• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సెక్స్ వర్కర్‌గా మారిన బీపీవో ఉద్యోగి.. జాబ్ పోవడంతో తప్పని తిప్పలు.. ఎక్కడ అంటే

|

కరోనా వైరస్ సృష్టించిన విలయతాండవం చేయడంతో మార్కెట్ కుదలైపోయింది. మహమ్మారి దెబ్బకు చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. భారత్‌లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోయి బతుకు తెరువు కోల్పోయారు. అలాంటి వారిలో బెంగళూరుకు చెందిన 27 ఏళ్ల బీపీవో ఉద్యోగి ఒకరు. లాక్‌డౌన్ వల్ల ఉద్యోగం ఊడిపోవడంతో ఏం చేయాలో తోచలేదు.

కమర్షియల్ సెక్స్ వర్కర్

కమర్షియల్ సెక్స్ వర్కర్

ఇంకేముంది కుటుంబాన్ని వెళ్లదీసేందుకు కమర్షియల్ సెక్స్ వర్కర్‌గా మారాడు. విషయాన్ని తన భార్య దగ్గర దాచిపెట్టాడు. అప్పటివరకు బానే ఉన్నా ఇప్పుడా విషయం తెలిసిన భార్య విడాకులకు దరఖాస్తు చేయడంతో విషయం వెలుగు చూసింది. బీపీవోలో పనిచేస్తున్న వీరిద్దరూ 2017లో తొలిసారి ఆఫీసు క్యాంటీన్‌లో కలుసుకున్నారు. సినిమాలు, షికార్లు గురించి ఇక చెప్పేదేముంది.. రెండేళ్లపాటు ప్రపంచాన్ని మర్చిపోయి తిరిగారు. 2019లో పెళ్లి చేసుకుని సుబ్రహ్మణ్యనగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. సంసారం సంతోషంగా సాగిపోతోందనుకుంటున్న సమయంలో కరోనా మహమ్మారి వచ్చిపడింది. లాక్‌డౌన్ కారణంగా కంపెనీ అతడికి లే ఆఫ్ ఇచ్చింది.

నో జాబ్

నో జాబ్

మళ్లీ ఉద్యోగం కోసం అన్వేషణ ప్రారంభించాడు. లాక్‌డౌన్ వల్ల పరిస్థితులు తలకిందులు అవడంతో అతడి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించలేదు. ఇలాగైతే లాభం లేదని చివరికి ‘మేల్ ఎస్కార్ట్' వృత్తిని ఎంచుకున్నాడు. విషయాన్ని భార్య వద్ద దాచిపెట్టాడు. దానిని దాచిపెట్టి ఉంచలేం కదా.. ఇక్కడే అదే అయింది. భర్త ప్రవర్తనలో మార్పును భార్య గుర్తించింది. ల్యాప్‌టాప్ లేదంటే మొబైల్ ముందేసుకుని ఎప్పుడూ బిజీగా ఉండడం, తనతో మాట్లాడే సమయమే లేదన్నట్టు గడిపేస్తుండడంతో భర్తను అనుమానించక తప్పలేదు. ఎక్కడికెళ్లొస్తున్నావని ప్రశ్నిస్తే ఏవోవో కొత్త కొత్త ప్రదేశాల పేర్లు చెబుతుండడం, అంతకుమించిన వివరాలు వెల్లడించకపోవడంతో ఆమెలో అనుమానం మరింత పెరిగింది.

సోదరుడి సాయంతో..

సోదరుడి సాయంతో..

భర్త ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని నిర్ణయించుకున్న భార్య.. సోదరుడి సహాయంతో భర్త ల్యాప్‌టాప్ పాస్‌వర్డ్‌ను ఛేదించింది. ల్యాప్‌టాప్‌లోని ఓ ఫోల్డర్‌ను ఓపెన్ చేసిన ఆమె అందులోని ఫొటోలు చూసి దిగ్భ్రాంతికి గురైంది. అవన్నీ మహిళలతో సన్నిహితంగా ఉన్న ఫొటోలే. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుంది. తన భర్త ‘మేల్ ఎస్కార్ట్'గా పనిచేస్తున్నాడని. నగరంలోని క్లయింట్స్ నుంచి గంటకు రూ. 3 వేల నుంచి రూ. 5 వేల వరకు వసూలు చేస్తున్నాడని తెలుసుకుంది. భర్త చేస్తున్న ‘ఉద్యోగం' గురించి తెలుసుకున్న భార్య వెంటనే మహిళల హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించింది. విడాకులు ఇప్పించాలని వేడుకుంది. మహిళ భర్తను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు.

భార్యపై ప్రేమ

భార్యపై ప్రేమ

కమర్షియల్ సెక్స్ వర్కర్‌గా పనిచేస్తున్న మాట వాస్తవమే కానీ, భార్యపై మాత్రం చెప్పలేనంత ప్రేమ ఉందని చెప్పుకొచ్చాడు. భార్య నుంచి విడిపోవడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నాడు. ఉద్యోగాన్ని వదిలేసి కొత్త ఉద్యోగం వెతుక్కుంటానని కూడా భార్యకు ప్రమాణం చేశాడు. అయినా అందుకామె అంగీకరించలేదు. దీంతో పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని సిటీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.

English summary
bpo employee starts working as sex worker after job loss at bangalore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X