వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బజారులో Bollywood కంపు: అనురాగ్ కశ్యప్ అలాంటోడేనా.. పాయల్ కామెంట్స్ వెనక..?

|
Google Oneindia TeluguNews

ముంబై: సినిమా.. ఈ ప్రపంచమే ఒక రంగులమయం. ఇక్కడ అవకాశాలు రావాలన్నా... వచ్చిన ఛాన్స్ నిలబెట్టుకుని ముందుకెళ్లాలన్నా చాలా కష్టమే. అయితే ఇప్పటి వరకు తెరపై తమ నటనతో ఆకట్టుకున్న ఎంతో మంది నటుటు ఆ స్థాయికి ఎలా వచ్చారో వివరిస్తుంటే తమ కష్టం ఎంత ఉందనేది తెలుస్తుంది. ఇది ఒక రకమైన కష్టమైతే... ఇండస్ట్రీలో మహిళలది మరో బాధ. అవకాశాలు రావాలంటే తెరవెనక మరొక తతంగం నడపాలని బాధిత మహిళలే సోషల్ మీడియా వేదికగా గళం విప్పుతున్నారు. ఒకప్పుడు మీ టూ అనే ఉద్యమం తారాస్థాయికి చేరింది. ఆ విషయం ఈ మధ్యకాలంలో కాస్త మరుగున పడినప్పటికీ... తాజాగా హీరోయిన్ పాయల్ ఘోష్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. బాలీవుడ్‌ను ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కుదిపేస్తోంది. చూసినవారికి ఇదేం కంపురా నాయనా అనిపించేలా కథ నడుస్తోంది.

Recommended Video

#PayalGhosh : Anurag Kashyap Responds To Payal Ghosh's Comments || Oneindia Telugu
పాయల్ ఘాటు వ్యాఖ్యలతో...

పాయల్ ఘాటు వ్యాఖ్యలతో...

బాలీవుడ్.. ప్రపంచ సినిమా చరిత్రలో దీనికంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఒకప్పుడు బాలీవుడ్ పరిశ్రమ గురించి ఎంత గొప్పగా చెప్పుకునే వారో ఇప్పుడు ఇదే ఇండస్ట్రీ గురించి అంత చెత్తగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ గలీజ్ దందాపై గంటల తరబడి చర్చలు జరుగుతున్నాయి. బాలీవుడ్ హీరో సుషాంత్ సింగ్ మరణంతో ప్రారంభమైన చర్చ క్రమంగా డ్రగ్స్ వ్యవహారాన్ని బయటపెట్టింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో జరిగే గలీజు పనుల వైపు టాపిక్ మళ్లింది. ఇక సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ వ్యవహారం పీక్ స్టేజెస్‌లో ఉండగా కంగనా రనౌత్ వ్యవహారం తెరపైకొచ్చింది. దీని తర్వాత బాలీవుడ్ హీరోయిన పాయల్ ఘోష్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ లక్ష్యంగా తాను ఎదుర్కొన్న బాధను సోషల్ మీడియా ద్వారా పూసగుచ్చినట్లు వివరించింది. సినిమాల్లో అవకాశాలు రావాలంటే ఒక మహిళ ఇంతటి నరకం అనుభవించాలా అని ఆలోచింపజేసేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి.

