చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టెక్కీ సుభశ్రీ ప్రాణం తీసిన హోర్డింగ్: ‘గాలి’పై కేసు పెట్టాలంటున్న నేత!

|
Google Oneindia TeluguNews

చెన్నై: సెప్టెంబర్ 13న తమిళనాడు రాజధాని చెన్నైలో రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ ఊడిపడటంతో సుభశ్రీ అనే యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు జయగోపాల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె మరణానికి కారణమైన ట్యాంకర్ డ్రైవర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

టీం లీడర్ పరువు తీయాలనుకొని.. భార్యనే 'కాల్‌గర్ల్' చేశాడీ ప్రబుద్ధుడు!

గాలిపైనే కేసు పెట్టాలి..

గాలిపైనే కేసు పెట్టాలి..

కాగా, ఈ ప్రమాద ఘటనపై తాజాగా అన్నాడీఎంకే సీనియర్ నేత పొన్నయన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హోర్డింగ్ ఏర్పాటు చేసిన వ్యక్తి వల్ల శుభశ్రీ మృతి చెందలేదని.. గాలి బలంగా వీయడంతోనే ఆ హోర్డింగ్ ఆమెపై పడిందని చెప్పుకొచ్చారు. అందుకే గాలిపైనే కేసు నమోదు చేయాలంటూ పిచ్చి కూతలు కూశారు. దీంతో ఆయనపై ప్రతిపక్ష నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

కొడుకు పెళ్లి కోసం అనుమతిలేని హోర్డింగులు

కొడుకు పెళ్లి కోసం అనుమతిలేని హోర్డింగులు

అన్నాడీఎంకే పార్టీకి చెందిన నాయకుడు జయగోపాల్ తన కుమారుడి వివాహానికి తమిళనాడు డిప్యూటీ సీఎంను ఆహ్వానిస్తూ పల్లవరమ్ రోడ్డు మధ్యలో భారీ హోర్గింగ్‌లను ఏర్పాటు చేశారు. కాగా, శుభశ్రీ తన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా.. రోడ్డు మధ్యలో ఎలాంటి అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఆ హోర్డింగ్ ఆమె వాహనంపై డింది.

సుభశ్రీ ప్రాణం తీసిన హోర్డింగ్..

సుభశ్రీ ప్రాణం తీసిన హోర్డింగ్..

ఈ క్రమంలో ఆమె బ్యాలెన్స్ కోల్పోయి రోడ్డుపై పడింది. అదే సమయంలో వేగంగా దూసుకొస్తున్న ఓ వాటర్ ట్యాంకర్ ఆమెపై నుంచి వెళ్లిపోయింది. తీవ్రగాయాలపాలైన శుభశ్రీని గమనించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన రాజకీయ దుమారాన్ని కూడా రేపింది. అధికార పార్టీపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ఇలా ఎంతమంది ప్రాణాలు తీస్తారంటూ డీఎంకే అధినేత స్టాలిన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బెయిల్‌పై నిందితులు.. ఆ నేతపై హత్యానేరం

బెయిల్‌పై నిందితులు.. ఆ నేతపై హత్యానేరం

కాగా, అన్నాడీఎంకే నేత జయగోపాల్ కుమారుడు పెళ్లి సందర్భంగా ప్లెక్సీ కట్టిన నలుగురు పళని, సుబ్రమని, శంకర్, లక్ష్మికాంత్ అనే నలుగురికి బెయిల్ లభించింది. నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని శుభ శ్రీ కుటుంబసభ్యులు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు జయగోపాల్‌ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై హత్య కేసు కూడా నమోదు చేశారు.

English summary
‘Book the air’: AIADMK veteran on 23-yr-old Chennai techie killed by hoarding
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X