వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ యూవర్సిటీలో అది ఓపెన్ సీక్రెట్.. అన్నీ నగ్న ఫోటోలే.. షాక్‌లో బాధితులు.. ఏంటీ కొత్త వివాదం..?

|
Google Oneindia TeluguNews

ఇటీవల ఢిల్లీలో వెలుగుచూసిన 'Bois Locker Room' వ్యవహారంపై విచారణ కొనసాగుతుండగానే అదే తరహా ఉదంతం మరొకటి కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీలో వెలుగుచూసింది. యూనివర్సిటీకి చెందిన ఓ సీనియర్ విద్యార్థి ఓ గూగుల్ డ్రైవ్‌ అకౌంట్‌ను క్రియేట్ చేసి.. అందులో వర్సిటీ అమ్మాయిల నగ్న ఫోటోలను అప్‌లోడ్ చేశాడు. ఆశ్చర్యంగా... ఆ ఫోటోలన్నీ సదరు అమ్మాయిలు తమ అంగీకారంతో అతనికి పంపినవే. అయితే ఆ గూగుల్ డ్రైవ్ అకౌంట్‌ను అతను ఓపెన్ సీక్రెట్‌గా మార్చేసి తన స్నేహితులకు కూడా యాక్సెస్ ఇచ్చేశాడు. దీంతో వర్సిటీలో చాలామంది విద్యార్థులు ఆ గూగుల్ డ్రైవ్‌లో ఉన్న అమ్మాయిల న్యూడ్ ఫోటోలను వీక్షించారు. సదరు సీనియర్ వ్యక్తి తమ ప్రైవసీకి భంగం కలిగించడనో.. లేక హద్దుల్లోనే ఉంటాడని నమ్మిన చేతనో.. అతనికి న్యూడ్ ఫోటోలు షేర్ చేసిన అమ్మాయిలంతా అసలు విషయం తెలిసి షాక్ తిన్నారు. ఇదంతా జరిగిన రెండేళ్లకు కానీ బాధిత అమ్మాయిలకు తమ ఫోటోలు లీక్ అయ్యాయన్న సంగతి తెలియలేదు. సోషల్ మీడియాను కుదిపేస్తోన్న ఈ వివాదాన్ని ఒకసారి లోతుగా పరిశీలిద్దాం..

 కరోనా వైరస్ సెక్స్ ద్వారా సంక్రమిస్తుందా..? తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలు.. కరోనా వైరస్ సెక్స్ ద్వారా సంక్రమిస్తుందా..? తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలు..

ఎవరు బయటపెట్టారు..


Aiyoobrows అనే ట్విట్టర్ ఖాతాతో జాదవ్‌పూర్ యూనివర్సిటీకి చెందిన మాజీ విద్యార్థిని ఒకరు ఈ ఉదంతాన్ని బయటపెట్టారు. ఢిల్లీలో వెలుగుచూసిన 'Bois Locker Room' తరహాలోనే జాదవ్‌పూర్ వర్సిటీలోనూ కొంతమంది అబ్బాయిలు ఓ గూగుల్ డ్రైవ్ అకౌంట్ క్రియేట్ చేసి.. అందులో అమ్మాయిల అర్ధనగ్న,నగ్న చిత్రాలను సర్యులేట్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ ఫోటోలు ఇలా సర్క్యులేషన్‌లో ఉన్నట్టు బాధిత అమ్మాయిలెవరికీ తెలియదని.. ఆ ఫోటోలను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని ఆరోపించారు.

దీని వెనుక సూత్రధారి ఎవరు..

దీని వెనుక సూత్రధారి ఎవరు..


Aiyoobrows ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్ల ద్వారా ఈ వ్యవహారం మొత్తాన్ని బయటపెట్టారు. దీని వెనకాల అసలు సూత్రధారి S(పేరు వెల్లడించలేదు) అనే విద్యార్థి అని చెప్పారు. అమ్మాయిలు అతనికి పంపించిన ఫోటోలను అతను గూగుల్ డ్రైవ్‌లో అప్‌లోడ్ చేసి తన స్నేహితులకు కూడా యాక్సెస్ ఇచ్చాడని ఆరోపించారు. ఈ ట్వీట్స్ వైరల్ కావడంతో దీని బారినపడిన అనేక మంది యువతులు గొంతు విప్పడం మొదలుపెట్టారు. ప్రధానంగా S,అతని స్నేహితుడు I అనే వ్యక్తులే ఈ దీనికి ప్రధాన కారకులు అని వారు ఆరోపిస్తున్నారు. ఎస్,ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌కి చెందిన విద్యార్థి మరియు డిబేటింగ్ సొసైటీలో సభ్యుడు కాగా.. I ఎకనమిక్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన విద్యార్థి.

