ఘోరం: చిప్స్ ప్యాకెట్ కోసం.. ఆ చిన్నారి ప్రాణమే తీసుకున్నాడు..
తండ్రి చిప్స్ ప్యాకెట్ ఇవ్వలేదన్న మనస్థాపంతో ఓ చిన్నారి ఏకంగా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలుడు ఈ ఘాతుకానికి ఓడిగట్టాడు.
మధుర: తండ్రి చిప్స్ ప్యాకెట్ ఇవ్వలేదన్న మనస్థాపంతో ఓ చిన్నారి ఏకంగా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలుడు ఈ ఘాతుకానికి ఓడిగట్టాడు.
పోలీసుల కథనం ప్రకారం.. మధురలోని ఫరా పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న ఓ గ్రామంలో వ్యవసాయ కూలీగా పనిచేసే పద్మసింగ్ తన పిల్లల కోసం ఐదు చిప్స్ ప్యాకెట్లు తెచ్చాడు. ముగ్గురు పిల్లలకు మూడు ప్యాకెట్లు ఇచ్చాడు.

అయితే చిన్న కొడుకు సౌరభ్ తనకు రెండు చిప్స్ ప్యాకెట్లు కావాలంటూ మారాం చేశాడు. తండ్రి ససేమిరా అనడంతో ఇచ్చి తీరాల్సిందేనంటూ గోల పెట్టాడు. దీంతో కోపం వచ్చిన పద్మసింగ్ కొడుకుని నాలుగు దెబ్బలేశాడు. ఆ తరువాత అతడు పని మీద బయటికి వెళ్లిపోయాడు.
తీవ్ర మనస్థాపానికి గురైన సౌరభ్.. తండ్రి బయటికి వెళ్లగానే దుస్తులు ఆరేసే తాడు సాయంతో ఊరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications