వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిక్‌టాక్‌కు మరొకరు బలి.. చేతులకు గాజులు.. మెడలో మంగళసూత్రం వేసుకుని..

|
Google Oneindia TeluguNews

కోటా : టిక్‌టాక్.. అన్ని వయసుల వారిని విపరీతంగా ఆకట్టుకుంటున్న షార్ట్ వీడియో యాప్. పిల్లలు, పెద్దలు, ఆడ, మగా తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఆ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ టిక్‌టాక్ కాపురాల్లో చిచ్చుపెట్టడమే కాదు... పబ్లిసిటీ కోసం డేంజరస్ స్టంట్లు చేసే వారిని హాస్పిటల్‌ పాలు చేస్తోంది. యాప్‌కు బానిసై ప్రాణాలు తీసుకుంటున్న వారికి లెక్కలేదు. తాజాగా రాజస్థాన్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. టిక్‌టాక్ వీడియో చేస్తూ ఓ బాలుడు ఆత్మహత్య చేసుకుని కన్నవారికి తీరని శోకం విధించాడు.

నేడు లోక్‌సభకు ట్రిపుల్ తలాక్ బిల్లు.. నేడు లోక్‌సభకు ట్రిపుల్ తలాక్ బిల్లు..

Recommended Video

పోలీసుల పైకి దూసుకెళ్లిన కారు
 గాజులు, మంగళసూత్రం వేసుకుని

గాజులు, మంగళసూత్రం వేసుకుని

రాజస్థాన్ కోటాకు చెందిన ఓ పన్నెండేళ్ల బాలుడు టిక్ టాక్‌కు బానిసయ్యాడు. పగలు రాత్రి తేడా లేకుండా వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు. టిక్ టాక్ ఛాలెంజ్‌లో భాగంగా ఆ బాలుడు చేతులకు గాజులు, మెడలో మంగళసూత్రం ధరించాడు. అనంతరం బాత్‌రూంలోకి వెళ్లి చెయిన్‌తో ఉరివేసుకున్నాడు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. శుక్రవారం ఉదయం కొడుకు ఎంతసేపటికీ తన రూం లోంచి బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు తలుపులు తెరిచిచూడగా అక్కడి దృశ్యం చూసి షాక్ అయ్యారు. సీలింగ్‌కు వేలాడుతున్న కొడుకును దింపి దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ బాలున్ని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయాడని చెప్పారు. దీంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

భర్త మందలించాడని ఆత్మహత్య

భర్త మందలించాడని ఆత్మహత్య

పది రోజుల క్రితం తమిళనాడులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. భార్య తరచూ టిక్ టాక్ వీడియోలు చేస్తూ పిల్లల్ని పట్టించుకోవట్లేదని భర్త మందలించడంతో మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడులోని అరియలూరు జిల్లా సెందురైలోని వంగారం గ్రామానికి చెందిన అనిత అనే మహిళ ఈ దారుణానికి పాల్పడింది. పురుగుల మందు తాగిన వీడియోను టిక్ టాక్‌లో పోస్ట్ చేసి ప్రాణాలు వదిలింది.

ట్రీట్‌మెంట్‌కు పది లక్షలు

ట్రీట్‌మెంట్‌కు పది లక్షలు

తాజాగా కర్నాటకకు చెందిన ఓ యువకుడు టిక్‌టాక్‌లో పోస్ట్ చేసేందుకు వీడియో తీస్తూ తీవ్రంగా గాయపడి హాస్పిటల్ పాలయ్యాడు. కర్నాటక తుమకూరులో ఆర్కెస్ట్రా గ్రూప్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న కుమార్ అనే యువకుడు బ్యాక్ జంప్ చేస్తూ అదుపుతప్పి గాయాలపాలయ్యాడు. శరీరం బరువు మెడపై పడటంతో అతని వెన్నెముక విరిగింది. ప్రస్తుతం బెంగళూరులోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అతనికి సర్జరీ చేసేందుకు రూ.10లక్షలు ఖర్చవుతాయని డాక్టర్లు చెప్పడంతో ఆ మొత్తం ఎక్కడి నుంచి తేవాలో తెలియక కుటుంబ సభ్యులు పడుతున్న బాధ వర్ణనాతీతం.

English summary
Tik Tok challenge proved deadly for a 12-year-old boy from Kota, Rajasthan.The boy died when he hanged himself from a noose as a part of the Tik Tok challenge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X