వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్‌ దీదీ దాదాగిరీకి బ్రేకులు..! పక్కా ప్రణాళికతో చెక్ పెట్టిన మోదీ, షా..!!

|
Google Oneindia TeluguNews

కోల్ కత/హైదరాబాద్: పశ్చిమ బెంగాల్‌లో దీదీ మమత బెనర్జీ, గత కొన్నేళ్లుగా సాగిస్తున్న దాదాగిరీకి చెక్ పడినట్టైంది. అందరూ ఊహించినట్టుగానే అక్కడ బీజేపీ పుంజుకుంది. మొత్తం 42 లోక్‌‌సభ నియోజకవర్గాలకుగాను బీజేపీ 18 స్థానాల్లో గెలుపు దిశగా పయనిస్తోంది. మమత పార్టీ టీఎంసీ బాగా దెబ్బతిన్నది. 2014 ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలుచుకున్న బీజేపీ, ఇప్పుడు ఏకంగా 18 స్థానాల్లో పాగా వేయబోతున్నట్టుగా కనిపిస్తోంది. రెండున్నర దశాబ్దాలకు పైగా ఈ రాష్ట్రాన్ని ఏలిన సీపీఎం నాయకత్వంలోని వామపక్ష కూటమికి చావుదెబ్బ తగిలింది. ఇంకొక మాటలో చెప్పాలంటే... ఆ పార్టీ తనంతట తానే 'ఆత్మహత్య' చేసుకుందని చెప్పొచ్చు.

బెంగాల్ లో దీదీ దూకుడు..! మొదటికే మోసం తెచ్చిన మమత వైఖరి..!!

బెంగాల్ లో దీదీ దూకుడు..! మొదటికే మోసం తెచ్చిన మమత వైఖరి..!!

బెంగాల్ లో మొత్తం 42 లోక్ సభ స్థానాలకు గాను 2014లో టీఎంసీ 34 సీట్లు సాధించింది. ఇప్పుడు ఇందులో కొన్నింటిని బీజేపీ లాగేసుకుంది. వామపక్షాలకున్న రెండు సీట్లు కూడా పోయాయి. సీట్లు, ఓట్లు లెక్కలను పక్కన పెడితే... ఈ రాష్ట్రంలో బీజేపీ బలపడడానికి అసలు కారణాలేమిటి..? మూల కారకులెవరు...? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం విచిత్రంగా కనిపిస్తోంది. బీజేపీని పెంచి పోషించింది... టీఎంసీ, వామపక్షాలు (ప్రధానంగా సీపీఎం). వాస్తవ విరుద్ధంగా అనిపించే నిజమిది.
బీజేపీ బలపడడానికి వామపక్షాలు, ప్రధానంగా సీపీఎం ఎలా కారణమయ్యాయో అనేది కూడా కీలక అంశమే.

మండ్యలో సుమలత భారీ విజయం, సీఎం కుమారస్వామికి ఎదురు దెబ్బ, పరువు ప్రతిష్ట అంటే ! మండ్యలో సుమలత భారీ విజయం, సీఎం కుమారస్వామికి ఎదురు దెబ్బ, పరువు ప్రతిష్ట అంటే !

సీపిఎం మమత మద్య పొసగని రాజకీయం..! బలపడ్డ బీజేపి..!!

సీపిఎం మమత మద్య పొసగని రాజకీయం..! బలపడ్డ బీజేపి..!!

కేవలం 14 నెలల్లో త్రిపురలో బీజేపీ ఏం చేసిందో గుర్తు చేసుకోవాలని, బెంగాల్లో బీజేపీకి మద్దతునిస్తే, ఆత్మహత్య చేసుకున్నట్టేనని హెచ్చరించారు. సీపీఎం నేత చేయవద్దని చెప్పిన పనినే, ఆ పార్టీ శ్రేణులు చేసి చూపించారు. బెంగాల్లో ఆనాడు టీఎంసీ బలపడడానికి, ఈనాడు బీజేపీ బలపడడానికి సీపీఎం నాయకత్వ వైఫల్యాలే ప్రధాన కారణాలయ్యాయి. ఆ పార్టీ ప్రభుత్వ అవలంబించిన ప్రజావ్యతిరేక, తిరోగమన విధానాలు, విశృంఖల హింసాత్మక రాజకీయాలతో విసుగెత్తిన, కోపోద్రిక్తులైన అక్కడి ప్రజలకు ఆనాడు ప్రత్యామ్నాయంగా టీఎంసీ కనిపించింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అటువైపు మళ్లాయి. ఫలితంగా, సీపీఎం ఆధ్వర్యంలోని వామపక్ష ప్రభుత్వం కుప్పకూలింది. టీఎంసీ అధికారంలోకి వచ్చింది. ఆనాడు సీపీఎం చేసిన అరాచకాలకు బదులు తీర్చుకుంది. టీఎంసీ ప్రభుత్వానికి తమ పార్టీ శ్రేణుల ప్రయోజనాలే... మొత్తం ప్రజల ప్రయోజనాలుగా కనిపించాయి.

