వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెమళ్ల సెక్స్: గూగుల్‌లో హాట్ టాపిక్.. సెటైర్లు మామూలుగా పడలేదు..

ఇక మరో పోస్టులో.. మగ నెమలి శృంగారంలో పాల్గొందామని అడగ్గా.. 'సారీ నేను చాలా పవిత్రమైన దానిని' అని ఆడనెమలి బదులిస్తుంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఒక అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి నిజానిజాలతో పనిలేకుండా చేసే వ్యాఖ్యలు సమాజాన్ని తప్పుదోవ పట్టించడమే అవుతుంది. గోవును జాతీయ జంతువుగా ప్రకటించడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ హైకోర్టు జడ్జి.. అక్కడితో ఆగిపోకుండా నెమళ్లపై సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు.

<strong>నెమళ్ల సెక్స్‌: ఇవీ నిజాలు.. డార్విన్ ఎప్పుడో చెప్పాడు!</strong>నెమళ్ల సెక్స్‌: ఇవీ నిజాలు.. డార్విన్ ఎప్పుడో చెప్పాడు!

బ్రహ్మచారిగా శృంగారానికి దూరంగా ఉండటం వల్లే నెమలిని జాతీయపక్షిని చేశారని ఆయన వ్యాఖ్యానించడం మరింత విడ్డూరంగా మారింది. మగ నెమలి కన్నీళ్లే ఆడ నెమలి గర్భధారణకు కారణమవుతాయంటూ చేసిన వ్యాఖ్య చాలామందిలో చాలా సంశయాలను రెకెత్తించింది. ఇంకేం అనుమానాలను నివృత్తి చేసుకోవడం కోసం చాలామంది గూగుల్ లో శోధన మొదలుపెట్టారు.

ఇవీ గూగుల్‌లో నెటిజెన్స్ వెతికిన ప్రశ్నలు:

ఇవీ గూగుల్‌లో నెటిజెన్స్ వెతికిన ప్రశ్నలు:

నిజంగా నెమళ్లు శృంగారంలో పాల్గొనవా?
ఒకవేళ శృంగారంలో పాల్గొంటే, ఎలా పాల్గొంటాయి?
ఆడ నెమలికి మగ నెమలికి తేడా ఏంటి?
నెమలి గుడ్లు పెడుతుందా?
నెమలి ఎలా పిల్లల్ని కంటుంది?..

మామూలు సెటైర్స్ కాదు:

రాజస్థాన్ హైకోర్టు జడ్డి వ్యాఖ్యల తర్వాత చాలామంది నెటిజెన్స్ ఇవే అంశాల గురించి గూగుల్‌లో వెతికారట. మరికొంతమంది నెటిజెన్స్ జడ్జి వ్యాఖ్యల పట్ల ట్విట్టర్ లో వ్యంగ్యస్త్రాలు సంధించారు. నెమళ్లు ఇంటర్ కోర్సులో పాల్గొంటున్న ఫోటో పెట్టి.. ఆడ నెమలి మగ కన్నీళ్లు తాగుతున్న అరుదైన ఫోటో అని ఎద్దేవా చేశారు.

ఇక మరో పోస్టులో.. మగ నెమలి శృంగారంలో పాల్గొందామని అడగ్గా.. 'సారీ నేను చాలా పవిత్రమైన దానిని' అని ఆడనెమలి బదులిస్తుంది. దీంతో తనకు ఏడుపొస్తుందని మగ నెమలి బాధపడుతుంది. దీనికి బదులిస్తూ.. 'వద్దు ప్లీజ్.. నువ్వు ఏడిస్తే.. నీ కన్నీళ్లతో నేను గర్భం దాల్చే ప్రమాదముంది' అని ఆడ నెమలి కౌంటర్ ఇస్తుంది.

సోషల్ మీడియాలో చర్చ:

హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు అవగాహన రహితం అంటూ సోషల్ మీడియాలో చాలామంది ఆయన్ను విమర్శిస్తున్నారు. ఒక అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. సృష్టి ధర్మానికి విరుద్దంగా ఏ ప్రాణి కూడా పునురత్పత్తి చేయలేదన్న విషయం తెలియకపోతే ఎలా? అని నిలదీస్తున్నారు. మొత్తంగా జడ్డి మహేశ్ చంద్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీశాయి. అదే సమయంలో కామెడీ సెటైర్లు సైతం గట్టిగానే పేలుతున్నాయి.

English summary
Today, ‘How peacocks have sex’ became the most searched question on peacocks on search engine Google after Justice Mahesh Chandra Sharma compared cows with peacocks saying that peacocks are brahmachari since they don’t have sex.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X