వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై మేయర్ పీఠంపై సస్పెన్స్: శివసేనకు ఆరెస్సెస్ ఆఫర్

బృహన్ ముంబై మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు రోజులు అయినా మేయర్ పదవి పైన ఉత్కంఠ వీడలేదు. బీఎంసీ ఫలితాల్లో శివసేన 84, బీజేపీ 82 స్థానాలు గెలుచుకుంది.

|
Google Oneindia TeluguNews

ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు రోజులు అయినా మేయర్ పదవి పైన ఉత్కంఠ వీడలేదు. బీఎంసీ ఫలితాల్లో శివసేన 84, బీజేపీ 82 స్థానాలు గెలుచుకుంది.

అంతా గెలిచినా.. అక్కడ బీజేపీకి షాక్: పంకజ రాజీనామా, నో చెప్పిన చీఫ్అంతా గెలిచినా.. అక్కడ బీజేపీకి షాక్: పంకజ రాజీనామా, నో చెప్పిన చీఫ్

227 స్థానాలు ఉన్న బీఎంసీలో మేజిక్ ఫిగర్ 114. కానీ ఏ పార్టీకి కూడా అన్ని సీట్లు రాలేదు. దీంతో మేయర్ పదవి పైన ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ శివసేనకు మద్దతివ్వాలని భావించింది.

కానీ దానిని పార్టీలోని మరికొందరు వ్యతిరేకించారు. ప్రస్తుతం యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. శివసేనతో పొత్తు పెట్టుకుంటే యూపీలో తమ పైన ప్రభావం పడే అవకాశముందని కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగు వేస్తోంది. దీంతో, తొలుత శివసేన వైపు మొగ్గినా, ఆ తర్వాత వెనక్కి తగ్గింది.

Both BJP, Shiv Sena should share Mumbai Mayor's post for 2.5 years each, says RSS

మహారాష్ట్రలో మిత్రపక్షాలుగా ఉన్న శివసేన - బీజేపీల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

అయితే, ప్రస్తుత పరిస్థితికి చెక్ చెప్పేందుకు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) నేత ఎంజీ వైద్య ఓ సూచన చేశారు. శివసేన - బీజేపీలు కలవాలని, రెండు పార్టీలు చెరో రెండున్నరేళ్లు పదవిని పంచుకోవాలని చెప్పారు.

ముంబైలో గెలుపు: మోడీకి మద్దతు, 2 మినహా మహారాష్ట్ర బీజేపీదే!ముంబైలో గెలుపు: మోడీకి మద్దతు, 2 మినహా మహారాష్ట్ర బీజేపీదే!

84 స్థానాలు గెలిచిన శివసేనకు తొలుత మేయర్ పదవిని అప్పగించాలని సూచించారు. ఆయన ఆదివారం నాడు ఈ సూచన చేశారు. దీంతో శివసేన - బిజెపిలు మరోసారి కలిసే అవకాశాలున్నాయా అనే చర్చ సాగుతోంది.

ఆరెస్సెస్ నేత ఎంజీ వైద్య సూచన పైన ఇప్పటి వరకు బీజేపీ, శివసేన పార్టీలు స్పందించలేదు. బీఎంసీలో శివసేన 84, బీజేపీ 82, కాంగ్రెస్ 31 స్థానాలు గెలుచుకున్నాయి.

English summary
It's been three days after the Brihanmumbai Municipal Corporation (BMC) polls threw up a fractured result but the political impasse is still on as neither Shiv Sena nor BJP taking any overt step to cobble up a ruling combine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X