వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేషన్ కార్డు రద్దు..? టీవీ, టూ వీలర్ ఉంటే చాలు.. మంత్రి హాట్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

రేషన్.. బియ్యం, పప్పులు, ఇతర నిత్యవసరాలు పేద ప్రజలకే అందాలి. కానీ చాలాచోట్ల ఇతరులు కూడా రేషన్ తీసుకుంటారు. టీవీ, టూ వీలర్ ఉంటే వైట్ రేషన్ కార్డు వర్తించదు. అయితే చాలా చోట్ల ఇతరులకు కూడా రేషన్ కార్డు ఉంటుంది. దీనిపై కర్ణాటక పౌరసరఫరాల శాఖ మంత్రి హాట్ కామెంట్స్ చేశారు. ఫ్రిజ్, ఖరీదైన వస్తువులు ఉంటే రేషన్ కార్డుకు అనర్హులు అవుతారని పేర్కొన్నారు.

 టీవీ, ఫ్రీజ్ ఉంటే..

టీవీ, ఫ్రీజ్ ఉంటే..

పేదల ఆకలి తీర్చే రేషన్ కార్డుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీవీ, ఫ్రిజ్, ద్విచక్ర వాహనం కలిగి ఉన్నవారికి రేషన్ కార్డుకు అనర్హులు అని మరోసారి చెప్పింది. అవీ ఉన్నవారు రేషన్ కార్డు పొందిన వారు వాటిని ప్రభుత్వానికి అప్పజెప్పాలని తేల్చి చెప్పింది. అలా చేయకుంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాలని హెచ్చరికలు జారీ చేసింది.

డెడ్ లైన్

డెడ్ లైన్

అనర్హులు తమ రేషన్ కార్డులను మార్చి 31లోపు ప్రభుత్వానికి సరెండర్ చేయాలని డెడ్‌లైన్‌ విధించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి సోమవారం బెళగావిలో కీలక ప్రకటన చేశారు. రేషన్ కార్డులను పొందేందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయని చెప్పారు. రేషన్ కార్డు దారులకు ఐదు ఎకరాలకు మించి భూమి ఉండకూదని చెప్పారు. వారి వద్ద టీవీ, ఫ్రిజ్, టూ వీలర్ కూడా ఉండరాదని తెలిపారు.

రూ.1.20 లక్షలు

రూ.1.20 లక్షలు

నిబంధనలను అతిక్రమిస్తూ రేషన్ కార్డు కలిగి ఉన్న వారు వాటిని ప్రభుత్వానికి అప్పగించాలి అని మంత్రి ప్రకటించారు. ఏడాది ఆదాయం రూ. 1.20 లక్షలకు మించిన వారెవరు రేషన్ కార్డుకు అర్హులు కారని ఆయన తేల్చిచెప్పారు. మార్చి 31లోగా వీటిని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని కర్ణాటక మంత్రి స్పష్టం చేశారు.

English summary
bpl card must surrender karnataka civil and food supplies miniter said in statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X