వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచంలోనే అత్యంత వేగం: బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి బ్రహ్మోస్‌ ప్రయోగం విజయవంతమైంది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి గురువారం ఉదయం బ్రహ్మోస్‌ను విజయవంతంగా ప్రయోగించారు. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ), బ్రహ్మోస్‌ శాస్త్రవేత్తలు, భారత సైన్యం ఆధ్వర్యంలో క్షిపణిని పరిశీలించారు.

ఈ ప్రయోగంలో క్షిపణి నిర్దేశిత లక్ష్యాన్ని చాలా కచ్చితత్వంతో చేరుకుందని అధికారులు వెల్లడించారు. బ్రహ్మోస్‌ను గత ఏడాది నవంబరులో సుఖోయ్‌ యుద్ధ విమానం నుంచి విజయవంతంగా ప్రయోగించారు.

BrahMos sucessfully test fired from Pokhran

కాగా, ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్‌ సోనిక్‌ క్రూయీజ్‌ క్షిపణి ఇది. దీని బరువు దాదాపు 2.5టన్నులు, పొడవు 8.4మీటర్లు. ఇది సుమారు 200 నుంచి 300 కేజీల బరువైన వార్‌హెడ్‌ను మోసుకుపోగలదు. దీనిని భూమి, ఆకాశం, సముద్రం నుంచి కూడా ప్రయోగించవచ్చు. బ్రహ్మోస్‌ను డీఆర్డీఓ, రష్యాకు చెందిన రాకెట్‌ డిజైన్‌ బ్యూరో సంస్థ సంయుక్తంగా తయారు చేశాయి.

English summary
Supersonic cruise missile Brahmos was on Thursday successfully test fired from Pokhran test range in Rajasthan. Dubbed as one of the most lethal weapons systems that currently exist in the world, BrahMos is capable of flights at supersonic speeds, making it hard for enemy radar to track.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X