వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

toolkit case: నికిత జాకబ్‌కు బాంబే హైకోర్టు బెయిల్.. 3వారాల్లోగా ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని ఆదేశం

|
Google Oneindia TeluguNews

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమంలో ఉద్రిక్తత, హింస తలెత్తేలా ప్రణాళికలు వేశారని, అంతర్జాతీయ శక్తులతో కలిసి దేశంలో అలజడికి కుట్ర చేశారంటూ ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తోన్న సామాజిక కార్యక్తలకు ఎట్టకేలకు కోర్టుల్లో ఊరట లభిస్తోంది.

ప్రత్యేక రాయలసీమకు వైఎస్ షర్మిల -ఒకటికి కోటి బాణాలు -కేసీఆర్ బర్త్‌డేలో గంగుల సంచలనంప్రత్యేక రాయలసీమకు వైఎస్ షర్మిల -ఒకటికి కోటి బాణాలు -కేసీఆర్ బర్త్‌డేలో గంగుల సంచలనం

టూల్‌కిట్ కేసులో నికిత జాకబ్‌కు బోంబే హైకోర్టు బుధవారం ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిలును మంజూరు చేసింది. గ్రెటా థన్‌బర్గ్ షేర్ చేసిన టూల్‌కిట్‌ రూపకర్తలు దిశ రవి, నికిత జాకోబ్, శాంతను ములుకు అని ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దిశ రవిని అరెస్టు చేశారు, ఆమె ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. శాంతనుకు హైకోర్టు మంగళవారం ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిలు మంజూరు చేసింది.

 https://telugu.oneindia.com/news/telangana/trs-minister-gangula-kamalakar-asks-ys-sharmila-to-fight-for-separate-rayalaseema-state-287782.html

ఇప్పటికే శాంతనుకు బెయిలిచ్చిన బోంబే హైకోర్టు... బుధవారం నికిత జాకోబ్‌కు ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిలు మంజూరు చేస్తూ.. మూడు వారాల్లోగా ఢిల్లీ కోర్టును ఆశ్రయించాలని ఆమెకు తెలిపింది. జస్టిస్ పీడీ నాయక్ ఈ ఆదేశాలు జారీ చేశారు.

ys sharmila అసాధారణ స్పీడు -యుద్ధ నౌక గద్దర్, మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ -సలహాదారులూ ఖరారు!ys sharmila అసాధారణ స్పీడు -యుద్ధ నౌక గద్దర్, మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ -సలహాదారులూ ఖరారు!

ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఆరోపణల ప్రకారం.. దిశ రవి, నికిత జాకోబ్, శాంతను ములుకు టూల్‌కిట్ డాక్యుమెంట్‌ తయారీలో భాగస్వాములు. వీరికి ఖలిస్థాన్ అనుకూలవాదులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. భారత దేశ పేరు, ప్రతిష్ఠలను భంగపరచేందుకు వీరు ప్రయత్నించారు. అయితే నిందితులు మాత్రం ఈ వాదనను ఖండిస్తున్నారు.

రైతు ఉద్యమానికి మద్దతుగా ఏయే రోజుల్లో ఏ విధంగా సామాజిక మాధ్యమాల్లో తుపాను సృష్టించాలో టూల్ కిట్ ద్వారా వివరించారని పోలీసులు తెలిపారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమానికి మద్దతుగా విదేశాల్లోని ఇండియన్ ఎంబసీల వద్ద, అదానీ, అంబానీ కార్పొరేట్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని దీనిలో ఉన్నట్లు తెలిపారు.

English summary
Bombay High Court allows transit anticipatory bail application of Nikita Jacob. The court grants her transit bail for 3 weeks in connection with the FIR by Delhi police in Toolkit matter. In case of arrest, she will be released on a personal bond of Rs 25,000 and one surety of like amount.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X