వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుక్కలుగా పుట్టినా సైనికులుగా గర్వంగా .. జాగిలాలకు మెడల్స్ ఇచ్చి వీడ్కోలు పలికిన సీఐఎస్‌ఎఫ్‌

|
Google Oneindia TeluguNews

ఎవరైనా ఎక్కడైనా ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందే సమయంలో ఘనంగా పదవీ విరమణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటారు. సహజంగా ఇలాంటి పండుగలు,వేడుకలు మనుషులు మాత్రమే జరుపుకుంటారు. కానీ ఢిల్లీలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో పదవీ విరమణ వేడుకను చాలా ఘనంగా జరుపుకున్నాయి ఇంతకాలం అక్కడ తమ సేవలను అందించిన జాగిలాలు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం . కుక్కలుగా పుట్టినా సైనికులుగా సేవలందించి సైనికులుగానే పదవీ విరమణ చేసిన అపురూప ఘట్టం ఢిల్లీ లో చోటు చేసుకుంది.

జాగిలాల రిటైర్మెంట్ ఫంక్షన్ ఘనంగా చేసిన సిఐఎస్ఎఫ్ అధికారులు

జాగిలాల రిటైర్మెంట్ ఫంక్షన్ ఘనంగా చేసిన సిఐఎస్ఎఫ్ అధికారులు

ఢిల్లీలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో భాగంగా ఎనిమిదేళ్లుగా ఢిల్లీ మెట్రో పారామిలటరీ విభాగంలో సేవలందించిన ఏడు శునకాలకు పదవీ విరమణ మహోత్సవాన్ని అక్కడి అధికారులు చాలా ఘనంగా జరిపారు. జాగిలాల వీడుకోలు కార్యక్రమాన్ని సిఐఎస్ఎఫ్ కే9 యూనిట్ సిబ్బంది చాలా ఘనంగా నిర్వహించారు. ఇక ఇంతకాలం సేవలందించిన సదరు శునకాలకు పతకాలను అందించి, సర్టిఫికెట్లను అందించి, గుర్తుగా మొమెంటోలను సైతం ఇచ్చి చాలా ఘనంగా రిటైర్మెంట్ వేడుక జరిపారు.

8ఏళ్ళ పాటు ఢిల్లీ మెట్రో పారామిలటరీ విభాగంలో సేవలందించిన శునకాలు

8ఏళ్ళ పాటు ఢిల్లీ మెట్రో పారామిలటరీ విభాగంలో సేవలందించిన శునకాలు

ఇంతకాలం సేవలందించిన జాగిలాలను ఇప్పుడు ఎన్జీవోలకు అప్పగించనున్నారు. జెస్సీ, లక్కీ, లవ్లీ జాగిలాలు అధికారికంగా విధుల నుంచి విరమణ పొందాయని సిఐఎస్ఎఫ్ అధికారులు చెబుతున్నారు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది జాగిలాలకు సెల్యూట్ చేస్తూ ఇంతకాలం ఢిల్లీ మెట్రో పారామిలటరీ విభాగంలో సేవలందించినందుకు తమ గౌరవాన్ని ప్రదర్శించారు. ఇక పదవీ విరమణ పొందిన జాగిలాలు సైతం తమకు ఇంత కాలం సేవలందించడానికి అవకాశం కల్పించిన అధికారులకు అదేవిధంగా గౌరవ వందనం చేశాయి.

మెడలో పతకాలు వేసి మరీ సత్కారం .. కుక్కలుగా పుట్టినా సైనికులుగా పదవీవిరమణ

మెడలో పతకాలు వేసి మరీ సత్కారం .. కుక్కలుగా పుట్టినా సైనికులుగా పదవీవిరమణ

అంతేకాదు వాటి మెడలో పతకాలను వేసి ఘనంగా సన్మానించిన అధికారులు సిఐఎస్ఎఫ్ చరిత్రలోనే ఇలా జాగిలాల కు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేయడం మొదటిసారి అని తెలిపారు. ఇన్నాళ్లు తమకు సేవలందించిన జాగిలాల కు థాంక్స్ అని సిఐఎస్ఎఫ్ పేర్కొంది. "కుక్కగా పుట్టి, సైనికులుగా పదవీ విరమణ చేశాయి " అని సిఐఎస్ఎఫ్ తన ట్విట్టర్ నుండి సందేశాన్ని పోస్ట్ చేసింది. ఇక సిఐఎస్ఎఫ్ ఇంతకాలం సేవలందించిన శునకాలకు ఈ విధంగా ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించడం పట్ల సిఐఎస్ఎఫ్ అధికారుల తీరు పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

 సిఐఎస్ఎఫ్ లో ఇదే మొదటి సారి.. జాగిలాల అపురూపమైన వీడ్కోలు వేడుక

సిఐఎస్ఎఫ్ లో ఇదే మొదటి సారి.. జాగిలాల అపురూపమైన వీడ్కోలు వేడుక

అధికారులు జెస్సీ, లక్కీ, లవ్లీ ప్రేమగా సత్కరించి పంపుతుంటే, అవి అధికారులను,అక్కడ తాము సేవలను అందించిన ఢిల్లీ మెట్రో పారామిలటరీ విభాగాన్ని విడిచిపెట్టి వెళ్లలేక వెళ్లలేక వెళుతున్నాయి. ఇక ఈ కార్యక్రమాన్ని చూసిన వారంతా, జంతువులు, శునకాలు అయినప్పటికీ, సుశిక్షితులుగా , సమర్థవంతంగా పని చేసిన తీరు, అధికారులచే గౌరవించబడిన విధానం అందరి మనసులను ఇట్టే ఆకట్టుకుంటుంది.

English summary
Seven dogs that were part of the Central Industrial Security Force (CISF) retired with full honours on Tuesday after serving eight years with the para-military force. "Born as a dog, retired as a soldier," the CISF posted the message from its Twitter handle, as it shared pictures of the function.The dogs were part of the CISF team attached to the Delhi Metro. The retired dogs were given mementos, medals and certificates at the ceremony organised by CISF unit of Delhi Metro (DMRC).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X