వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: గొలుసులతో ఈ కుర్రాడిని ఎందుకు కట్టేశారో తెలిస్తే షాక్ అవుతారు

|
Google Oneindia TeluguNews

గజియాబాద్ : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. చెప్పులు దొంగలించాడన్న ఆరోపణలపై ఓ మైనర్ బాలుడిని గొలుసులతో కట్టేశాడు ఓ వ్యక్తి. ఒక క్లినిక్‌లో పనిచేసే అటెండర్ ఈ దారుణానికి వడిగట్టాడు. ముందుగా గొలుసుతో కట్టి ఉండడాన్ని స్థానిక జర్నలిస్టులు చూసి కవినగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు అటెండర్‌ను విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

దారుణం: యువతిని స్థంభానికి కట్టి చితకబాదారు, ఎందుకో తెలుసా?దారుణం: యువతిని స్థంభానికి కట్టి చితకబాదారు, ఎందుకో తెలుసా?

ఓచిన్న కుర్రాడు ఓ హాస్పిటల్ బయట ఉంచిన చెప్పులను దొంగతనం చేసే ప్రయత్నంలో ఉండగా అతన్ని పట్టుకుని చితకబాది గొలుసులతో కట్టేశాడు ఆ క్లినిక్‌లో పనిచేసే అటెండర్ ఆసిఫ్. కుర్రాడు తప్పు మరో సారి చేయను క్షమించి వదిలేయాల్సిందిగా ఎంత ప్రాథేయపడ్డప్పటికి అటెండర్ మనసు కరగలేదు. కుర్రాడిని వదలలేదు. అదే సమయంలో అటుగా వెళుతున్న ఓ స్థానిక జర్నలిస్టు స్తంభానికి గొలుసులతో కట్టేసిన కుర్రాడిని చూసి ఫోటో తీసుకుని కవినగర్ పోలీస్ స్టేషన్‌లో చూపించాడు. జర్నలిస్టు ఫోటోలు తీయడం గమనించిన అటెండర్ భయంతో కుర్రాడిని వదిలేశాడు. అక్కడి నుంచి కుర్రాడు పరుగులు తీశాడు.

Boy tied to pole with chains for robbing slippers in clinic

ఘటనాస్థలానికి వచ్చేసరికి కుర్రాడు లేడు. దీంతో పోలీసులు అటెండర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే తనపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. కుర్రాడి ఆచూకీ దొరకలేదని... ఆచూకీ దొరికాక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని సీఐ అతీష్ కుమార్ సింగ్ తెలిపాడు. కుర్రాడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. విషయం గురించి క్లినిక్ డాక్టర్‌ను పోలీసులు సంప్రదించగా అలాంటిదేమీ ఆ హాస్పిటల్‌లో జరగలేదని సమాధానం ఇచ్చారు.

English summary
An attendant at a doctor’s clinic in Ghaziabad was detained by the police on Tuesday evening after he allegedly chained a minor boy’s leg to a pole for stealing slippers in Uttar Pradesh’s Ghaziabad, officials said.The police said Asif was taken to Kavi Nagar police station after local journalists found the boy tied with chains as a punishment for trying to run away with the slippers kept outside the clinic. They said they have booked Asif under section 151 (preventive arrest) of the Criminal Procedure Code in connection with the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X