వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్లీన్‌చిట్: గోద్రా అల్లర్లపై తేలిపోయిన అపోహలు

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: 2002లో గుజరాత్‌లో చోటు చేసుకున్న అల్లర్లలో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాత్ర ఉందన్న ఆరోపణలు అవాస్తవమని తేలిపోయాయి. అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు గురువారం వెలువరించిన తన తీర్పులో నరేంద్ర మోడీకి క్లీన్ ఇచ్చింది. ఆయనపై ఉన్న ఆరోపణలకు ఆధారాల్లేవని తన తీర్పులో కోర్టు పేర్కొంది. ఈ తీర్పు నరేంద్ర మోడీపై వస్తున్న ఆరోపణలు, అనుమానాలకు ముగింపు పలికేలా చేసిందని చెప్పవచ్చు.

కాగా 2002 అల్లర్లపై అపోహాలు, ఆరోపణలు పునరావృతమవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు అల్లర్లపై సిట్(ఎస్ఐటి) నివేదికను, దానికి సంబంధించిన ఇతర రుజువులను ఒక్కసారి పరిశీలిద్దాం.

సైనికులకు 3 రోజుల ఆలస్యంగా పిలుపు

అల్లర్లు జరిగిన మూడు రోజుల తర్వాత, అంటే చాలా ఆలస్యంగా ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అల్లర్లను నియంత్రించేందుకు సైనికుల సహాయాన్ని కోరినట్లు గుజరాత్ కుటీర పరిశ్రమల వ్యతిరేక సభ్యులు ఆరోపించారు.

వాస్తవమేమిటంటే... అల్లర్లు జరిగిన వెంటనే ఫిబ్రవరి 28న గుజరాత్ ప్రభుత్వం సైనికుల సహాయం కోరిందని సిట్ నివేదిక తెలిపింది. అయితే సైనికులు భారత సరిహద్దులో ఉన్నందు వల్ల వారు గుజరాత్ రాష్ట్రానికి మార్చి 1న చేరుకున్నారని సిట్ తన నివేదికలో పేర్కొంది. గుజరాత్ సరిహద్దు రాష్ట్రాలైన కాంగ్రెస్ పాలిత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలను అల్లర్లను వ్యాపించకుండా ఉండేందుకు గుజరాత్ ప్రభుత్వం సహాయం కోరినట్లు వెల్లడైనట్లు సిట్ తెలిపింది.

2002, ఫిబ్రవరి 28న సైనికుల సహాయం కోరిన మోడీ

2002, ఫిబ్రవరి 28న సైనికుల సహాయం కోరిన మోడీ

అల్లర్లు జరిగిన వెంటనే ఫిబ్రవరి 28న గుజరాత్ ప్రభుత్వం సైనికుల సహాయం కోరిందని సిట్ నివేదిక తెలిపింది. అయితే సైనికులు భారత సరిహద్దులో ఉన్నందు వల్ల వారు గుజరాత్ రాష్ట్రానికి మార్చి 1న చేరుకున్నారని సిట్ తన నివేదికలో పేర్కొంది.

2002, ఫిబ్రవరి 28న సైనికుల సహాయం కోరిన మోడీ

2002, ఫిబ్రవరి 28న సైనికుల సహాయం కోరిన మోడీ

అల్లర్లు జరిగిన వెంటనే ఫిబ్రవరి 28న గుజరాత్ ప్రభుత్వం సైనికుల సహాయం కోరిందని సిట్ నివేదిక తెలిపింది. అయితే సైనికులు భారత సరిహద్దులో ఉన్నందు వల్ల వారు గుజరాత్ రాష్ట్రానికి మార్చి 1న చేరుకున్నారని సిట్ తన నివేదికలో పేర్కొంది.

బాధితులకు మోడీ పరామర్శ

బాధితులకు మోడీ పరామర్శ

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి ఎల్‌కె అద్వానీ‌తో కలిసి అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో మార్చి 3, 2002లో పర్యటించినట్లు సిట్ తన నివేదికలో స్పష్టం చేసింది.

