వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రాహ్మణులకు పుట్టుకతోనే గౌరవం: స్పీకర్ ఓం బిర్లా వ్యాఖ్యలపై విమర్శలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బ్రాహ్మణులు పుట్టికతోనే గౌరవాన్ని అందుకుంటారని, వారి అంకితభావం, త్యాగం ఇతర వర్గాలకు మార్గదర్శనం చేస్తుందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వ్యాఖ్యానించారు. ఆదివారం కోటాలో జరిగిన అఖిల్ బ్రాహ్మిణ్ మహాసభలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు.

సమాజంలో బ్రాహ్మణులకు ఉన్నతస్థానం ఉంది. బ్రాహ్మణుల త్యాగం, అంకిత భావం సమాజంలోని ఇతర వర్గాలకు మార్గదర్శనంగా నిలుస్తోందని ఓం బిర్లా వ్యాఖ్యానించారు. దేశానికి మార్గనిర్దేశనం చేయడంలో ఈ కమ్యూనిటీ పాత్ర కీలకమని అన్నారు.

 ‘Brahmins are held in high regard by virtue of birth’: Lok Sabha Speaker Om Birla

సమాజంలో విద్యా, విలువలు పెంపొందించడంలో బ్రాహ్మణుల పాత్ర ఎనలేనిదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కాలంలో కూడా గ్రామంలో ఒక్క బ్రాహ్మణ కుటుంబం గుడిసెలో ఉన్నప్పటికీ వారు గౌరవింపడబతారని అన్నారు. సమాజానికి వారు చేస్తున్న సేవలే ఇందుకు కారణమని ఓం బిర్లా అన్నారు. దేశంలో బ్రాహ్మణ సమాజానికి చెందిన వారే ఎక్కువగా గురువులుగా ఉన్నారని అన్నారు.

ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. అయితే, కొందరు ఆయన వ్యాఖ్యలకు విరుద్ధంగా స్పందిస్తున్నారు. స్పీకర్ స్థానంలో ఉండి ఒక కమ్యూనిటీ ఇలా పొగడటం సరికాదని అంటున్నారు. రాజస్థాన్ పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్(పీయూసీఎల్) అధినేత కవితా శ్రీవాస్తవ ఆయన వ్యాఖ్యలను ఖండించారు. బిర్ల వ్యాఖ్యలపై తాము రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని అన్నారు.

English summary
Lok Sabha Speaker Om Birla said that Brahmins are held in high regard by birth because of their dedication, sacrifice and for guiding other communities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X