• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డ్రగ్స్ కేసులో ట్విస్ట్ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్... ఖండించిన ఎన్‌సీబీ... విచారణ తప్పించుకునే సాకు!!

|

డ్రగ్స్ కేసుకు సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) నుంచి తనకెలాంటి నోటీసులు అందలేదని ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ట్విస్ట్ ఇచ్చారు. తన హైదరాబాద్ నివాసానికి గానీ ముంబై నివాసానికి గానీ ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పారు. ఈ మేరకు రకుల్ ప్రీత్ సింగ్ మేనేజర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్‌సీబీ నుంచి రకుల్ ప్రీత్ సింగ్‌కు ఇంకా ఎటువంటి నోటీసులు అందలేదన్నారు. రకుల్ ఓ యాడ్ ఫిలిం షూట్ నిమిత్తం బుధవారం(సెప్టెంబర్ 23) రాత్రి హైదరాబాద్ వచ్చారు. అదే రోజు ఎన్‌సీబీ రకుల్ ప్రీత్ సింగ్‌కు నోటీసులు జారీ చేయగా... సదరు హీరోయిన్ మాత్రం అలాంటిదేమీ లేదని చెప్పడం గమనార్హం.

అమాయకురాలిని , సుశాంత్ డ్రగ్స్ కోసం అందర్నీ వాడుకునేవాడు .. బెయిల్ పిటీషన్ లో రియా

ఖండించిన ఎన్‌సీబీ...

ఖండించిన ఎన్‌సీబీ...

నోటీసులు అందలేదన్న రకుల్ ప్రకటనను సీనియర్ ఎన్‌సీబీ అధికారి కేపీఎస్ మల్హోత్రా ఖండించారు. ఇప్పటికే ఆమెకు నోలీసులు జారీ చేశామని చెప్పారు. అయితే ఫోన్ కాల్ సహా పలు మార్గాల్లో ఆమెను సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయిందన్నారు. ఆమె వైపు నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు.గురువారం(సెప్టెంబర్ 24) విచారణకు హాజరవకూడదన్న ఉద్దేశంతోనే నోటీసులు అందలేదన్న సాకు చెప్తుందన్నారు.

బుధవారమే నోటీసులు...

బుధవారమే నోటీసులు...

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో వెలుగుచూసిన డ్రగ్స్ లింకులకు సంబంధించి రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా బయటపడటంతో బుధవారం(సెప్టెంబర్ 23) ఎన్‌సీబీ ఆమెకు నోటీసులు జారీ చేసింది. రకుల్‌తో పాటు దీపికా పదుకొనే, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్‌లకు కూడా నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో విచారణ నిమిత్తం గురువారం(సెప్టెంబర్ 24) ఎన్‌సీబీ ఎదుట విచారణకు హాజరుకావాలని రకుల్‌కు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే దీపికా,శ్రద్దా కపూర్‌లో ఈ నెల 26న విచారణకు రావాల్సిందిగా కోరారు.

మీడియా కథనాలపై రకుల్ అసహనం...

మీడియా కథనాలపై రకుల్ అసహనం...

డ్రగ్స్ వ్యవహారంలో తన పేరు తెర పైకి రావడంతో రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మీడియాలో తనపై వస్తున్న కథనాలను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని ఆమె కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే మీడియా కథనాలపై తాము ఆదేశాలివ్వలేమని జస్టిస్ చావ్లా నేత్రుత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. ఈ విషయంలో మీడియా స్వీయ నియంత్రణే కీలకమని పేర్కొంది. అదే సమయంలో రకుల్ పిటిషన్‌ను ఫిర్యాదుగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ, ప్రసార భారతి, న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్, ప్రెస్ కౌన్సిల్‌కు ఢిల్లీ హైకోర్టుకు నోటీసులు జారీ చేసింది.

  Rakul Preet Singh కు NCB ఎదురుదెబ్బ, Tollywood Top హీరోయిన్ విచారణలో ఎవరి పేర్లు బయటపెడుతుందో??
  ఇలా వెలుగులోకి...

  ఇలా వెలుగులోకి...

  సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తిని అరెస్ట్ చేయడంతో బాలీవుడ్‌ డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే రియా సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు 15 మందిని అరెస్ట్ చేశారు. రియా చక్రవర్తిని విచారించిన సందర్భంలో హీరోయిన్లు సారా అలీ ఖాన్,రకుల్ పేర్లు బయటకు వచ్చాయి.

  English summary
  Rakul Preet Singh, whose name has cropped up in drug probe in Sushant Singh Rajput death case among many other Bollywood actresses, said that she has not received the summons sent by the Narcotics Control Bureau (NCB) either at Mumbai or Hyderabad so far. The actress reached Mumbai from Hyderabad on Wednesday night. She has been summoned by the NCB for questioning today. Rakul Preet was in Hyderabad for an ad film shoot.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X