వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శోభాడేకు మహరాష్ట్ర అసెంబ్లీ నోటీస్: స్టే విధించిన సుప్రీం కోర్టు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రముఖ నవలా రచయిత్రి శోభాడేకు మహారాష్ట్ర శాసనసభ అధికారులు ఇచ్చిన హక్కుల ఉల్లంఘన నోటీసుపై మంగళవారం సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ మేరకు మహారాష్ట్ర శాసనసభ అధికారులకు నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు ఈ అంశంపై 8 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

మరాఠీ చిత్రాల ప్రదర్శనపై ఇటీవల శోభాడే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆమెకు శాసనసభ అధికారులు హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో శోభాడే ట్వీట్స్‌ను పరిశీలించిన దీపక్ మిశ్రా, పిసి పంత్ ద్విసభ్య బెంచ్, ఆమె చేసిన ట్వీట్స్ అన్ని కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయే తప్ప అసెంబ్లీ హక్కులను అతిక్రమించలేదన్నారు.

మహారాష్ట్రలోని మల్టీప్లెక్స్ సినిమాహాళ్లలో సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల మధ్య మరాఠీ చిత్రాలే ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో శోభాడే ట్విట్టర్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ దృష్టి ఎద్దుమాంసం నుంచి సినిమాలపై పడింది.

Breach of privilege notice: SC stays proceedings against Shobhaa De

ఇక ముంబై మల్టీపెక్స్‌లలో పాప్‌కార్న్ బదులు దహి మిసాల్, వడాపావ్ మాత్రమే లభిస్తాయి. మరాఠీ చిత్రాల్ని ఎప్పుడు, ఎక్కడ చూడాలో మాకు తెలుసు. ఫడ్నవిస్ దాదాగిరికి ఇది నిదర్శనం అంటూ ట్విటర్‌లో ట్వీట్ చేశారు. ఈ అనుచిత వ్యాఖ్యలకు గాను శోభాడేపై బుధవారం అసెంబ్లీలో సభాహక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

తనపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టారన్న విషయం తెలుసుకున్న శోభాడే "క్షమాపణలు కోరుతూ నాపై సభహక్కుల ఉల్లంఘన తీర్మానమా? నేను మహారాష్ట్రవాసినే. మరాఠీ చిత్రాలంటే ఇప్పుడు.. ఎప్పుడూ ఇష్టమే." అని పేర్కొన్నారు.

శోభాడే వ్యాఖ్యలకు గాను శివసేన ఆమెపై మండిపడింది. ముంబైలోని ఆమె నివాసం ఎదుట ధర్నా కూడా నిర్వహించారు. శోభాడేకు మహారాష్ట్రలో నివసించే హక్కులేదని నినాదాలు చేశారు. మరాఠి సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడేందుకు ఆనాడు ఛత్రపతి శివాజీ, బాల్‌ఠాక్రే దాదాగిరి చేయలేదని పేర్కొన్నారు.

English summary
The Supreme Court on Tuesday stayed proceedings against author Shobhaa De on the breach of privilege notice issued by the Maharashtra assembly for her tweets over the state government order on Marathi films.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X