వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదు రోజులు శ్రమించినా దక్కని ఫలితం... మరో చిన్నారిని బలితీసుకున్న బోరుబావి..

|
Google Oneindia TeluguNews

Recommended Video

మరో చిన్నారిని బలితీసుకున్న బోరుబావి || Oneindia Telugu

సంగ్రూర్ : ఐదు రోజులు.. 110 గంటలు. క్షణమొక యుగంలా గడిపిన ఆ తల్లిదండ్రులకు చివరకు కన్నీరే మిగిలింది. పంజాబ్‌లో ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిన చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. బాలున్ని సజీవంగా వెలికితీసేందుక అధికారుల చేసిన ప్ర్తయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. ఐదు రోజుల అనంతరం వెలికితీసిన పసివాడి మృతదేహాన్ని చూసి ఆ ప్రాంతం రోదనలతో మిన్నంటింది.

టీనేజ్ అమ్మాయితో ఎమ్మెల్యేల‌ అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌! బ‌ల‌వంతంగా డాన్స్‌!టీనేజ్ అమ్మాయితో ఎమ్మెల్యేల‌ అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌! బ‌ల‌వంతంగా డాన్స్‌!

ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయిన చిన్నారి

ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయిన చిన్నారి

పంజాబ్‌లో సంగ్రూర్ గ్రామానికి చెందిన రెండేళ్ల ఫతేవీర్ జూన్ ఆరవ తేదీ సాయంత్రం ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడ్డాడు. బోరుబావి బట్టతో కప్పి ఉంచడంతో అది గమనించని బాలుడు అందులో పడిపోయాడు. కేవలం 9ఇంచుల బోర్ కావడంతో అందులో ఇరుక్కుని కదల్లేక నరకయాతన అనుభవించాడు. కొడుకు బోరు బావిలో పడిన విషయం గమనించిన తల్లి చిన్నారిని కాపాడే ప్రయత్నించి విఫలమైంది.

5రోజుల పాటు శ్రమించిన సహాయక సిబ్బంది

5రోజుల పాటు శ్రమించిన సహాయక సిబ్బంది

స్థానికులు అధికారులకు సమాచారంఇవ్వడంతో జాతీయ విపత్తు సహాయక బృందం, పోలీసులు, స్థానిక వాలంటీర్లు రంగంలోకి దిగారు.
బోరుబావిలో దాదాపు 150 అడుగుల లోతులో ఫతేవీర్ చిక్కుకున్నట్లు అధికారులు కెమెరాల ద్వారా గుర్తించారు. పైప్ ద్వారా నిరంతరం ఆక్సిజన్ అందిస్తూ బోరు బావికి సమాంతరంగా గుంత తవ్వారు. సిబ్బందిరాత్రి పగలన్న తేడాలేకుండా ఐదు రోజుల పాటు నిరంతరాయంగా శ్రమించారు. దాదాపు 110 గంటల అనంతరం మంగళవారం తెల్లవారుజామున 5.10గంటలకు బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు.

చికిత్స పొందుతూ మృతి

చికిత్స పొందుతూ మృతి

పూజలు, హోమాలు ఫలించి తమ కొడుకు బోరుబావి నుంచి బయట పడ్డాడన్న ఆ తల్లిదండ్రులకు ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. చిన్నారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. దీంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంచాయి. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బోరుబావిలో పడి బాలుడు మరణించిన ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా తెరిచి ఉన్న బోరు బావులను మూసివేయాలని అధికారులను ఆదేశించారు.

English summary
A two-year-old boy, who was stuck in a 150-feet deep borewell in Punjab for nearly 110 hours, has been declared dead after he was pulled out of the borewell this morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X