వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'చేతకాని పురుషులే అలా చేస్తారు.. సినిమావల్లే ఇదంతా!, బాలీవుడ్‌దే బాధ్యత'

చేతకాని పురుషులే మహిళలపై హింసకు పాల్పడుతారని, పనిలో వైఫల్యాన్ని మహిళలపై ప్రదర్శిస్తారని మేనకా గాంధీ పేర్కొన్నారు. మేనకా గాంధీ వ్యాఖ్యలపై బాలీవుడ్ నిర్మాత అశోక్ పండిట్ ఘాటుగానే స్పందించారు. సినీ పరిశ్

|
Google Oneindia TeluguNews

ముంబై: దేశంలో మహిళా రక్షణ రోజురోజుకు ప్రశ్నార్థకమవుతున్న నేపథ్యంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై నేరాలు పెరగడానికి సినిమాలే కారణమని, బాలీవుడ్ సినిమాల వల్లే అమ్మాయిలపై ఈవ్ టీజింగ్ ఎక్కువవుతోందని అన్నారు.

బాలీవుడ్, ప్రాంతీయ సినిమా అన్న తేడా లేకుండా ప్రతీ సినిమాలోను అమ్మాయిలపై ఈవ్ టీజింగ్ వంటి అంశాలను పెడుతున్నారని ఆరోపించారు. అమ్మాయి చుట్టూ ఆకతాయి మూకలు చేరి అసభ్యంగా ప్రవర్తించడం, వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడం, ఆ తర్వాత ప్రేమలో పడుతుండటం వంటివి చూపిస్తున్నారని మండిపడ్డారు.

Bollywood responsible for rise in crimes against women: Maneka Gandhi at Goafest

సినిమాల్లో చూపిస్తున్న సీన్స్ ద్వారా మహిళలపై హింసకు, వేధింపులకు పాల్పడవచ్చుననే భావన పురుషుల్లో పెరుగుతోందని మేనకా గాంధీ అన్నారు. సినిమాల్లో మహిళల పాత్ర చిత్రణ గౌరవప్రదంగా ఉండేలా చూడాలని బాలీవుడ్ ను కోరారు. శుక్రవారం గోవా ఫెస్ట్ కు హాజరైన సందర్బంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

చేతకాని పురుషులే మహిళలపై హింసకు పాల్పడుతారని, పనిలో వైఫల్యాన్ని మహిళలపై ప్రదర్శిస్తారని మేనకా గాంధీ పేర్కొన్నారు. మేనకా గాంధీ వ్యాఖ్యలపై బాలీవుడ్ నిర్మాత అశోక్ పండిట్ ఘాటుగానే స్పందించారు. సినీ పరిశ్రమపై కామెంట్స్ చేయడం ఫ్యాషన్ అయిపోయిందన్నారు. శ్యాంబెనగల్ నుంచి మధుర్ భండార్కర్ దాకా చాలామంది అగ్ర దర్శకులు మహిళల ఇతివృత్తంతో సినిమాలు చేశారని గుర్తుచేశారు. బాలీవుడ్ శక్తిని తక్కువ అంచనా వేయవద్దని సూచించారు.

English summary
Union Minister for Women and Child Development Maneka Gandhi seems to have stirred a new controversy with her latest statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X