వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువ సంగీత దర్శకుడి కన్నుమూత: మాస్ హిట్స్‌కు కేరాఫ్‌గా: విషాదంలో చిత్ర పరిశ్రమ

|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రఖ్యాత బాలీవుడ్ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 42 సంవత్సరాలు. కిడ్నీ వైఫల్యం.. దాని వల్ల తలెత్తిన అనారోగ్య కారణాల వల్ల వాజిద్ ఖాన్ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హిందీ చిత్ర పరిశ్రమలో మాస్ హిట్లకు కేరాఫ్‌గా నిలిచిన సంగీత దర్శక జంట సాజిద్-వాజిద్‌లల్లో ఒకరు ఆయన. వాజిద్ ఖాన్ హఠాన్మరణం పట్ల బాలీవుడ్ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. గాయకుడు సోనూ నిగమ్ సహా పలువురు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Recommended Video

Music Composer Wajid Khan Of Sajid-Wajid Passes Away Due To COVID-19

కిడ్నీ ఇన్‌ఫెక్షన్ వల్ల

వాజిద్ ఖాన్ కిడ్నీ వైఫల్యంతో కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏడాది కిందట ఆయనకు కిడ్నీ మార్పిడి కూడా జరిగింది. కొద్దిరోజులుగా కిడ్నీ ఇన్‌ఫెక్షన్ తిరగబెట్టిందని అంటున్నారు. కిడ్నీ వైఫల్యం వల్ల ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తాయని చెబుతున్నారు. నాలుగు రోజుల కిందట వాజిద్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీనితో ఆయనను ముంబైలోని చెంబూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నారు.

కరోనా పాజిటివ్‌గా

కరోనా పాజిటివ్‌గా

ఈ సందర్భంగా ఆయనకు కరోనా వైరస్ వైద్య పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలినిట్లు సమాచారం. దీన్ని ఎవరూ ధృవీకరించలేదు. వాజిద్ ఖాన్ హఠాన్మరణానికి కరోనా కూడా ఓ కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. 1998లో సల్మాన్ ఖాన్ నటించిన ప్యార్ కియాతో డర్నా క్యా మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు సాజిద్-వాజిద్. తొలి చిత్రమే మ్యూజికల్ హిట్‌గా పేరు తెచ్చుకుంది. అప్పటి నుంచి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

 కేరీర్‌లో మాస్ హిట్స్

కేరీర్‌లో మాస్ హిట్స్

సల్మాన్ ఖాన్ నటించిన దాదాపు అన్ని సినిమాలకూ ఈ ద్వయమే సంగీతాన్ని అందించింది. సల్మాన్ ఖాన్ కేరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన దబాంగ్ సీక్వెల్స్ అన్నింటికీ మ్యూజిక్ కంపోజింగ్ వారిదే. మాస్ సినిమాలకు క్లీన్ హిట్స్ ఇస్తూ వచ్చారు. దబాంగ్-3, పాగల్ పంతి, సత్యమేమ జయతే, వెల్‌కమ్ టు న్యూయార్క్, జుడ్వా-2, క్యా కూల్ హై హమ్-3, సింగ్ ఈజ్ బ్లింగ్, రౌడీ రాథోర్ వంటి పలు హిందీ సినిమాలకు మ్యూజిక్ కంపోజింగ్ చేశారు. ఆ సినిమాలన్నీ మ్యూజికల్‌గా ఎంత పెద్ద హిట్ కొట్టాయో హిందీ సినీ ప్రియులకు తెలిసిన విషయమే.

సల్మాన్ ఖాన్‌కు నేపథ్య గాయకుడిగా..

సల్మాన్ ఖాన్‌కు నేపథ్య గాయకుడిగా..

వాజిద్ ఖాన్ తరచూ పాటలు పాడేవారు. ప్రత్యేకించి సల్మాన్ ఖాన్‌కు ఆయన ప్లే బ్యాక్ సింగర్‌గా మారారు. దబాంగ్ సీక్వెల్స్ సహా పలు సినిమాల్లో ఆయన పాటలు పాడారు. యంగెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మాస్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంటూ బాలీవుడ్‌ తనకంటూ ఓ ముద్రను వేశారు. తాజాగా ఆయన మరణంతో హిందీ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. సోనూ నిగమ్, సంగీత దర్శకుడు సలీమ్ మర్చంట్, నటి ప్రియాంకా చోప్రా, బాలీవుడ్ సింగర్ బాబుల్ సుప్రియో వంటి ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిపారు.

English summary
Wajid Khan, of composer duo Sajid-Wajid has died at the age of 42. The news was confirmed by singer Sonu Nigam, who wrote in an Instagram post, “My brother Wajid left us.” Music composer Salim Merchant told PTI, "He had multiple issues. He had a kidney issue and had a transplant a while ago. But recently he got to know about kidney infection... He was on the ventilator for the last four days, after his situation started getting worse. Kidney infection was the beginning and then he got critical.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X