వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెబుతారు...పాటించరు: ఓటు వేయలేకపోతున్న బాలీవుడ్ స్టార్ల జాబితా ఇదీ..!

|
Google Oneindia TeluguNews

ముంబై: ఓటు ప్రాథమిక హక్కు... ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు ఓటు వేయాలి అంటూ పలువురు సినిమా స్టార్లు ఓటు యొక్క ప్రాముఖ్యతను ప్రమోట్ చేస్తారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయంటే చాలు... చాలా మంది హీరోలు హీరోయిన్లు టీవీల్లో వార్తపత్రికల్లో ఓటు గురించి వివరస్తారు. ఓటు ద్వారా మన భవిష్యత్తును నిర్దేశించుకుందామంటూ తెగ లెక్చర్లు ఇచ్చేస్తారు. అయితే అన్నీ చెప్పిన ఈ స్టార్లే మన దేశంలో ఓటు వేయలేని దుస్థితి నెలకొంది. ఇలా మనదేశంలో పలు కారణాలతో ఓటు వేయలేకపోతున్న స్టార్లు చాలామందే ఉన్నారు.

 ఓటు వేయండి అని చెప్పడంలో ముందుండే అక్షయ్

ఓటు వేయండి అని చెప్పడంలో ముందుండే అక్షయ్

ఓటు ప్రస్తావన వచ్చినప్పుడు ఓటు వేయాల్సిందిగా అని చెప్పే ప్రముఖ హీరోల్లో ముందుంటారు అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్‌కు దేశభక్తి చాలా ఎక్కువే. సామాజిక స్పృహ తీసుకొచ్చేందుకు తన వంతు పాత్రను అక్షయ్ కుమార్ పోషిస్తారు. అంతేకాదు మంచి మెసేజ్ ఉన్న సినిమాలు తీసి యువతకు ఆదర్శంగా నిలుస్తారు అక్కీ. అన్నీ చెప్పి చేసే అక్షయ్ కుమార్‌కు మాత్రం మనదేశంలో ఓటు హక్కు లేదు. ఎందుకంటే అక్షయ్ కుమార్‌ కెనడా పాస్‌పోర్టు కలిగి ఉన్నాడు. అంటే అతనికి కెనడా పౌరసత్వం కూడా ఉంది. అందుకే అక్షయ్ కుమార్ ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయలేకపోతున్నారు.

భారత్‌లో ఓటు హక్కు లేని చికిని చమేలీ

భారత్‌లో ఓటు హక్కు లేని చికిని చమేలీ

ఇక తన అందంతో యువతను మెస్మరైజ్ చేసే బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా ఖైఫ్ పరిస్థితి కూడా ఇంచుమించు అక్షయ్ కుమార్‌లానే ఉంది. ఈ 'మల్లీశ్వరి'కి యూకే పౌరసత్వం ఉంది. దీంతో చికిని చమేలీ సంపాదన అంతా భారత్‌లో ఉన్నప్పటికీ... ఇక్కడే నివాసం ఉంటున్నప్పటికీ ఓటు వేయలేని పరిస్థితి నెలకొంది.

ఆలియా భట్‌కు కూడా తప్పని ఓటు కష్టాలు

ఆలియా భట్‌కు కూడా తప్పని ఓటు కష్టాలు

ఇక ఇప్పుడిప్పుడే కుర్రాళ్లకు మతి పోగొడుతున్న అందాల సుందరి ఆలియా భట్ కూడా ఓటు హక్కు వినియోగించుకోలేకపోయింది. ఆమెకు యూకే సిటిజెన్ షిప్ ఉంది.

 అయ్యో సన్నీ లియోన్‌కు కూడా ఓటు హక్కు లేదే..!

అయ్యో సన్నీ లియోన్‌కు కూడా ఓటు హక్కు లేదే..!

తన స్కిన్ షోతో కుర్రాళ్లకు మతిపోగొట్టే సెక్సీ భామ సన్నీ లియోన్. ఈమె సినిమా వస్తుందంటే చాలు కుర్రాళ్లు ఎగబడుతారు. సన్నీ లియోన్ కూడా ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హురాలు కాదు. ఎందుకంటే ఈ జిస్మ్ భామకు కెనడా పాస్ పోర్టు ఉంది. అంటే అక్కడి పౌరసత్వం ఉంది. భారత్‌లో సినిమాలు చేస్తూ అధిక మొత్తం సంపాదిస్తున్న వారిలో సన్నీలియోన్ కూడా ఒకరుగా ఉంది. కేవలం తన ఓరచూపుతోనే కుర్రాళ్లలో హీట్ పెంచగల ఈ భామకు ఓటు హక్కు లేదని తెలుసుకున్న అభిమానులు కాస్త డిస్సప్పాయింట్ అయ్యారు.

 మన దేశ పౌరసత్వం లేని జాక్వెలిన్

మన దేశ పౌరసత్వం లేని జాక్వెలిన్

భారత్‌లో సినిమాలు తీస్తూ అత్యధిక రెమ్యూనిరేషన్ తీసుకుంటున్న వారిలో శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒకరు. ఈ అందాల భామ శ్రీలంక పౌరసత్వం కలిగి ఉండటంతో ఆమెకు భారత్‌లో ఓటు హక్కు లేదు. వృత్తిరీత్యా భారత్‌లో నివాసం ఏర్పరుచుకున్నప్పటికీ ఆమె ఓటు వేసేందుకు మాత్రం నిబంధనలు అడ్డుగా నిలుస్తున్నాయి.

English summary
From Amitabh Bachan to Amir Khan, Bollywood stars queued up to the polling stations to cast their vote. As Mumbai is going for elections in the fourth phase, Many bollywood celebrities casted their vote as their right. But few of them could not vote as they had foreign country's passport or citizenship.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X