• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గుడిలో అమ్మాయికి ముస్లిం ముద్దులు -‘సూటబుల్ బాయ్’‌పై దుమారం -నెట్‌ఫ్లిక్స్‌ నిషేధానికి బీజేపీ పిలుపు

|

''పట్టపగలు హైందవ ఆలయంలో ఓ హిందూ అమ్మాయిని నిలబెట్టి ఓ ముస్లిం క్యారెక్టర్ ఎడాపెడా లిప్ కిస్సులు ఇస్తాడు. అడిగితే కళకు మతబేధాలు ఉండవని, దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ ఉందని బదులిస్తారు. మరి సరిగ్గా ఇలాంటి ముద్దు సీన్లనే మసీదు ముందు ముస్లిం అమ్మాయికి హిందూ యువకుడు ముద్దులు పెడుతున్నట్లు తీస్తే అప్పుడు కూడా ఇదే చెబుతారా? ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడం కాదా?'' అని ప్రశ్నించారు మధ్యప్రదేశ్ బీజేపీకి చెందిన ప్రముఖ నేత గౌరవ్ తివారి.

హైదరాబాద్‌ను అంబానీకి అమ్మేస్తారు -బీజేపీపైనే చార్జిషీట్ వేయాలి -జవదేకర్‌కు శ్రీనివాస్ గౌడ్ కౌంటర్హైదరాబాద్‌ను అంబానీకి అమ్మేస్తారు -బీజేపీపైనే చార్జిషీట్ వేయాలి -జవదేకర్‌కు శ్రీనివాస్ గౌడ్ కౌంటర్

బాయికాట్ నెట్‌ఫ్లిక్స్..

బాయికాట్ నెట్‌ఫ్లిక్స్..

ప్రఖ్యాత ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో రెండు నెలల కిందట విడుదలైన ‘ఎ సూటబుల్ బాయ్' వెబ్ సిరీస్ లో మెయిన్ హీరోయిన్.. తన ముస్లిం లవర్ లవర్ తో ఆలయంలో రొమాన్స్ చేస్తున్నట్లుగా చిత్రీకరించిన సీన్లపై బీజేపీ గౌరవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు సీన్లను మధ్యప్రదేశ్ లోని మహేశ్వర్ లో గల శివాలయంలో చిత్రీకరించారని, అవి హిందువుల మనోభావలను గాయపరుస్తూ, ‘లవ్ జీహాద్'ను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ యాజమాన్యంతోపాటు ‘ఎ సూటబుల్ బాయ్' సిరీస్ దర్శకనిర్మాత మీరా నాయర్ పైనా చర్యలు తీసుకోవాలని రేవా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సదరు ఎఫ్ఐఆర్ కాపీతోపాటు తన మొబైల్ నుంచి నెట్ ఫ్లిక్స్ యాప్ ను తొలగిస్తూ ‘బాయికాట్ నెట్ ఫ్లిక్స్' హ్యాష్ ట్యాగ్ తో ఓ పోస్టు చేశారు. గంటల వ్యవధిలోనే ఇది ఇండియాలోనే టాప్ ట్రెండింగ్ లో నిలిచింది.

వరుస వివాదాలు..

వరుస వివాదాలు..

ఇటీవల టాటా వారి ‘తనిష్క్ జువెలరీ' రూపొందించిన ‘ముస్లిం కుటుంబంలో హిందూ కోడలికి సీమంతం' ప్రకటనపైనా హిందూ సంఘాలు మండిపడటం, బీజేపీ, అనుబంధ ఐటీ సెల్స్ అదే పనిగా ‘బాయికాట్ తనిష్క్'ను వైరల్ చేయడంతో చివరికి ఆ సంస్థ యాడ్ ను వెనక్కి తీసుకోవడం తెలిసిందే. ఆ వివాదంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఆలయంలో హిందూ అమ్మాయిని ముస్లిం యువకుడు ముద్దుపెట్టుకున్న సీన్లతో కూడిన ‘ఎ సూటబుల్ బాయ్' సిరీస్ పై, దాన్ని ప్రసారం చేస్తోన్న నెట్ ఫ్లిక్స్ పై నేరుగా బీజేపీ నేతలే ఫిర్యాదు చేశారు. సీఏఏ నిరసనలకు మద్దతు తెలిపిన కారణంగా అలీ ఫైజల్(గుడ్డూ పండిట్ క్యారెక్టర్) నటించిన ‘మిర్జాపూర్' సిరీస్ ను సైతం బాయికాట్ చేయాలని హిందూ శ్రేణులు ఆందోళన చేశాయి. కాగా,

నెట్‌ఫ్లిక్స్‌పై చర్యల దిశగా..

నెట్‌ఫ్లిక్స్‌పై చర్యల దిశగా..

సూటబుల్ బాయ్ సిరీస్ లో ముద్దు సీన్లకు సంబంధించి బీజేపీ నేత గౌరవ్ తివారీ చేసిన ఫిర్యాదుపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు. సదరు సిరీస్ లోని సీన్లను పరిశీలించాలాని ఆదేశించానని, నిజంగా అవి అభ్యంతరకరంగా ఉన్నట్లయితే, వెంటనే నెట్ ఫ్లిక్స్ తోపాటు సిరీస్ రూపకర్తలపైనా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఓవర్ ది టాప్(ఓటీటీ) సర్వీసుల జోరు పెరిగిన నేపథ్యంలో వాటిలో ప్రసారమవుతోన్న అభ్యంతర కంటెంట్లను నివారించేలా అన్ని ఓటీటీలను కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి తెస్తున్నట్లు ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ముద్దు వివాదంపై ‘ఎ సూటబుల్ బాయ్' యూనిట్, నెట్ ఫ్లిక్స్ స్పందించాల్సి ఉంది. దర్శకురాలు మీరా నాయర్ గతంలో తీసిన దాదాపు అన్ని సినిమాలు వివాదాస్పదమై, నిషేధానికి గురైన సంగతి తెలిసిందే.

భార్య సహా 17 మంది అమ్మాయిలను -ఆర్మీ మేజర్ ముసుగులో సంచలన క్రైమ్ - రూ.6కోట్లు స్వాహాభార్య సహా 17 మంది అమ్మాయిలను -ఆర్మీ మేజర్ ముసుగులో సంచలన క్రైమ్ - రూ.6కోట్లు స్వాహా

English summary
'Boycott Netflix' Trends Over 'A Suitable Boy' Scene after BJP leader Gaurav Tiwari registered a case against the Netflix, Over A Kissing Scene From the seriece. Madhya Pradesh Home Minister Narottam Mishra Sunday directed police officials to examine the content of Mira Nairs Netflix show A Suitable Boy after a scene from the miniseries kicked up a social media storm for purportedly hurting religious sentiments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X