వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పఠాన్‌కోట్ దాడి: 'సీరియస్ విషయం, అసలేం జరిగింది.. మోడీ చెప్పాలి'

By Srinivas
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: పఠాన్‌కోట్ ఉగ్ర దాడి పైన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికైనా మౌనం వీడాలని, ఏం జరిగిందో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ గురువారం నాడు డిమాండ్ చేశారు.

ప్రధాని మోడీ ఇప్పటికైనా పెదవి విప్పాలన్నారు. పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్‌కోట్ పైన దాడి గురించి మట్లాడాలన్నారు. ఉగ్రవాదుల చొరబాట్లను నివారించడంలో లొసుగులు బయటపడ్డాయని, అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

Break silence on Pathankot attack, Antony tells Modi

కాబట్టి ప్రధాని మోడీ ఇప్పటికైనా జరిగింది ఏమిటో దేశ ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రధాని మోడీ పాకిస్తాన్ పర్యటన అనంతరం ఈ దాడి జరిగిందన్నారు. కాబట్టి ఈ దాడి ఎందుకో తెలుసుకోవాలని దేశం అనుకుంటోందన్నారు.

ఇది చాలా సీరియస్ విషయమన్నారు. ప్రధాని మోడీ ఈ విషయంలో ఎంతమాత్రం మౌనం వహించలేరన్నారు. కచ్చితంగా అతను మాట్లాడాల్సిందేనని చెప్పారు. అసలు ఏం జరిగిందనే విషయం ఆయన భారత జాతికి చెప్పాలన్నారు.

English summary
Former defence minister AK Antony on Thursday said Prime Minister Narendra Modi should break his silence on the terror attack at the Indian Air Force base in Pathankot in Punjab.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X