ఎప్పటినుంచి ఆ డ్రైవ్ సర్క్యులేషన్‌లో ఉంది..

ఎప్పటినుంచి ఆ డ్రైవ్ సర్క్యులేషన్‌లో ఉంది..

బాధితుల అభిప్రాయం ప్రకారం.. ఆ గూగుల్ డ్రైవ్ అకౌంట్‌ను 2016లో ప్రారంభించి ఉంటారని భావిస్తున్నారు.Aiyoobrows వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ గూగుల్ డ్రైవ్‌లో తన ఫోటోలు ఉన్న విషయం ఇటీవలే ఆమెకు తెలిసింది. తాను,S ఇద్దరం వర్సిటీ డిబేటింగ్ సొసైటీలో సభ్యులమని.. అలా ఇద్దరి మధ్య పరిచయం ఉందని తెలిపింది. 2015లో ఒకసారి చాటింగ్ చేస్తున్న సందర్భంలో నగ్న ఫోటోలను అతనికి షేర్ చేశానని చెప్పింది. అది పూర్తిగా తన అంగీకారంతోనే జరిగినట్టు తెలిపింది. అయితే ఆ ఫోటోను డిలీట్ చేయడమో లేక ప్రైవేట్‌గా ఉంచడమో చేస్తానని తాను భావించానని పేర్కొంది.

నగ్న ఫోటోలు.. షాక్ తిన్న విద్యార్థిని..

నగ్న ఫోటోలు.. షాక్ తిన్న విద్యార్థిని..

కానీ ఆ తర్వాత ఎందుకో తాను ఇబ్బందిగా ఫీల్ అయ్యానని.. అప్పటినుంచి Sకి దూరంగా ఉన్నానని తెలిపింది. డిబేటింగ్ సొసైటీ మీటింగ్స్‌కి కూడా హాజరవలేదని పేర్కొంది. క్రమంగా కొద్దిరోజులకు పూర్తిగా S కాంటాక్ట్‌ లేకుండా చేసుకున్నానని తెలిపింది. ఇది జరిగిన రెండేళ్ల తర్వాత ఓరోజు తన స్నేహితురాలు ఆమె ఎదుర్కొన్న లైంగిక వేధింపులను #MeToo ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు గుర్తుచేసుకుంది. ఆ సందర్భంగా ఆమెకు మద్దతుగా నిలవడానికి మాట్లాడానని.. వేధింపులకు గురిచేసే వ్యక్తులు ప్రతీచోట ఉన్నారని చెప్పానని గుర్తుచేసుకుంది. మాటల మధ్యలో.. అప్పట్లో తాను S అనే వ్యక్తికి పంపించిన ఫోటో గురించి ఆమెకు తెలుసునని చెప్పడంతో షాక్ తిన్నానని పేర్కొంది. అప్పటిదాకా అతనికి తప్ప కాలేజీలో ఎవరికీ ఆ విషయం తెలియదని భావించానని తెలిపింది.

ఎంతోమంది అమ్మాయిల నగ్న ఫోటోలు..

ఎంతోమంది అమ్మాయిల నగ్న ఫోటోలు..

ఆ ఫోటో S క్రియేట్ చేసిన గూగుల్ డ్రైవ్‌లో ఉందని.. డిబేటింగ్ సొసైటీ,MUN కమిటీలకు అది తెలుసునని పేర్కొంది. ఆ డ్రైవ్ ఒక ఓపెన్ సీక్రెట్‌గా ఇప్పటికీ ఉనికిలోనే ఉందని.. తన క్లాస్‌మేట్స్ కూడా S స్నేహితుడు A ద్వారా ఆ ఫోటోలను చూశారని తెలిపింది. అయితే ఆ విషయాన్ని వారు చూసీచూడనట్టుగా వదిలేసి తనదాకా తీసుకురాలేదని వెల్లడించింది. మరో అమ్మాయి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఓరోజు S తన విజయాలను చూడమంటూ ఆ గూగుల్ డ్రైవ్‌ను ఓపెన్ చేసి తమ గ్రూపుకు చూపించే ప్రయత్నం చేశాడని.. అందులో చాలామంది అమ్మాయిల నగ్న ఫోటోలు,శృంగార ఫోటోలు ఉన్నాయని తెలిపింది. ఆ డ్రైవ్‌ను చూసేందుకు తాము ఆసక్తి కనబర్చలేదని.. అదే సమయంలో అతన్ని ఎదరించే సాహసం కూడా చేయలేదని తెలిపింది.

