వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కలకలం: డీఎంకె నేత ఇంటిపై బాంబు దాడి, భయాందోళనలో స్థానికులు..
కాంచీపురం: తమిళనాడులోని కాంచీపురంలో డీఎంకే నేత రవి ఇంటిపై కొందరు దుండగులు బాంబులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
బాంబు దాడిలో రవి సోదరుడు కుమార్ తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. డీఎంకే నేత ఇంటిపై బాంబుల దాడితో చుట్టుపక్కల జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బాబు దాడి దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆధారాల కోసం సీసీటీవి ఫుటేజీని పరిశీలిస్తున్నారు.