బాధితుల పునరావాసం

బాధితుల పునరావాసం

బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గుజరాత్ ప్రభుత్వం పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి అన్ని వసతులను కల్పించింది. గుజరాత్ రాష్ట్ర గవర్నర్ అధ్యక్షతన నరేంద్ర మోడీ పునరావాస శిబిరాలను పర్యవేక్షించేందుకు ఓ కమిటీని కూడా వేశారు.

సమావేశానికి సంజీవ్ భట్ హాజరు కాలేదు

సమావేశానికి సంజీవ్ భట్ హాజరు కాలేదు

2002, ఫిబ్రవరి 27న జరిగిన సమావేశంలో ‘హిందువులు తమ ఆగ్రహాన్ని వెల్లడించడాన్ని అడ్డుకోవద్దు' అనే వ్యాఖ్యలు మోడీ చేశారని సంజీవ్ భట్ ఆరోపణలు చేశారు. రాష్ట్ర డిజిపి కె చక్రవర్తితో కలిసి తాను సమావేశానికి హాజరయ్యానని తెలిపారు. అయితే డిజిపి మాత్రం తనతో సంజీవ్ భట్ రాలేదని, సమావేశంలో పాల్గొనలేదని తెలిపారు.

అహ్మదాబాద్‌లో సంజీవ్ భట్

అహ్మదాబాద్‌లో సంజీవ్ భట్

సంజీవ్ భట్ నరేంద్ర మోడీ జరిపిన సమావేశంలో పాల్గొన లేదనే వాస్తవం సిట్ విచారణలోనూ బయటపడటం గమనార్హం. సమావేశ సమయంలో సంజీవ్ భట్ అహ్మదాబాద్‌లో ఉన్నట్లు అతని కాల్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.

సంజీవ్ భట్‌కు కాంగ్రెస్ మద్దతు

సంజీవ్ భట్‌కు కాంగ్రెస్ మద్దతు

మాజీ ఐపిఎస్ అధికారి సంజీవ్ భట్ ప్రతిపక్షపక్షమైన కాంగ్రెస్ చేతిలో పావులామారి ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు వారి పూర్తి మద్దతు కూడా అతనికి ఉన్నట్లు ఈ పత్రం ద్వారా వెల్లడవుతోంది.

నరేంద్ర మోడీ అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించలేదు

ఇది సత్యదూరమైన ఆరోపణ. ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి ఎల్‌కె అద్వానీ‌తో కలిసి అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో మార్చి 3, 2002లో పర్యటించినట్లు సిట్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఆ తర్వాతి రోజు కూడా అల్లర్లు జరిగిన సౌరాష్ట్ర, భావనగర్ ప్రాంతాల్లో పర్యటించారు. గుజరాత్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం వల్ల ఓ మదర్సాలో సుమారు 500మంది విద్యార్థులు రక్షించబడ్డారు. మార్చి 5న మరోసారి అల్లర్లు జరిగిన అహ్మదాబాద్‌లో నరేంద్ర మోడీ పర్యటించినట్లు సిట్ నివేదిక పేర్కొంది. దాదాపు మూడు రోజులపాటు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో మోడీ పర్యటించి, సర్వే నిర్వహించారు. ఇదంతా గుర్తించకుండా కొందరు కావాలనే పదే పదే దీనిపై ఆరోపణలు చేయడం గమనార్హం.

పునరావాసం కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు

ఇటీవల ముజఫర్‌నగర్‌లో జరిగిన అల్లర్ల అనంతరం తమ సొంత పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలపై సమాజ్ వాది పార్టీ అధినేత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ శిబిరాల్లో బాధితులు ఎవరూ ఉండటం లేదని, రాజకీయ పార్టీల సభ్యులే ఉన్నారని అన్నారు. ఇలాంటి అసాధారణ ప్రకటన చేసిన ములాయంపై స్పందించని నాయకులు, ఎలాంటి ఆధారాలు లేకున్నా నరేంద్ర మోడీపై ఆరోపణలు చూపేందుకు ఉత్సాహం చూపిస్తుండటం విచారకరం. అయితే గుజరాత్‌లో బాధితుల కోసం మోడీ తీసుకున్న చర్యలను ఒక్కసారి పరిశీలిద్దాం.

బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గుజరాత్ ప్రభుత్వం పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి అన్ని వసతులను కల్పించింది. గుజరాత్ రాష్ట్ర గవర్నర్ అధ్యక్షతన నరేంద్ర మోడీ పునరావాస శిబిరాలను పర్యవేక్షించేందుకు ఓ కమిటీని కూడా వేశారు. ఈ కమిటీలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సిఎం అమర్ సింగ్ చౌదరి, ప్రతిపక్ష నేత నరేష్ పటేల్, మాజీ సిఎం కేశూభాయి పటేల్, ఇలాబెన్ భట్ (ఎస్ఈడబ్ల్యూఏ), ప్రముఖ గాంధేయవాది పద్మశ్రీ ఈశ్వరీభాయి పటేల్, నరేంద్ర మోడీతోపా సభ్యులుగా ఉన్నారు.

హిందువులను ఆగ్రహం వ్యక్తం చేయనివ్వండని మోడీ అన్నారు

ఇలాంటి ఆరోపణలు మోడీపై పదే పదే వస్తున్నాయి. అయితే సిట్ తన విచారణలో వెల్లడించినన అంశాలు ఇందుకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండటం గమనార్హం. గుజరాత్‌లో 2002, ఫిబ్రవరి 27 నాటి సమావేశంలో అల్లర్లపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అందరు అధికారులు కూడా మోడీ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని వెల్లడించారు. ఆ సమావేశంలో ‘హిందువులు తమ ఆగ్రహాన్ని వెల్లడించడాన్ని అడ్డుకోవద్దు' అనే వ్యాఖ్యలు మోడీ చేయలేదని, రాష్ట్రంలో హింసకు అడ్డుకట్టవేసి, శాంతి నెలకొల్పేందుకు చర్యలు చేపట్టాలని మాత్రమే చెప్పారని సమావేశంలో పాల్గొన్న ఉన్నతాధికారులు తెలిపారు. ఆరోపణలు చేస్తున్న వారు చెప్తున్నట్లు ఈ సమావేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా పాల్గొనలేదు.

న్యాయం కోసం సంజీవ్ భట్ నిజాయితీగా పోరాడుతున్నారు

నరేంద్ర మోడీపై వచ్చిన చాలా ఆరోపణలు మాజీ ఐపిఎస్ సంజీవ్ భట్ చేసిన ఆరోపణలపైనే ఆధారపడి ఉన్నాయి. అయితే సంజీవ్ భట్ ఆరోపణల్లోనే వాస్తవం లేకపోవడం గమనార్హం. 2002, ఫిబ్రవరి 27న జరిగిన సమావేశంలో ‘హిందువులు తమ ఆగ్రహాన్ని వెల్లడించడాన్ని అడ్డుకోవద్దు' అనే వ్యాఖ్యలు మోడీ చేశారని సంజీవ్ భట్ ఆరోపణలు చేశారు. రాష్ట్ర డిజిపి కె చక్రవర్తితో కలిసి తాను సమావేశానికి హాజరయ్యానని తెలిపారు. కానీ డిజిపి మాత్రం తనతో సంజీవ్ భట్ రాలేదని, సమావేశంలో పాల్గొనలేదని తెలిపారు. సమావేశ సమయంలో సంజీవ్ భట్ అహ్మదాబాద్‌లో ఉన్నట్లు అతని కాల్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. కాగా సంజీవ్ భట్ ఆ సమావేశంలో పాల్గొన లేదనే వాస్తవం సిట్ విచారణలోనూ బయటపడటం గమనార్హం. సంజీవ్ భట్ లాంటి అధికారులు ప్రతిపక్షాల చేతిలో పావులామారి ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
In modern day India, Narendra Modi's "alleged role" in 2002 represents the tallest towers of treachery, constructed on the pillars of lies, insinuations and distortions. After yesterday's Ahmedabad Metropolitan court order, it becomes imperative to clear the cobwebs of doubt and let the truth shine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X