ప్రాణాలు తీసిన 'ఛోటా భీమ్': అక్క ఆత్మహత్యాయత్నం

Boy killed accidentally in abid to act like Cchota Bheem
భోపాల్: 'ఛోటాభీమ్' ప్రాణాలు ఓ బాలుడి ప్రాణాలు తీశాడు. కార్టూన్ చానెల్ వచ్చే ఛోటాభీమ్ కార్యక్రమాన్ని పిల్లలు తెగ ఇష్టపడుతున్నారు. అయితే దాంట్లో భీమ్ చేసినట్లుగానే సాహసాలు చేయబోయి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.

మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లాలో గురువారం ఆ సంఘటన జరిగింది. ఎనిమిదేళ్ల బబాలూ ఛోటాభీమ్‌ను అనుకరించి మృతిచెందాడు. తాడుతో సాహసం చేయబోగా అది ప్రమాదవశాత్తు మెడకు ఉరిచుట్టుకుని అశువులుబాశాడు.

తొలుత అతడు చనిపోవడం చూసిన అతడి అక్క సోని కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. అయితే ఆమెను రక్షించి ఆస్పత్రిలో చేర్చారు. కాగా, ప్రమాద సమయంలో ఆ చిన్నారి తండ్రి ఇంట్లో లేడు. తల్లి వంట చేసుకుంటూ ఉండగా ఆ పిల్లలు ఆటల్లో ఛోటాభీమ్‌ను అనుకరించడంతో ఆ దారుణం సంభవించింది.

పిల్లలు అలా అనుకరించి మృత్యు ఒడిలోకి వెళ్లడం ఇదే ప్రథమం కాదు. అంతకుముందు పశ్చిమబెంగాల్‌లోని నదియా జిల్లాలో ఆరోతరగతి చదువుతున్న బాలుడు ప్రమాదవశాత్తు ఫ్యాన్‌కు ఉరిపడి ఊపిరి వదిలాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+