వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియాఖాన్ మృతి కేసు: సిబిఐకి బదలీ చేసిన హైకోర్టు

|
Google Oneindia TeluguNews

Bombay HC orders CBI to probe Bollywood actor Jiah Khan's death
ముంబై: బాలీవుడ్ నటి జియాఖాన్(25) మృతి కేసును బాంబే హైకోర్టు గురువారం బదిలీ చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ న్యాయూర్తులు విఎం కనడే, పిడి కోడేలు జియాఖాన్ మృతి కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించాలని సిబిఐని ఆదేశించారు.

జియాఖాన్ మృతి కేసు విచారణను సిబిఐకి బదిలీ చేయాలని ఆమె తల్లి రబియా ఖాన్ చేసిన అభ్యర్థన మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా పౌరురాలైన జియాఖాన్ 2013, జూన్ 3న ముంబైలోని జుహూలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మరణించారు.

జియాఖాన్ నివాసంలో పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి కుమారుడు, జియాఖాన్ ప్రియుడు సూరజ్ పంచోలిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సూసైడ్ నోట్ జియా రాసింది కాదని ఆమె తల్లి రబియా ఆరోపించారు. జియాఖాన్‌ది హత్యేనని రబియా ఖాన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సిబిఐచే విచారణ కొనసాగించాలని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు సిబిఐకి ఈ కేసును బదిలీ చేసింది.

English summary
The Bombay high court on Thursday transferred the probe into the death of Bollywood actor Jiah Khan to the Central Bureau of Investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X