జున్ రాంపాల్ వెల్లడించిన విషయాలు ఇతర నిందితులు వెల్లడించిన సమాచారానికి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే, కొనసాగుతున్న దర్యాప్తులో కొత్త వాస్తవాలు బయటపడ్డాయని, అందువల్ల అతన్ని మళ్లీ ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఎన్సీబీ అధికారులు స్పష్టం చేశారు . గత నెలలో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బాంద్రాలోని అర్జున్ రాంపాల్ నివాసంలో తనిఖీలు నిర్వహించింది. ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్లు మరియు ఎన్డిపిఎస్ చట్టం క్రింద పరిమితం చేయబడిన కొన్ని డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని ఆదేశించింది.

నవంబర్ 13 న దాదాపు ఏడు గంటలు అర్జున్ రాంపాల్ ను విచారించిన ఎన్సీబీ

నవంబర్ 13 న దాదాపు ఏడు గంటలు అర్జున్ రాంపాల్ ను విచారించిన ఎన్సీబీ

3 నవంబర్ 13 న దాదాపు ఏడు గంటలు అర్జున్ రాంపాల్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ప్రశ్నించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు దర్యాప్తులో భాగంగా వెలుగు చూసిన బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితురాలైన రియా చక్రవర్తి ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి సుశాంత్ కు డ్రగ్స్ ఇచ్చినట్లుగా ఆరోపణలు రుజువు కావడంతో వారిని అరెస్ట్ చేసిన ఎన్సిబి అధికారులు ఈ కేసులో దర్యాప్తు మొదలుపెట్టారు. విచారణలో తీగ లాగితే డొంకంతా కదిలింది.

 అర్జున్ రామ్ పాల్ గర్ల్ ఫ్రెండ్ గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్, ఆమె సోదరుడిపై కూడా విచారణ

అర్జున్ రామ్ పాల్ గర్ల్ ఫ్రెండ్ గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్, ఆమె సోదరుడిపై కూడా విచారణ

ఈ కేసులో దీపికా పదుకొనే, శ్రద్ధాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్ , సారా ఆలీఖాన్ ల పేర్లు ఉండటంతో వారిని కూడా ఎన్సీబీ విచారించింది. వీరితో పాటు అర్జున్ రామ్ పాల్ గర్ల్ ఫ్రెండ్ గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ ప్రమేయం కూడా ఉందని గుర్తించడంతో ఆమెను కూడా విచారించారు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు . ఆమె సోదరుడు అగిసిలాస్ డెమెట్రియేడ్స్ ప్రమేయం ఉందని గుర్తించారు . అతను చాలా మంది బాలీవుడ్ ప్రముఖులతో సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించిన తరువాత ఎన్‌సిబి దర్యాప్తులో అర్జున్ రాంపాల్ మరియు గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్‌ను మరోమారు విచారించనున్నారు.

 గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ సోదరుడు అగిసిలాస్‌ అరెస్ట్

గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ సోదరుడు అగిసిలాస్‌ అరెస్ట్

అగిసిలాస్‌ను అక్టోబర్ 17 న లోనావాలా రిసార్ట్ నుంచి అరెస్టు చేశారు. అతని వద్ద నుండి హషీష్ (చరాస్) 0.8 గ్రాములను ఎన్‌సిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతని ఖార్ నివాసం వద్ద చేసిన సోదాలు జరిపిన వారికి అల్ప్రజోలం మాత్రలు కూడా లభించాయి. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉన్నందుకు అగిసిలాస్ రియా చక్రవర్తి సోదరుడు షోయిక్ మరియు ఇతర వ్యక్తులకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేక మంది డ్రగ్ పెడ్లర్లతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు అధికారులు తెలిపారు.

Recommended Video

మంత్రి బొత్సాకు CBI కోర్టు నోటీసులు || CBI Court Issued Summons To AP Minister Botsa Satyanarayana
ఇప్పటికి బాలీవుడ్ డ్రగ్స్ కేసులో 28 మంది అరెస్ట్

ఇప్పటికి బాలీవుడ్ డ్రగ్స్ కేసులో 28 మంది అరెస్ట్

రియా మరియు షోయిక్ చక్రవర్తితో సంబంధం ఉన్న దీపేశ్ సావంత్ మరియు శామ్యూల్ మిరాండాతో అతను సన్నిహితంగా ఉన్నట్లు కూడా ఆధారాలు లభించినట్లు గా తెలుస్తోంది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై డ్రగ్ కోణాన్ని పరిశీలిస్తున్న ఎన్‌సిబి, ఇప్పటివరకు బాలీవుడ్ ప్రముఖులు కమెడియన్ భారతి సింగ్, ఆమె భర్త హర్ష్ లింబాచియా వంటి వారితో సహా ఈ కేసులో 28 మందిని అరెస్టు చేశారు. దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి బాలీవుడ్ నటీమణులను ప్రశ్నించారు.

English summary
Actor Arjun Rampal has sought time till December 22 to appear before the Narcotics Control Bureau (NCB). The Central agency had summoned him again to question him in connection with the Bollywood drugs case. NCB had already questioned Rampal and his partner Gabriella Demetriades in the past and had also arrested Gabriella’s brother in the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X