వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు... తనిఖీలు చేపట్టిన పోలీసులు .. అసలేం జరిగిందంటే

|
Google Oneindia TeluguNews

ఆగ్రా లోని తాజ్ మహల్ వద్ద బాంబు పెట్టినట్టు గురువారం ఉదయం పోలీసులకు ఫోన్ కాల్ రావడంతో కలకలం రేగింది. ఆగ్రాలోని తాజ్ మహల్ ను తాత్కాలికంగా మూసివేసి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్మారక చిహ్నం అయిన తాజ్ మహల్ వద్ద బాంబు గురించి ఉత్తర ప్రదేశ్ పోలీసులకు ఫోన్ కాల్ రావడంతో ఉదయం తాజ్ మహల్ వద్ద ఉన్న పర్యాటకులను బయటకు పంపించి తనిఖీలు చేసినా ఎలాంటి వస్తువులు లభించలేదు .

డాగ్ స్క్వాడ్ , బాంబ్ స్క్వాడ్ లతో తాజ్ మహల్ వద్ద తనిఖీలు

డాగ్ స్క్వాడ్ , బాంబ్ స్క్వాడ్ లతో తాజ్ మహల్ వద్ద తనిఖీలు


యూపీ పోలీసులకు ఫోన్ కాల్ రావటంతో బాంబు బెదిరింపు నేపథ్యంలో అధికారులు తనిఖీలను నిర్వహించారు . పర్యాటకులను బయటకు పంపి డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ లతో తనిఖీలు చేశారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో తాజ్ మహల్ పరిసర ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ఎలాంటి బాంబులు లేవని తేలిన తర్వాత పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత ఉదయం 11 గంటల తరువాత పర్యాటకుల ప్రవేశం తిరిగి మళ్లీ ప్రారంభించారు .

 పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తి కోసం గాలింపు

పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తి కోసం గాలింపు


ఇక పోలీసులు కు వచ్చిన ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? కాల్ చేసిన వ్యక్తి ఎవరు అన్నదానిపై విచారణ చేస్తున్నారు . ఇప్పటివరకు ఒక బాంబు కూడా కనుగొనబడలేదని, కాల్ చేసిన వ్యక్తిని కనిపెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
ఈ ఉదయం, ఒక గుర్తు తెలియని వ్యక్తి యుపి 112 కు ఫోన్ చేసి, తాజ్ మహల్ వద్ద బాంబు పేలుడు జరుగుతుందని చెప్పారు. వెంటనే, మా బాంబ్ స్క్వాడ్ మరియు ఇతర బృందాలు ప్రాంగణాన్ని క్షుణ్ణంగా శోధించాయి. ఇప్పటివరకు, ఎలాంటి వస్తువులు దొరకలేదని ఆగ్రా ఇన్స్పెక్టర్ జనరల్ ఎ సతీష్ గణేష్ అన్నారు.

భయపడాల్సిన పని లేదు .. ఫేక్ కాల్ అంటున్న పోలీస్ ఉన్నతాధికారులు

భయపడాల్సిన పని లేదు .. ఫేక్ కాల్ అంటున్న పోలీస్ ఉన్నతాధికారులు


పర్యాటకులు భయపడవలసిన అవసరం లేదన్నారు . 99 శాతం మందికి భరోసా ఇవ్వాలనుకుంటున్నాను, ఇది ఒక ఫేక్ కాల్. కాని మేము భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నాము అని ఆయన పేర్కొన్నారు.

ఆరునెలల పాటు పర్యాటకుల కోసం మూసివేయబడిన తరువాత తాజ్ మహల్ గత సెప్టెంబర్‌లో పర్యాటకుల కోసం కఠినమైన కరోనావైరస్ భద్రతా మార్గదర్శకాలతో తిరిగి తెరవబడింది. మహమ్మారి కారణంగా మార్చి 17 నుండి మూసివేయబడింది.

ఇప్పుడిప్పుడే పర్యాటకుల రద్దీ .. బాంబ్ బెదిరింపుతో పర్యాటకుల్లో ఆందోళన

ఇప్పుడిప్పుడే పర్యాటకుల రద్దీ .. బాంబ్ బెదిరింపుతో పర్యాటకుల్లో ఆందోళన


ఇప్పుడిప్పుడే తాజ్ మహల్ సందర్శనకు పర్యాటకుల రద్దీ పెరుగుతుంది. ఈ సమయంలో బాంబు ఉందని వచ్చిన ఫేక్ కాల్ తో పర్యాటకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పాలరాతి సమాధి తాజ్ మహల్ ప్రతి సంవత్సరం 7 మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. ఆగ్రా కోటతో సహా ఆగ్రాలోని తాజ్ మహల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఆదాయానికి ఎంతగానో తోడ్పాటును అందిస్తుంది.ఈసారి కరోనా దెబ్బతో ఆదాయం కుదేలైంది . చారిత్రక కట్టడం నెలల తరబడి మూతపడింది .

English summary
The Taj Mahal in Agra was briefly shut and tourists evacuated this morning after Uttar Pradesh Police received a call about a bomb at the iconic monument. The call was made to the police helpline. Authorities conducted through checks following the bomb threat. Entry to tourists resumed a little after 11 am. A senior police officer said no bomb has been found so far and that efforts are on to trace the caller.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X