పాయల్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ

పాయల్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ

తన పట్ల అనురాగ్ కశ్యప్ వ్యవహరించిన తీరును చాలా క్లారిటీతో వివరించడంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇతర సినీ ఇండస్ట్రీల్లో కూడా పెద్దగా చర్చ జరుగుతోంది. టాలీవుడ్‌లో కూడా ఇలాంటి యవ్వారమే ఒకటి నడుస్తోందంటూ గతంలో నటి శ్రీరెడ్డి ఏకంగా అర్థనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపింది.ఇక అగ్రదర్శకుల్లో ఒకరిగా ఉన్న అనురాగ్ కశ్యప్‌పై పాయల్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మహిళల సాధికారిత అంశంపై సినిమాలు తీసే అనురాగ్ కశ్యప్ వెనక ఇంతటి చీకటి కోణం దాగి ఉందా అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. కొందరైతే పాయల్ పాపులారిటీ కోసమే ఇలాంటి అభాండాలు ఒక మంచి దర్శకుడిపై వేస్తోందని అన్న వాళ్లూ ఉన్నారు. ఈ క్రమంలోనే అనురాగ్ కశ్యప్‌కు కూడా మద్దతు లభిస్తోంది. అనురాగ్ కశ్యప్ అలాంటి వాడు కాదని తన మాజీ భార్య కల్కికోయెచ్లిన్ చెప్పుకొచ్చింది. 2015లో అనురాగ్‌తో తాను దూరమైనప్పటికీ తన భద్రతపై ఎప్పుడూ ఆరా తీసేవాడని వెల్లడించింది. ప్రతి విషయంలోను తనకు అండగా నిలిచాడని గుర్తు చేసింది. ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు ఇలాంటివి ఎన్నో సంఘటనలు ఎదురవుతాయని... ఎక్కడా కృంగిపోకుండా ధైర్యంగా నిలవాలని అనురాగ్‌కు సూచించింది.

అనురాగ్ కశ్యప్‌కు తాప్సీ అండ

ఇక అనురాగ్ కశ్యప్‌కు అండగా నిలిచింది మరో నటి తాప్సీ పన్ను.అనురాగ్ కశ్యప్‌కు అండగా నిలిచిన తాప్సీ పన్ను పై కూడా నెటిజెన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. స్త్రీల పట్ల అనురాగ్ కశ్యప్‌కు ఎంతో గౌరవం ఉందంటూ తాప్సీ ట్వీట్ చేసింది. ఆయన గొప్ప స్త్రీ వాదంటూ కితాబు ఇవ్వడంతో తాప్సీని టార్గెట్ చేశారు నెటిజెన్లు.ఇక పాయల్ ఘోష్ విషయానికొస్తే తాను బాలీవుడ్ ప్రముఖుడు చేసిన నీచపు పనిని ప్రపంచానికి తెలిపానని... ఈ సమయంలో తనకు ప్రాణ హాని ఉందని చెబుతూ తనకు రక్షణ కల్పించాల్సిందిగా ప్రధాని మోడీని కోరుతూ ట్వీట్‌లో ఆయన్ను ట్యాగ్ చేసింది పాయల్.

ఇతరుల పేర్లను బయటకు తీయడం సబబేనా..

ఇక అనురాగ్‌పై నిప్పులు చెరుగుతూ పాయల్ ఘోష్ మరో ఇద్దరి హీరోయిన్ల పేర్లను ప్రస్తావించింది. రిచా చద్దా, హ్యూమా ఖురేషీలు తనతో పనిచేసినప్పుడు తన డిమాండ్లకు ఒప్పుకున్నారని అనురాగ్ చెప్పినట్లు పాయల్ బాంబు పేల్చారు. దీంతో రిచా రియాక్ట్ అయ్యారు. తన పేరు అనవసరంగా తీస్తోందని మండిపడుతూ తన పరువుకు భంగం కలిగించేలా పాయల్ వ్యవహరించిందని పేర్కొంటూ నోటీసులు ఇచ్చింది. పాయల్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది రిచా. " అత్యాచారయత్నం నిజంగానే తప్పు. అలా జరిగి ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండాల్సింది. స్త్రీవాది అంటే ఇతరుల పేర్లు ఇలాంటి గలీజు వ్యవహారాల్లోకి లాగడమా? టీవీల్లో కూర్చొని నేను కూడా నీపై విషం జిమ్మగలను. నీ అజెండా అసలు నిజాన్ని కప్పిపెట్టి అనవసర అంశాలపై మరులుతోంది." అని రిచా ట్వీట్ చేసింది.


మొత్తానికి బాలీవుడ్‌లో జరుగుతున్న ఈ గలీజు పనులు మున్ముందు ఎంత వరకు దారితీస్తుందో కాలమే సమాధానం చెప్పాలి. అంతేకాదు ఎంతమంది ప్రముఖుల పేర్లను బయట పెడుతుందో వేచిచూడాలి.

English summary
Richa Chadha, in a statement, said that she will sue Payal Ghosh for naming her in #MeToo allegation against filmmaker Anurag Kashyap.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X