వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమానానికి బాంబు బెదిరింపు: ల్యాండింగ్

|
Google Oneindia TeluguNews

నాగ్ పూర్: గాలిలో వెలుతున్న విమానంలో బాంబు ఉందని బెదిరింపు ఫోన్ చేసి నానా హంగామా సృష్టించిన సంఘటన శనివారం జరిగింది. అయితే అత్యవసరంగా విమానం ల్యాండ్ చేసి విమానంలో గాలించినా ఎలాంటి బాంబు లేదని వెలుగు చూసింది.

బాంబులు, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. శనివారం ఉదయం నాగ్ పూర్ నుంచి ముంబైకి గో ఎయిర్ విమానం బయలుదేరింది. విమానంలో ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు.

Bomb scare on Bhubaneswar-Mumbai Go Air flight

విమానం బయలుదేరిన తరువాత గుర్తు తెలియని వ్యక్తి విమానాశ్రయానికి ఫోన్ చేశాడు. ముంబై వెలుతున్న గో ఎయిర్ విమానంలో బాంబు ఉందని, అది పేలిపోతుందని చెప్పి ఫోన్ కట్ చేశాడు. అధికారులు హడలిపోయారు.

వెంటనే గో ఎయిర్ విమానం పైలెట్ కు సమాచారం ఇవ్వడంతో నాగ్ పూర్ లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులను కిందకు దించి విమానం మొత్తం గాలించారు. విమానంలో ఎలాంటి బాంబులు లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

English summary
The passengers were safe and have been deplaned. There was no suspicious object found in the plane.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X