• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అందరిదీ ఒకే స్క్రిప్టు .. ఎన్సీబీ విచారణలో దీపికా,సారా ఆలీఖాన్ , రకుల్, శ్రద్ధా చెప్పిందిదే !!

|

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇటీవల తాము విచారణ జరిపిన బాలీవుడ్ తారలు వెల్లడించిన విషయాలను తమ పోర్టల్ ద్వారా తెలియజేశారు. పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు .

బాలీవుడ్ డ్రగ్స్ కేసు .. రకుల్ పిటీషన్ పై కేంద్రానికి, మీడియా నియంత్రణా సంస్థలకు కోర్టు నోటీసులుబాలీవుడ్ డ్రగ్స్ కేసు .. రకుల్ పిటీషన్ పై కేంద్రానికి, మీడియా నియంత్రణా సంస్థలకు కోర్టు నోటీసులు

 కనీసం సిగిరెట్లు కూడా తాగమని చెప్పిన బాలీవుడ్ తారలు

కనీసం సిగిరెట్లు కూడా తాగమని చెప్పిన బాలీవుడ్ తారలు

దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్ , శ్రద్ధ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ లు డ్రగ్స్ తీసుకుంటారని వచ్చిన ఆరోపణలను ఖండించినట్లుగా పేర్కొన్నారు. వారు ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదని, కనీసం వారు సిగరెట్లు కూడా తాగమని విచారణ అధికారులకు వెల్లడించినట్లుగా పేర్కొన్నారు.
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తమ పోర్టల్ ద్వారా పంచుకున్న ఒక నివేదిక ప్రకారం, ఇటీవల విచారణ జరిపిన బాలీవుడ్ తారలు విచారణలో అందరూ ఒకే స్క్రిప్టు చదివారని, ఒకే విధమైన సమాధానం చెప్పారని పేర్కొన్నారు. వీరందరూ హాష్ ఒక డ్రగ్ కాదని చెప్పారన్నారు .

 మరోమారు విచారణకు పిలిచే అవకాశం ఉందని చెప్పిన ఎన్సీబీ

మరోమారు విచారణకు పిలిచే అవకాశం ఉందని చెప్పిన ఎన్సీబీ

వీరందరూ కూడబలుక్కుని ఈ విధంగా సమాధానాలు చెప్పినట్లుగా ఎన్సీబీ అధికారులు భావిస్తున్నారు. ఎన్సీబీ వెల్లడించిన వివరాలు మాత్రమే కాకుండా, మరికొంత కీలక సమాచారాన్ని ఎన్సీబీ సేకరించినట్లుగా తెలుస్తుంది. వీరందరిని మరొకమారు విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లుగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వెల్లడించింది. సెప్టెంబరు 26 న ఏజెన్సీ విచారించిన బాలీవుడ్ ప్రముఖులలో ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఎన్‌సిబి వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా, 20 మంది హై డ్రగ్ పెడ్లర్లు ఎన్‌సిబి నిఘా కింద ఉన్నారని వర్గాలు తెలిపాయి.

రకుల్ ప్రీత్ వాట్సప్ చాట్ లో డూబీలు.. మొబైల్ ఫోన్స్ సాంకేతిక విశ్లేషణలో కీలక అంశాలు

రకుల్ ప్రీత్ వాట్సప్ చాట్ లో డూబీలు.. మొబైల్ ఫోన్స్ సాంకేతిక విశ్లేషణలో కీలక అంశాలు

రకుల్ ప్రీత్ యొక్క వాట్సాప్ చాట్‌లో డూబీ అనే పదం ఉందని, ఇది చేతితో చుట్టబడిన సిగరెట్లను సూచిస్తుందని వారు వివరించారు. వారి మొబైల్ ఫోన్‌ల సాంకేతిక విశ్లేషణ అన్ని సందేహాలను తొలగిస్తుందని ఎన్‌సిబి అధికారి తెలిపారు. ఇదిలావుండగా, కరణ్ జోహార్ యాజమాన్యంలోని ధర్మటిక్ ఎంటర్టైన్మెంట్ మాజీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, క్షతిజ్ రవి ప్రసాద్ ఈ కేసులో అరెస్టు చేయబడ్డారు . ఆయన అక్టోబర్ 3 వరకు ఎన్‌సిబి కస్టడీకి రిమాండ్ చేయబడ్డారు. అయితే, తప్పుడు ఆరోపణలతో తనను ఏజెన్సీ వేధించిందని క్షితిజ్ కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.

  Deepika Padukone : NCB ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరై 3 సార్లు బోరున ఏడ్చేసిన Deepika Padukone
  డ్రగ్స్ కేసు దర్యాప్తుపై ఎన్సీబీ వివరణాత్మక నివేదిక

  డ్రగ్స్ కేసు దర్యాప్తుపై ఎన్సీబీ వివరణాత్మక నివేదిక

  ఈ కేసులో కరణ్ జోహార్‌ను ఎన్‌సిబి తప్పుగా ఇరికించాలని కోరుతోందని, తనతో ‘నీచంగా ప్రవర్తించారు' అని, తన నివాసంలో శోధిస్తున్నప్పుడు బాల్కనీలో ‘డ్రై సిగరెట్' ఆధారంగా అరెస్టు చేశారని క్షితిజ్ ప్రసాద్ మేజిస్ట్రేట్‌కు ఇచ్చిన ప్రకటనలో ఆరోపించారు. దీంతో తాజా విచారణలపై , నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాదకద్రవ్యాల దర్యాప్తుపై వివరణాత్మక నివేదికను తయారు చేయడానికి సిద్ధం అయ్యింది . డిప్యూటీ డైరెక్టర్ కెపిఎస్ మల్హోత్రా, సమీర్ వాంఖడే మరియు అశోక్ జైన్ నేతృత్వంలోని ఎన్‌సిబి బృందాలు ఇప్పుడు ముంబైలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ డ్రగ్స్ నెట్‌వర్క్‌పై దర్యాప్తులోని ప్రతి అంశంతో వివరణాత్మక నివేదికను తయారు చెయ్యనున్నారు.

  English summary
  In an explosive development, top sources of the Narcotics Control Bureau (NCB) revealed on Monday that all four actors Deepika Padukone, Sara Ali Khan, Shraddha Kapoor and Rakul Preet Singh, named in the Bollywood drug case have been ‘reading from the same script.’The NCB said all four of them claimed ‘hash is not a drug’ during the interrogation and put themselves in ‘dire trouble’ by giving similar statements. The agency further said that Deepika, Sara, Shraddha and Rakul are aware that they have been cornered, and are speaking the same language.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X