వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దసరా బొనాంజా: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ "బోనస్", ధర్నాకు రైల్వే ఫెడరేషన్ పిలుపు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దసరా దీపావళి పండగవేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది నాన్ గెజిటెడ్ ఉద్యోగస్తులకు బోనస్‌ను ప్రకటించింది. మొత్తం రూ.3,737 కోట్లు ఇందుకోసం విడుదల చేయనున్న కేంద్ర ప్రభుత్వం... మొత్తం 30.67 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని పేర్కొంది. పండగ సమయంలో ఈ డబ్బును ప్రోత్సాహకం కింద ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చించి ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్ ఇవ్వాలన్న అంశానికి ఆమోదం తెలిపింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2019-2020కి సంబంధించి బోనస్ ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు సమాచార మరియు ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్. మరోవారం రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు బోనస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అయితే కేవలం నాన్ గెజిటెడ్ స్థాయిలో ఉన్న ఉద్యోగస్తులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు.ఈ బోనస్‌ మధ్య తరగతివారికి పండగ సమయంలో ఎంతో ఉపయోగపడుతుందని జవడేకర్ చెప్పారు. అంతేకాదు ఈ డబ్బుల తీసుకుని ఖర్చు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతుందన్నారు. ఈ బోనస్‌ను ఒకే ఇన్స్‌టాల్‌మెంట్‌లో విజయదశమిలోగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా లబ్ధిదారులకు బదిలీ చేయడం జరుగుతుందని ప్రకాష్ జవడేకర్ వివరించారు.

Bonus announced to central govt employees,30 lakh non gazetted employees to get benefitted

Recommended Video

Indian Railways : Indian Railways To Run 392 Special Trains For Dussehra || Oneindia Telugu

రైల్వే శాఖ, పోస్ట్ ఆఫీస్ , ఈపీఎఫ్‌ఓ, ఈఎస్ఐసీలో పనిచేసే 17 లక్షల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగస్తులుండగా... మరో 13 లక్షల మంది ఇతర శాఖల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈ బోనస్ ద్వారా లబ్ధిపొందనున్నట్లు జవడేకర్ తెలిపారు. ఇదిలా ఉంటే బోనస్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్‌ఇండియా రైల్వే ఫెడరేషన్‌ అక్టోబర్ 22న దేశవ్యాప్తంగా 2 గంటల పాటు స్ట్రైక్‌కు పిలుపునిచ్చింది. కరోనా కారణం చూపి 2019-2020కి చెందిన బోనస్ విడుదలలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడం సరికాదని యూనియన్ వెల్లడించింది.

English summary
Union Cabinet had approved to give bonus to the central govt non-gazetted employees. This move benefits 30.67 lakh employees across the nation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X