మరో బాధితురాలు వెల్లడించిన వివరాలు..

మరో బాధితురాలు వెల్లడించిన వివరాలు..


Sకి జూనియర్ అయిన మరో అమ్మాయి కూడా అతని వ్యవహారాన్ని బయటపెట్టింది. ఒకానొక సందర్భంలో తన నగ్న చిత్రాలను అతనికి పంపించానని.. కానీ చాలారోజుల తర్వాత తన ఫోటోలు ఆ డ్రైవ్‌లో ఉన్నట్టు తెలిసిందని పేర్కొంది. తాను వర్సిటీలో ఫస్టియర్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు డిబేటింగ్ సొసైటీ,మోడల్ యునైటెడ్ నేషన్స్(MUN) సమావేశాల్లో అతనితో పరిచయం ఏర్పడినట్టు తెలిపింది. ఓరోజు ఇద్దరం కలిసి మద్యం సేవించామని.. ఆ సమయంలో అతను సెక్స్ కోసం బలవంతపెడితే తాను వారించానని చెప్పింది. అదే రోజు రాత్రి అతనితో చాట్ చేస్తున్నప్పుడు.. అనుకోకుండానే అతనికి కొన్ని నగ్న చిత్రాలు పంపించానని తెలిపింది. యూనివర్సిటీలోని చాలామంది ఆ డ్రైవ్‌లో తన ఫోటోలు చూశారని తెలిసి షాక్ తిన్నానని పేర్కొంది.

ఇంతకీ S ఏమంటున్నాడు..

ఇంతకీ S ఏమంటున్నాడు..

వర్సిటీలో ఇప్పటికీ ఆ డ్రైవ్ సర్యులేషన్‌లోనే ఉందన్న వాదన ఉంది. అయితే మీడియా వర్గాలు Sని సంప్రదించగా.. అది పూర్తిగా ప్రైవేట్‌గానే ఉందని,ఎవరితోనూ షేర్ చేయలేదని వెల్లడించడం గమనార్హం. 2014లో వర్సిటీలో చేరిన అతను 2018లో కోర్సు పూర్తయ్యాక బయటికి వెళ్లిపోయాడు. తన డ్రైవ్‌లో ఉన్న కంటెంట్ మూడో వ్యక్తి కంటపడలేదని తాను నమ్ముతున్నానని.. అసలు మూడో వ్యక్తి ఎలా చూడగలడో తనకిప్పటికీ ఆశ్చర్యంగానే ఉందని అన్నాడు. S ఆ డ్రైవ్‌లోని ఫోటోలను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జ్యురిడికల్ సైన్సెస్‌‌లోని తన ఫ్రెండ్స్‌కి కూడా చూపించాడని Aiyoobrows ఆరోపించారు.

S స్నేహితుడు A రియాక్షన్..

S స్నేహితుడు A రియాక్షన్..


ఈ వ్యవహారంపై S స్నేహితుడు A ఒక బహిరంగ స్టేట్‌మెంట్ ఇచ్చి ఆ తర్వాత దాన్ని తొలగించాడు. దాని ప్రకారం.. 'ఈ విషయంలో నేనతన్ని ఎప్పుడూ ఎందుకు ప్రశ్నించలేదని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. చేస్తున్నది తప్పని తెలిసినా అతన్ని వారించలేదు. బహుశా అతనిపట్ల నాకున్న సున్నితత్వం కారణంగానే నేనేమీ అనలేకపోయానేమో..' అంటూ చెప్పుకొచ్చాడు. జరిగినదానికి తాను తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నాడు. అయితే తన స్టేట్‌మెంట్‌లో ఎక్కడా ఆ గూగుల్ డ్రైవ్‌కి తనకి యాక్సెస్‌ ఉందని గానీ.. ఆ ఫోటోలను ఇతరులకు చూపించానని గానీ అతను ఒప్పుకోలేదు. మొత్తం మీద జాదవ్‌పూర్ యూనివర్సిటీలో ఆ డ్రైవ్ సర్క్యులేషన్‌లో ఉందనేది నగ్న సత్యమని చాలామంది బాధిత అమ్మాయిలు చెబుతున్నారు. ఇప్పటికైతే సోషల్ మీడియాను కుదిపేస్తున్న ఈ వ్యవహారం మున్ముందు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

English summary
Just days after a private Instagram group 'Bois Locker Room' consisting a bunch of Delhi's schoolgoing kids was exposed for misusing photos of minor girls and propagating rape culture and casual sexism, a similar incident came to light in Kolkata.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X