పాగా వేసిన బీజేపి..! మమత ఏకపక్ష నిర్ణయాలే కొంపముంచాయి..!!

పాగా వేసిన బీజేపి..! మమత ఏకపక్ష నిర్ణయాలే కొంపముంచాయి..!!

బెంగాల్ లో టీఎంసీ శ్రేణులు కూడా అరాచక వాదులుగా మారారు. సీపీఎం నాయకులపై, శ్రేణులపై భౌతిక దాడులు పెరిగాయి. వాళ్లంతా కకావికలమయ్యారు. వారికి దిశానిర్దేశం చేయగల నాయకత్వం కొరవడింది. కొన్నిచోట్ల, సీపీఎం కార్యాలయాలకు నెలలతరబడి తాళాలు తెరవలేదంటే... అక్కడ ఎంతటి భయానక పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. దీంతో, సహజంగానే టీఎంసీపై సీపీఎం, ఇతర వామపక్ష శ్రేణుల్లో తీవ్య వ్యతిరేకత పెరిగింది. టీఎంసీని ఎలా ఎదుర్కోవానే వ్యూహం పన్నగల, కార్యాచరణ రూపొందించగల, దిశానిర్దేశం చేయగల నాయకత్వమే సీపీఎంలో కనిపించడం లేదు. అనివార్య పరిస్థతుల్లో నేను కూడా బీజేపీలో చేరాల్సొచ్చింది అని చెప్పారు. కూచ్ బిహార్ నంచి సిలిగురి, మాల్దా నుంచి అసన్ సోల్, సింగూర్-నందిగ్రామ్ నుంచి కోల్ కతా వరకు సీపీఎం, ఇతర వామపక్ష శ్రేణులంతా ఇలాగే ఆలోచించారు. ప్రజల్లో కూడా అక్కడి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెల్లుబకింది. ఇవన్నీ, ఒకే దిశగా సాగాయి. దీని ఫలితమే ఈ ఎన్నికల ఫలితాలుగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

ఇకనైనా దీదీ ఆవేశం తగ్గాలి..! లేకపోతే మొదటికే మోసం వచ్చే అవకాశం..!!

ఇకనైనా దీదీ ఆవేశం తగ్గాలి..! లేకపోతే మొదటికే మోసం వచ్చే అవకాశం..!!

బెంగాల్లోని విపక్ష లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఉన్నాయి. ఈ కూటమి, 34 ఏళ్లపాటు బెంగాల్ రాష్ట్రాన్ని పాలించింది. 2011 ఎన్నికల్లో ఇక్కడి ఎర్రకోట కుప్పకూలింది. ఆ తరువాత, లెఫ్ట్ ప్రాభవం, బలం క్రమ క్రమంగా తగ్గింది. ఇలా ఏర్పడిన ప్రతిపక్ష ఖాళీని బీజేపీ భర్తీ చేసింది. ఇక్కడ, వామపక్ష ఫ్రంట్ బలహీనమే... బీజేపీకి బలంగా మారింది. ఈ రాష్ట్రంలోని వామపక్ష ఓటింగ్ అంతా కూడా బీజేపీ వైపు వెళుతోందని, ఎన్నికలకు ముందు బెంగాల్లోని రాజకీయ పరిశీలకుడు ప్రసేన్ జిత్ బోస్, జాదవ్ పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సమంతక్ దాస్ వంటి ఎంతోమంది చెప్పిన విషయాలు, పత్రికల్లో వచ్చిన కథనాలు అక్షరాలా నిజమయ్యాయి. మూడు ముక్కల్లో చెప్పాలంటే... ఒకప్పటి ఎర్రకోటను టీఎంసీ దెబ్బతీసింది. మమత కట్టుకున్న కోటను బీజేపీ కుప్పకూల్చింది. ఇప్పుడు పాగా వేసింది. అక్కడ మరో రెండు మూడేళ్లకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా దీదీని గద్దె దించుతుంది. అంటే వామపక్షాలు... ఇటు టీఎంసీ తమలో తాము తన్నుకుని, చంపుకుని... తమ ఉమ్మడి శతృవైన బీజేపీకి ప్రాణం పోశారు.

English summary
In West Bengal, Didi Mamata Banerjee has been getting back in the politics. As everyone imagined, the BJP was revived. The BJP is going to win 18 seats for all the 42 Lok Sabha constituencies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X