బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో ఉగ్రవాదుల మకాం, పేలుడు పదార్థాలు సీజ్, ఐటీ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీలో బంగ్లాదేశ్ కు చెందిన జమాత్ ఉల్ ముజాహుద్దీన్ ఉగ్రవాదులు తలదాచుకున్నారని ఎన్ఐఏ అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఎలక్ట్రానిక్ సిటీలో దాడులు చేసిన ఎన్ఐఏ అధికారులు పేలుడు పదార్థాలు, విలువైన సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.

అల్లుడి రాసలీలలు: అత్తపై మోజుతో కూతురుతో పెళ్లి , వీడియో వైరల్!అల్లుడి రాసలీలలు: అత్తపై మోజుతో కూతురుతో పెళ్లి , వీడియో వైరల్!

ఎన్ఐఏ కస్టడీలో ఉన్న జేఎంబీ ఉగ్రవాది జాహీదుల్ ఇస్లాం అలియాస్ కౌసర్ ఇచ్చిన సమాచారం మేరకు ఎలక్ట్రానిక్ సిటీలో దాడులు చేసి సోదాలు జరిగాయని అధికారులు అంటున్నారు. ఎలక్ట్రానిక్ సిటీలో జేఎంబీ ఉగ్రవాదులు కొంత కాలం తలదాచుకున్నారని తెలిసింది.

Bomb materials stored by JMB terrorist at Electronic city in Bengaluru seized by NIA

2014లో బుద్వార్న్ పేలుడు నిందితుడు అయిన కౌసర్ దక్షిణ భారతదేశంలో ఉగ్రవాదులు తలదాచుకున్న ప్రాంతాల్లో నివాసం ఉండేవారితో టచ్ లో ఉండేవాడని అధికారుల విచారణలో వెలుగు చూసింది. అత్తిబెలే, కాడుగోడి, కేఆర్ పురం, చిక్కబాణవార, శికారిపాళ్య, ఎలక్ట్రానిక్ సిటీలో ఉగ్రవాదుల సానుభూతిపరులు ఉన్నారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మాజీ ప్రధాని మనుమడు, హీరో ఉప ఎన్నికల్లో పోటీ ?, నాడు సుమలత దెబ్బకు!మాజీ ప్రధాని మనుమడు, హీరో ఉప ఎన్నికల్లో పోటీ ?, నాడు సుమలత దెబ్బకు!

ఎలక్ట్రానిక్ సిటీలో నిందితులు తలదాచుకున్న ప్రాంతంలో పేలుడు పదార్థాలతో పాటు మ్యానువల్, గ్రెనేడ్ లాంటి పేలుడు పదార్థాలు, ప్లాస్టిక్ టేప్ తో చుట్టిన బ్యాటరీలు, ఎలక్ట్రిటిక్ వైర్లు, క్యపాసిటర్, మూడుస్విచ్ లు, మైక్రోలిథం సెల్ తదితర వస్తువులు, ఐడీ కార్డులు, చేతి గ్లౌస్ లు, ఇల్లు అద్దె తీసుకున్నట్లు ఉన్న పత్రాలు, బెంగాల్ బాషలో చేతిలో రాసిన పత్రాలు, డిజిటల్ కెమెరా, 2018 బెంగళూరులో చోరీ అయిన వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.

English summary
Bengaluru: The National Investigation Agency has recovered improvised explosive devices based on the disclosure by a terrorist of the Jamat-ul-Mujahideen Bangladesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X